Search This Blog

Tuesday, October 4, 2011

గీతాంజలి..ఒక్కొక్క పాట ఒక్కో పూదోట.

నేను పాడడానికి వచ్చిన పాట
ఈనాటికీ పాడకుండానే మిగిలిపోయింది
నా వాయిద్య తంత్రుల్ని బిగువు చేస్తూ
వదులు చేస్తూ నా రోజుల్ని గడిపేసాను
తాళం సరిగా సాగలేదు
పదాల కూర్పు కుదరలేదు
నా హృదయంలో కాంక్షా బాధ మాత్రమే మిగిలిపోయింది
 పువ్వు విచ్చుకోలేదు
గాలి మాత్రం నిట్టూర్చుతోంది పక్కన
అతని ముఖాన్ని చూడలేదు నేను
అతని కంఠమూ వినలేదు
నా ఇంటి ముందు నుండి నడిచే
అతని మెత్తని పాద ధ్వనిని మాత్రమే వినగలిగాను
నేలపై అతనికి ఆశనం పరచడంలోనే
దినమంతా గడిచిపోయింది
ఇంకా దీపం వెలిగించలేదు
అతన్ని ఇంట్లోకి ఎలా అహ్వానించను?
అతన్ని కలుసుకోగలననే ఆశతో బ్రతుకుతున్నాను
కానీ ఆ కలయిక ప్రాప్తించింది కాదు...   ----ఠాగోర్ గీతాంజలికి చలం అనువాదం


                                                        

1 comment:

  1. అవునను పదమును కాదను లాగున వాడొచ్చని ఈనాడే తెలిసింది :

    నీ గుండె గూటిని ఆతనికిచ్చి
    విలపిస్తావేల వింతగా పిచ్చిగా...
    హృదయంతో అనుసరిస్తూ అతనిలో నువ్వు చేరాకా
    బాహ్యమైన కలయితో పని ఏలనే బాల !!

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !