Search This Blog

Monday, October 24, 2011

ప్రకృతినై..

 పువ్వులలోని తేనెలను
తుమ్మెదనై దోచుకుంటా
లేలేత సోయగాల తీవెలకు మల్లే
పచ్చని కొమ్మలని పెనవేసుకుంటా
తారలలోని మెరుపులను
చెంపలపై అద్దుకుంటా
నీలాల నింగిలోని మబ్బులలో చేరి
జల్లులుగా మారి పుడమిని ముద్దాడుతా
విహంగమై వినువీధుల కెగిరి
విహారాలు చుట్టొస్తా
హరివిల్లుని నేలకి వంచి
ఆకాశానికి నిచ్చెనలు వేస్తా
సృష్టిలోని అందాలన్నీ కన్నులలో నింపుకుని
ప్రకృతినై చివురిస్తూనే ఉంటా
ప్రతి వనికీ పరిమళాలు ఇస్తా
ప్రతి మదికీ వసంతాన్ని తెస్తా ! !

6 comments:

  1. చాలా బాగుందండీ! ఈ సారి మీరు చిత్రం పెట్టలేదు కొంచెం నిరాశ పరచింది! నేను మీ ప్రతీ తపాలోను ముందుగా చూసేది మీరు గీసే చిత్రాలే!

    ReplyDelete
  2. "ప్రతి వనికీ పరిమళాలు ఇస్తా
    ప్రతి మదికీ వసంతాన్ని తెస్తా"

    చాలా బావుంది...!!

    ReplyDelete
  3. ప్రకృతినంతా మీరే అస్వాదిస్తారా!!!:-)బాగుందండి!

    ReplyDelete
  4. చిగురించే ప్రతి పువ్వును ఆస్వాదించే అదృష్టం ఒక్క తోటమాలికే ....
    అ పువ్వు నీ రచన అ తోటమాలివే నీవే...
    నాకు నచ్చిన పువ్వు అందవచ్చు అందకపోవచ్చు కాని నీవిచ్చే ప్రతి పువ్వును ఏదోక రీతిలో ఆస్వాదించవచ్చు...
    చాల బాగా వివరించారు మీ ఆశయాన్ని... మా అభిమతము కూడా అదే...

    పంటికి అడ్డమని పారవేసిన గించ కచ్చితంగా మట్టి తగిలితే చాలు ఆలస్యమైనా చిగురు ఒచ్చేస్తుంది..
    గింజగా ఉన్నంత వరకు ఎవ్వరు దానిని పట్టించుకోరు ...
    అదే చిగురు తొడిగితే మానై ఎదిగితే అందరి కనులు దానివైపే కదా..
    ఈనాడు నాకు ఆదర్శంగా ఉన్నారు మీరు అలానే ఒకనాడు అందరికి ఆదర్శమౌతారని ఆశిస్తున్నాను..

    ReplyDelete
  5. @ రసజ్ఞ గారు
    చాలా చాలా థ్యాంక్స్ అండీ నా చిత్రం గురుంచి చూస్తాను అన్న మాటకి. ఈ సారి గీయలేదు..తరువాత సారి ప్రయత్నిస్తాను. మరొక్కసారి ధన్యవాదాలండీ..

    @ జ్యోతిర్మయి గారు ధన్యవాదాలండీ..

    ReplyDelete
  6. @ పద్మ గారు నేనాస్వాదించి, ఆ ఆస్వాదనని ప్రతి ఒక్కరికీ పంచాలని ఆశ. మరి మీకందలేదా? : ) ధన్యవాదాలండీ.'

    @ కల్యాణ్ గారు మీకు శత కోటి ధన్యవాదాలండీ. ప్రతి ఒక్కరినీ మీ వ్యాఖ్యతో తట్టిలేపుతారు. నేను మాలినీ కావొచ్చు, పువ్వునూ కావొచ్చు.. కానీ ఆ పరిమళాన్ని ఆస్వాదించినప్పుడే ఆ పువ్వు జీవితానికి సార్ధకత.. ఆ మాలి కష్టానికి సాంత్వన..

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !