సందె వేళ సాగర తీరం
అలై తాకిన నీ జ్ఞాపకం..
పరుచుకున్న ఈ ఇసుక రేణువులు
గతకాలపు జ్ఞాపకాల దొంతరలు..
గవ్వలతో ఆడిన ఖవ్వాలీలు
గడచిపోయిన మధుర క్షణాలు..
అలలపై వీచే గాలి రాగాలు
చెప్పుకున్న ఆశల ఊసులు
చెరిగిపోని చిరునవ్వుల జల్లులు..
అణువణువు కరిగిపోయే ఈ కాల చక్రంలో
కరిగిపోనిది, చెరిగిపోనిది నీ చెలిమి ఒక్కటే నేస్తం ! !
అలై తాకిన నీ జ్ఞాపకం..
పరుచుకున్న ఈ ఇసుక రేణువులు
గతకాలపు జ్ఞాపకాల దొంతరలు..
గవ్వలతో ఆడిన ఖవ్వాలీలు
గడచిపోయిన మధుర క్షణాలు..
అలలపై వీచే గాలి రాగాలు
చెప్పుకున్న ఆశల ఊసులు
చెరిగిపోని చిరునవ్వుల జల్లులు..
అణువణువు కరిగిపోయే ఈ కాల చక్రంలో
కరిగిపోనిది, చెరిగిపోనిది నీ చెలిమి ఒక్కటే నేస్తం ! !
No comments:
Post a Comment
కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !