Search This Blog

Monday, October 31, 2011

కదిలే కాలంతో...

                                                నడిచే పాదాలకో గమ్యం లేదు
                                 చీకటి దారులకీ అంతం లేదు
                                 ఉరికే ఊహలకు అదుపు లేదు
                                  ఎదురుచూపులకు అలుపు రాదు
                                  కాలం కదులుతూనే ఉంది
                                  కదిలే కాలంతో కలలు కూడా .,
                                  ఊపిరిలో ఆశను నింపుకుని
                                   నేలపై వెలుగును పరుస్తున్నా .,
                                  ఆ వెలుగులలోనే పయనించాలని
                                       కాలం నేనై కదిలిపోతూ ...! 
 

11 comments:

  1. "ఉరికే ఊహలకు అదుపు లేదు
    ఎదురుచూపులకు అలుపురాదు"

    కవిత, కవితకు తగిన చిత్రం రెండూ బాగున్నాయండీ..

    ReplyDelete
  2. ఆ వెలుగులలోనే పయనించాలని
    కాలం నేనై కదిలిపోతూ ...!

    చక్కటి ఆశావాదం. బావు౦ది శుభా.

    ReplyDelete
  3. భావుకత, దానికి తగ్గ పదజాలంతో కూడిన మీ కవిత చాలా చాలా బాగుంది! ఆశను ఊపిరిలో నింపి నేలపై వెలుగును పరిచి మీరొక్కరే జీవిత ప్రయాణం సాగించటం కాదు! అదే ఆశను, ఆనందానుభూతులను అన్నిటినీ కలిపి కలంలో సిరాగా మార్చి ఆ కవితా జ్యోతితో మాకందరికీ కూడా దారి చూపించాలి మరి!

    ReplyDelete
  4. @సుభ
    మీ గమ్యం ఎంత దూరమైనా ఒక్కో అడుగు దానిని చేరువచేస్తునే ఉంటుంది ...
    ఆ ప్రయత్నంలో మీ కళ మీకు తోడుగా వెలుగును ప్రసరింప జేస్తోంది ..
    అ వెలుగులో నేను మార్గాన్ని అనుసరిస్తూ...
    అందులో ఒక కణముగా మీకు సాయపడగలను అనుకుంటా...

    చాలా బాగా గీసారు మీ మనోభావం తెలిపేలాగా . తాత్పర్యం కూడా అ చిత్రాన్ని అందుకునేలా ఉంది.. మొత్తానికి ఈ టపా లో మనసుకు ఆలోచనకు పెళ్లి చేసారు చెప్పాలంటే.

    ReplyDelete
  5. కదిలే కాలంతో
    ఆశాధృక్పదంతో
    వెలుగువైపు మీ పయనం
    నలుగురికి కావాలి ఆదర్శం.

    ReplyDelete
  6. @ రాజి గారు ధన్యవాదాలండీ..

    @ జ్యోతి గారూ ధన్యవాదాలు..

    ReplyDelete
  7. @ రసజ్ఞా గారు తప్పకుండా అండీ ! మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    @ కల్యాణ్ గారు మనసుకు ఆలోచనకు పెళ్ళి.. బాగుంది మీ వ్యాఖ్య. ధన్యవాదాలండీ.

    @ పద్మ గారు ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి.

    ReplyDelete
  8. చాలా బావుందండీ కాలంతో కదిలిపోవడం..
    కవిత, బొమ్మ రెండూ బావున్నాయి..

    ReplyDelete
  9. మధుర వాణి గారూ మీ మదురమైన వాణి వినిపించి నా బ్లాగు పులకరించింది. నా బ్లాగు దర్శించినందుకు మరియు చక్కని వ్యాఖ్య ఉంచినందుకు మీకు ధన్యవాదాలు.

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !