నీలాల నింగిలో ఓ చందురూడా
నీ తార నేనౌత ఈ సందెకాడ
నీ యెలుగు మెరిసి నా కళ్ళలోన
నవ్వులే విరిసేను నా పెదవిపైన
యెన్నెల్లు కురిపించి నా అందగాడ
నన్నల్లుకుంటావు ఈ జాము కాడ
నా ఈడు నీ కాడ సంపంగి పూవై
సరసాల గోదారి సాగేటి యేల
నీ యెంకి నేనౌత నా చందమామ
తెల్లారిపోనీక ఈ రాతిరింక
నీ ముద్దు మురిపాలు నా సొంతమింక
యెన్నెల్లు కురిసేటి నా చందురూడా
నీ దాన నేనింక నా వలపురేడా . . !
No comments:
Post a Comment
కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !