Search This Blog

Tuesday, April 26, 2011

తీయని బాధ...

నిన్ను తలవకూడదనుకున్నాను
కానీ నన్ను నేను మర్చిపోతున్నాను...
కలలోనైనా ' కల 'వకూడదనుకున్నాను
కంటికి నిదురే కరువైంది...
ఏకాంతంలో కూడా నీతో మాట్లాడకూడదనుకున్నాను
ఒంటరితనంతో మనసు మోడే అయింది...
నిన్ను దూరంగా ఉంచుదామనుకున్నాను
ఆ బాధతో నీకు మరీ దగ్గరైపోతున్నాను...
నువ్వు లేకుండా ఉండగలననుకున్నాను
నువ్వు లేని నన్ను ఊహించడమే కష్టమైపోతోంది...
నీకు దూరమౌదామన్న ప్రతీసారీ
నాకు తీరని ఆవేదనే ఎదురౌతోంది నేస్తం ! !

1 comment:

  1. నీకు దూరమౌదామన్న ప్రతీసారీ
    నాకు తీరని ఆవేదనే ఎదురౌతోంది నేస్తం ! ! chaalaa andam gaa chepparu baavundi

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !