Search This Blog

Sunday, April 24, 2011

స్పూర్తి

పాటకు పల్లవి ప్రాణం ఐతే
నీ గీతానికి రాగం నేనౌతా..
చిగురించే ఆశవు నీవైతే
నీ ఆశకు శ్వాసను నేనౌతా..
విరిసిన పువ్వులలో తేనెవు నీవైతే
ఆ తేనెలలో మధురిమ నేనౌతా..
తొలిపొద్దులో నేలని తాకే కిరణానివి నీవైతే
ఆ కిరణానికి వెలుగును నేనౌతా..
సిరిమువ్వల సవ్వడులు, సెలయేరుల సరిగమలు
కోకిలమ్మల కువకువలు, పసిపాపల కేరింతలు
సుమ బాలల సరాగాలు, కొంటె తుమ్మెదల ఝూంకారాలు
మనసును మైమరిపించే
ప్రతి నాదమూ నేనౌతా.,
ప్రతి క్షణమూ నేనౌతా..!!           

No comments:

Post a Comment

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !