హాయ్ ఫ్రెండ్స్ సరదాగా ఒక విషయం మొదలుపెడదామా? ఇది ఇంతకు ముందే మిత్రులు ఎవరైనా మొదలుపెట్టి ఉండవచ్చు. ఐనా సరే ఇక్కడ కూడా చూద్దాం.
సరే విషయం ఏంటంటే, మన తెలుగు సామెతల మీద మన యువతరానికి ఎంత పట్టు ఉందో చూద్దామా? యువతరానికి అని ఎందుకన్నానంటె ఇక్కడ ఎక్కువ బ్లాగులు వాళ్ళవే కనిపిస్తున్నాయి కాబట్టి అలా అన్నాను. అలా అని వాళ్ళే ఇందులో పాల్గొనాలి అని నియమ నిబంధనలు ఏమీ లేవండి. ఎవరైనా సరే ఇందులో మీకు తెలిసిన సామెతలని చెప్పొచ్చు ( అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు చెప్పేవి చాలా ఉంటాయండి. ఒక సారి గుర్తుకు తెచ్చుకోండి ). అలాగే అది ఎలా, ఎందుకు ప్రాముఖ్యం పొందిందో కూడా చెప్తే ఇంకా బాగుంటుంది. ఒక చిన్ని ప్రయత్నం... మొదలుపెడదామా మరి?
పుటుక్కు.. జర జర.. డుబుక్కు.. మే
ఇది జనాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. అసలు ఇది తెనాలి రామలింగడు కథ అనుకుంటాను. కథ ఏంటంటే ఒకసారి సభలోనికి ఒక పండితుడు వస్తాడు. అతను నేను అన్ని శాస్త్రాల్లోను దిట్ట అని చెప్పినప్పుడు రామక్రిష్ణ కవి ఈ సమస్య చెప్తాడు.
సమస్యలోనికి వెళ్తే, ఒకడు గుమ్మడి పాదు పెడతాడు. దానిని ఎలుక "పుటుక్కున" కొరుకుతుంది. అది "జర జరా" పాక్కుంటూ దాని క్రిందనే ఉన్న మేక మీద "డుబుక్కున" పడితే అది "మే" అని అరుస్తుంది. అదీ విషయం.. (అందరికీ తెలిసిందే అనుకోండి.)
కట్టె.. కొట్టె.. తెచ్చె..
ఇది కూడా జనాల్లో బాగా నానిందే. ఏ విషయమైనా మూడు ముక్కల్లో చెప్పమంటే ఇలాగా అని అడుగుతూ ఉంటారు. దీని కథ కూడ అందరికీ తెలిసిందే. రామాయణ గాథ ఇది. వారధిని కట్టాడు, రావణుడ్ని కొట్టాడు, సీతని తెచ్చాడు. ఇదీ క్లుప్తంగా రామాయణం.
ఇలాగే మీరు కూడా ఏదైనా చెప్పండి.
ఇంకొక విషయం నానుడి అన్నా, సామెత అన్నా ఒకటేనా?
ఈ సందేహం కూడా కాస్త తీరిస్తే బహు సంతోషం.

No comments:
Post a Comment
కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !