Search This Blog

Saturday, October 8, 2011

ఇది ఏమిటో నువ్వే చెప్పు...



ఇది చిత్రమేనా అని అనుకోకు
నాకు తెలుసు
రవి వర్మ చిత్రంలో సజీవత
పికాసో చిత్రంలో కళ్ళు చెదిరే అందాలు
దీనిలో కనిపించదు.,
ఇదీ ఒక కవితేనా అని అనుకోకు
శ్రీనాధుని శృంగార రసము,
కాళిదాసు గంభీర పదజాలము
నా కలమునకు రాదు.,
రవీంద్రుని భావుకత వెతికినా కనిపించదు.,
శ్రీ శ్రీ గుండెను రగిల్చే ఆవేశం
మచ్చుకు కుడా ఉండదు.,
తిలక్, కృష్ణశాస్త్రి కవితలోని
అందాలు, సౌకుమార్యాలు నాకు రానే రావు.,
ఏదో మనసులో కలిగే భావం
దీనికి ఏ పేరు పెడతావో నీ ఇష్టం..,
కనులు మూసుకుంటే కనిపించే చిత్రం
అది చిత్రమో కాదో నువ్వు చూస్తే కాని తెలియదు..,
నా కలలకు రూపం నా చిత్రం
నా మనసులోని భావం ఈ కవిత్వం ! ! !   

5 comments:

  1. మన్ను న దాగి..
    నీరు తాగి..
    గాలి సేవించినా..
    ఏ విత్తనము గాలిగానో లేక నీరు గానో లేక మన్ను గానో మారిపోదు..
    అది ఓ పచ్చని సొగసై పరిమళిస్తుంది ప్రకృతికి తన భావనను తెలియజేస్తుంది..
    కాబటి వారిలా నీవు ఉండకపోయినా.
    వారి భావనలు ఆశయాలు కలగలిపి ఓ కొత్త కోణము తీసుకొచ్చావు...

    ReplyDelete
  2. ఎంత బాగా చెప్పారండి...నిజంగా మీ వ్యాఖ్య చాలా బాగుంది. ఇంతటి చక్కటి వ్యాఖ్య నాకెవ్వరూ ఇవ్వలేదు. చాలా థ్యాంక్స్ అండీ.

    ReplyDelete
  3. ముత్యమైన చినుకే మేలిమి అనుకుంటే తప్పు... వారి చినుకులు ముత్యమైతే.. మీ చినుకులు చల్లనివి హాయినిచ్చేవి వేసవి తాపాన్ని తీర్చేవి.... కాబటి ముత్యము విలువో లేక అ మిగతా చినుకులు విలువో మేరె తేల్చండి ?? .. తెల్చలేరు కదా ఎందుకంటే ఎవరి విలువ వారిది... మొత్తానికి మీ నుంచి ఇంకా ఆశిస్తునాను.. all the best

    ReplyDelete
  4. మీ కవిత్వంలో ఏమీ లేదంటూనే గొప్ప భావం వెలిబుచ్చారు. అయినా కళ్యాన్ గారు అంత చక్కగా వివరించాక ఇక చెప్పడానికేం లేదు.

    ReplyDelete
  5. థ్యాంక్స్ అండీ

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !