Search This Blog

Thursday, April 28, 2011

విన్నవించనీ నన్నిలా ...


మనసంతా  ఏదో పరిమళం ఆవరించితే
అది నాలో నువ్వున్నావని;
మదిలో ఏదో తియ్యని భావన మెదిలితే   
అది నేను నువ్వయ్యానని;
యెద నిండా ఏవో కొంటె తలపులు అలముకుంటే
నాకు నువ్వున్నావని;
నీవు నా ఎదురుగా లేనపుడు
చెలరేగిపోయే ఈ మనసు..

నా తలపులన్నీ కుప్పలుగా పోసి
నీ ముందు మనసు విప్పి చెప్పాలని
ఎన్నో ఉదయాలు, సాయంకాలాలు
ఎన్నో రాత్రులు, ఎంతో కాలం నుండి
నా కన్నులు నీ కన్నులతో మాట్లాడాలని..

కొమ్మ నలిమే తీగనై
నీ వెచ్చని స్పర్శతో పులకించిపోవాలని.,
అర విరిసిన పువ్వునై
నా ఆశల శ్వాసతో నిన్ను అల్లుకుపోవాలని.,
నిన్నే తలుస్తూ.. నీకై తపిస్తూ..
 నా హృదయ ద్వారాలు నీకై తెరచి ఉంచిన వేళ
'నేస్తమా ! నీ కోసం నేనున్నాను '
అనే నీ పిలుపు కోసం ఎదురు చూస్తూ
అనుక్షణం నిన్నే ఆరాధించే .... నీ మనసు ! ! 

Tuesday, April 26, 2011

తీయని బాధ...

నిన్ను తలవకూడదనుకున్నాను
కానీ నన్ను నేను మర్చిపోతున్నాను...
కలలోనైనా ' కల 'వకూడదనుకున్నాను
కంటికి నిదురే కరువైంది...
ఏకాంతంలో కూడా నీతో మాట్లాడకూడదనుకున్నాను
ఒంటరితనంతో మనసు మోడే అయింది...
నిన్ను దూరంగా ఉంచుదామనుకున్నాను
ఆ బాధతో నీకు మరీ దగ్గరైపోతున్నాను...
నువ్వు లేకుండా ఉండగలననుకున్నాను
నువ్వు లేని నన్ను ఊహించడమే కష్టమైపోతోంది...
నీకు దూరమౌదామన్న ప్రతీసారీ
నాకు తీరని ఆవేదనే ఎదురౌతోంది నేస్తం ! !

సామెతలు

హాయ్ ఫ్రెండ్స్ సరదాగా ఒక విషయం మొదలుపెడదామా? ఇది ఇంతకు ముందే మిత్రులు ఎవరైనా మొదలుపెట్టి ఉండవచ్చు. ఐనా సరే ఇక్కడ కూడా చూద్దాం.
సరే విషయం ఏంటంటే, మన తెలుగు సామెతల మీద మన యువతరానికి ఎంత పట్టు ఉందో చూద్దామా? యువతరానికి అని ఎందుకన్నానంటె ఇక్కడ ఎక్కువ బ్లాగులు వాళ్ళవే కనిపిస్తున్నాయి కాబట్టి అలా అన్నాను. అలా అని వాళ్ళే ఇందులో పాల్గొనాలి అని నియమ నిబంధనలు ఏమీ లేవండి. ఎవరైనా సరే ఇందులో మీకు తెలిసిన సామెతలని చెప్పొచ్చు  ( అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు చెప్పేవి చాలా ఉంటాయండి. ఒక సారి గుర్తుకు తెచ్చుకోండి ). అలాగే అది ఎలా, ఎందుకు ప్రాముఖ్యం పొందిందో కూడా చెప్తే ఇంకా బాగుంటుంది. ఒక చిన్ని ప్రయత్నం... మొదలుపెడదామా మరి? 

పుటుక్కు.. జర జర.. డుబుక్కు.. మే 

ఇది జనాల్లో బాగా ప్రాచుర్యం పొందింది.  అసలు ఇది తెనాలి రామలింగడు కథ అనుకుంటాను. కథ ఏంటంటే ఒకసారి సభలోనికి ఒక పండితుడు వస్తాడు. అతను నేను అన్ని శాస్త్రాల్లోను దిట్ట అని చెప్పినప్పుడు రామక్రిష్ణ కవి ఈ సమస్య చెప్తాడు.
సమస్యలోనికి వెళ్తే, ఒకడు గుమ్మడి పాదు పెడతాడు. దానిని ఎలుక "పుటుక్కున" కొరుకుతుంది. అది "జర జరా" పాక్కుంటూ దాని క్రిందనే ఉన్న మేక మీద "డుబుక్కున"  పడితే అది "మే" అని అరుస్తుంది. అదీ విషయం.. (అందరికీ తెలిసిందే అనుకోండి.)


కట్టె.. కొట్టె.. తెచ్చె..

 ఇది కూడా జనాల్లో బాగా నానిందే. ఏ విషయమైనా మూడు ముక్కల్లో చెప్పమంటే ఇలాగా అని అడుగుతూ ఉంటారు. దీని కథ కూడ అందరికీ తెలిసిందే. రామాయణ గాథ ఇది. వారధిని కట్టాడు, రావణుడ్ని కొట్టాడు, సీతని తెచ్చాడు. ఇదీ క్లుప్తంగా రామాయణం.

ఇలాగే మీరు కూడా ఏదైనా చెప్పండి. 
ఇంకొక విషయం నానుడి అన్నా, సామెత అన్నా ఒకటేనా?  
ఈ సందేహం కూడా కాస్త తీరిస్తే బహు సంతోషం.    

జాన్ జేంస్ ఆడుబన్

ఈ రోజు గూగుల్ లో పక్షులు కనిపిస్తున్నాయ్ చూసారాండి. జాన్ జేంస్ ఆడుబన్ 226వ పుట్టిన రోజు ఈ రోజు. ఆయన పక్షుల గురించి చాలా పరిశోధనలు చేసారంట. అవన్నీ పెద్దగా ఆశ్చర్య పోవలిసినది ఏం లేదు కాని., వాటన్నిటినీ  ఆయన బొమ్మలు గీయటం మాత్రం నిజంగా అద్భుతం అనిపిస్తోంది. ఈయన గురించి మీకందరికీ తెలుసేమో కాని, నేను మాత్రం మొదటి సారి ఈయన గురించి తెలుసుకుంటున్నాను. నాకైతే నిజంగానే చాలా అద్భుతంగా అనిపించింది. ఆయనవి కొన్ని చిత్ర లేఖనాలు సంపాదించాను ( నెట్ లోనే లెండి ) . చూస్తే మీకే తెలుస్తుంది.

ఇంకా వివరాల కోసం నా పిక్చర్ స్క్యూ బ్లాగుని వీక్షించండి.

Monday, April 25, 2011

నిదురమ్మ కౌగిలిలో..

కనులు కనే కలలలో
వేల వేల వర్ణాలు
వింతైన కాంతులు .,
మెరిసే గగనాలు
విరిసే భువనాలు .,
మైమరిచే నా మనోవనంలో
ఎన్నో భావాల పరిమళాలు ! !

చిత్రలేఖనం



బుడుగు నలుపు తెలుపులో

సీగాన పెసూనాంబ నలుపు తెలుపులో



చిత్రలేఖనం