నా స్వప్నమై కలిసి
నా తలపులో నిండి
నా పెదవిపై నవ్వువై విరబూసి
నా శ్వాసలో వేణువునూది
నా గుండెలో కొలువుండి
మధురమైన భావనలో నను ముంచే
నీ ప్రేమలో పులకించిపోవాలని..
నేస్తమా నువ్వెక్కడ అని అడిగితే
బదులుగా కళ్ళ వెంబడి
ఒక కన్నీటి చుక్క తళుక్కున మెరిసి
నీ జ్ఞాపకంలో కలిసిపోయింది ! ! !
No comments:
Post a Comment
కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !