Search This Blog

Tuesday, October 25, 2011

శుభాకాంక్షలు...

 కాకరపువ్వొత్తుల కరచాలనాలు
మతాబుల ముచ్చట్లు
తారాజువ్వల సంబరాలు
చిచ్చుబుడ్డి చిరునవ్వులు
కలిసి తేవాలి ప్రతి ముంగిలిలో
వెల లేని ఆనందాలు ! !


అందరికీ దీపావళి శుభాకాంక్షలు...

10 comments:

 1. మొత్తానికి టపాకాయల చేత మాట్లాడించేసారు... బాగుంది... మీకును నా దీపావళి శుభాకాంక్షలు :)

  ReplyDelete
 2. సంబరాల ముంగిలిలో కరచాలనాలతో కూడిన ముచ్చట్లతో చిరు నవ్వులు వెల్లి విరుస్తున్నాయి. మీకు కూడా దీపావళి సుభా కాంక్షలు!

  ReplyDelete
 3. చిమ్మ చీకట్లు నిండిన ఆకాశాన
  అకస్మాత్తు గా వెలిగే ప్రకాశాలతో ఆలింగానాలు !
  మిరుమిట్లు గొలిపే వెలుగు జిలుగుల వైభవం తిలకించే బుడుగులకు ముద్దులు
  ఆనంద దోలికలలో మునిగి నేటికి తన పేరుకి " స "కారాన్ని జోడించిన అంబరాలు (సంబరాలు)
  అన్ని కలసి తెచ్చాయి మీ మా ఇంటికి
  విరివిగా విరబూసిన వెలుగులు
  ఆత్మానందం కలిగించే అమృత ఘడియలు !!
  సర్వులకు శుభాకాంక్షలు !!

  ReplyDelete
 4. సుభా తారా జువ్వల తోరణాలు మారిస్తే ప్రాస ఇంకా బావుంటుందేమో! చిన్న సలహా మాత్రమే..మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.

  ReplyDelete
 5. @ కల్యాణ్ గారూ టపాకాయలు మాట్లాడతాయండీ.. మతాబులేమో ఆగి ఆగి చక్కగా ముచ్చట్లు పెడతాయా, కాకరపువ్వొత్తులేమో ఒకరిది ఇంకొకరిదాంతో వెలిగిస్తే మరి కరచాలనమేగా... అలా అన్న మాట. మీక్కూడా దీపావళి శుభాకంక్షలండీ.. దన్యవాదాలు..

  @ రసజ్ఞ గారు ధన్యవాదాలండీ.మీక్కూడా దీపావళి శుభాకంక్షలండీ..

  @ ఎందుకో ఏమో ? గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండీ నా బ్లాగు దర్శించడమే కాకుండా ముత్యాల మాటలు చెప్పినందుకు.మీక్కూడా దీపావళి శుభాకంక్షలండీ..

  @ జ్యోతి గారు ముందు తోరణాలు అని వ్రాసే తరువాత మళ్ళీ సంబరాలు అని పెట్టానండీ.. మంచి సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలండీ..మీక్కూడా దీపావళి శుభాకంక్షలండీ..

  ReplyDelete
 6. మీకూ...., మీ ఇంటిల్లిపాదికీ.. "దీపావళి" శుభాకాంక్షలు. ఏదో.. సరదా.. ఊహాతేటగీతి...మీ బ్లాగు మాధ్యమంగా పంచుకుందామని తట్టింది. స్వాగతిస్తారుగా........?
  సిరికి లోకాన పూజలు జరుగు వేళ
  చూడ వచ్చెను నింగిన చుక్కలన్ని
  ఏడ జాబిలి ఎటుపాయె లేడదేమి?
  భువికి దిగెనేమొ అక్కకై "దివిలె" వోలె!

  ReplyDelete
 7. రాకుమార గారు ఎంత మాట.. వట్టి స్వాగతం కాదండి.. సుమ మాలల సుస్వాగతాలు మీకు.చాలా బాగుందండి మీరు చెప్పిన తేట గీతి. ముఖ్యంగా మీరు వర్ణించిన ' భువికి దిగెనేమొ అక్కకై "దివిలె" వోలె! ' అన్న వాక్యం అద్భుతం అండీ.. నిజమే బహుశా ఇది ఎవరికీ ఇంతవరకూ తట్టి ఉండదు.. అక్క కోసం తమ్ముడు దీపమై వెలగడం.. ఒక చక్కని కవితను నా బ్లాగులో పంచుకున్నందుకు మీకు వేల వేల ధన్యవాదాలండీ.

  ReplyDelete
 8. సుభా గారు ధన్యవాదాలండీ."దీపావళి" కి పర్యాయంగా నేను చిన్నప్పటినుంచి వింటున్న, నా చుట్టు పక్కల వాళ్లంతా అంటున్న మాట "దివిలె"

  ReplyDelete
 9. కాకరపువ్వొత్తుల కరచాలనాలు
  మతాబుల ముచ్చట్లు
  తారాజువ్వల సంబరాలు
  చిచ్చుబుడ్డి చిరునవ్వులతో
  దీపావళి ఆనందంగా జరుపుకున్నారా సుభా గారు?
  మీకు,మీ కుటుంబసభ్యులకు ఆలస్యంగా దీపావళి శుభాకాంక్షలు

  ReplyDelete
 10. రాజీ గారూ.. చాలా ధన్యవాదాలండీ.. బాగా జరుపుకున్నాం దీపావళి. .మీక్కూడా దీపావళి శుభాకంక్షలండీ..

  ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !