మనసు మనసుతో మాట్లాడాలని
పదే పదే ప్రయత్నిస్తోంది
ప్రయత్నాలన్నీ నీరు కారిపోతుంటే
చెప్పలేనంత నిరాశక్తత
ఎందుకు వినవంటే నాకు వేరే పనుంది అంటుంది
నిజం చెప్పాలంటే అది చేస్తోందీ అదే
మనసు మనసుతో మాట్లాడుతోంది
ఆ మాటలు వినడానికి
గుండె తన చప్పుడును కూడా వినిపించడం లేదు
గొంతు మూగబోయి శ్వాసను పిల్లనగ్రోవిగా మార్చింది.,
ఆ మాటల్ని కూర్చి రాగం చేయాలని...
ఆ రాగం తనువులోని అణువణువును మీటుతుంటే ఏదో చిత్రమైన పులకింత
ఆ పులకింతకు మనసు, తనువుతో పాటు
ప్రకృతి కూడా తీయని పరిమళాలు వెదజల్లుతోంది
మాటల కందని ఆ భాష
మనసుకి మాత్రమే సాధ్యమేమో...!
చిత్రం కదూ !!
మనసు మనసుతో మాట్లాడుతోంది.. !!
పదే పదే ప్రయత్నిస్తోంది
ప్రయత్నాలన్నీ నీరు కారిపోతుంటే
చెప్పలేనంత నిరాశక్తత
ఎందుకు వినవంటే నాకు వేరే పనుంది అంటుంది
నిజం చెప్పాలంటే అది చేస్తోందీ అదే
మనసు మనసుతో మాట్లాడుతోంది
ఆ మాటలు వినడానికి
గుండె తన చప్పుడును కూడా వినిపించడం లేదు
గొంతు మూగబోయి శ్వాసను పిల్లనగ్రోవిగా మార్చింది.,
ఆ మాటల్ని కూర్చి రాగం చేయాలని...
ఆ రాగం తనువులోని అణువణువును మీటుతుంటే ఏదో చిత్రమైన పులకింత
ఆ పులకింతకు మనసు, తనువుతో పాటు
ప్రకృతి కూడా తీయని పరిమళాలు వెదజల్లుతోంది
మాటల కందని ఆ భాష
మనసుకి మాత్రమే సాధ్యమేమో...!
చిత్రం కదూ !!
మనసు మనసుతో మాట్లాడుతోంది.. !!
No comments:
Post a Comment
కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !