Search This Blog

Tuesday, October 11, 2011

కన్నీరు...

సంతోషం - దుఃఖం
రెండింటి మధ్య దూరం
ఒక కన్నీటి చుక్క..,
దుఃఖాన్ని .. సంతోషాన్ని ..
ఆ చుక్కలో ఇముడ్చుకుని
చెంపపై నుండి వయ్యరంగా జారి
ముత్యమై మెరిసి
గుండెపై ఇంకిపోతుంది
ఎందుకు.. అంటే..
ఆ ముత్యాలన్నీ అక్కడే పదిలంగా దాచుకోమని
ఇక అంతకన్నా విలువైనవి లేనే లేవని..!

10 comments:

  1. భాష్పాన్ని ముత్యంగా మార్చి గుండెలో దాచుకోవడం...భావవ్యక్తీకరణ
    చాలా బావుంది.

    ReplyDelete
  2. ధన్యవాదాలండీ !

    ReplyDelete
  3. kanti nundi kaare kanneeru gurinchi bhavukathatho chala chakkaga hatthukune vidham ga chepparu kaneeru viluvalenidi kaadi ani chala viluvainadi ani meeru cheppina vidham chala nachindi naku

    ReplyDelete
  4. మొదట అ బొమ్మ చాలా బాగుంది..
    మనసుకు హాయినిచేవ్వి కొన్ని..
    ప్రేమ, స్నేహం, బుజ్జాయి తన్నులు, కౌగిలి, పరిమళం, ఇలా ఎన్నో ఉనాయి కాని అవేవి లేనపుడు అదే మనసుకు సాంత్వన ఇచేది ఆ ఇంకిపోయిన నీటి చుక్కనే...
    చాలా బాగా చెప్పారు "ఆ ముత్యాలన్నీ అక్కడే పదిలంగా దాచుకోమని
    ఇక అంతకన్నా విలువైనవి లేనే లేవని..!"

    ReplyDelete
  5. థ్యాంక్స్ కళ్యాణ్ గారు. మీరు చెప్పింది నిజమే మనసుకు అవేమీ లేనపుడు ఆ ఇంకిపోయిన నీటి చుక్కలే శాంత్వననిస్తాయి బహుశా.

    ReplyDelete
  6. అద్భుతం గా ఉంది మీ భావన.

    ReplyDelete
  7. శైలు గారు మీ వ్యాఖ్య గురించి యెప్పటి నుంచో నిరీక్షణ. ఇప్పటికి ఫలించింది. ధన్యవాదాలండీ..

    ReplyDelete
  8. భావ వ్యక్తీకరణ కూడా ఒక కళే అది మీకు చాలా ఉంది. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి అని ఒక మహానుభావుడు అన్నారు కదండీ!

    ReplyDelete
  9. రసజ్ఞ గారు ధన్యవాదాలండీ..

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !