Search This Blog

Thursday, October 13, 2011

స్మృతి

మరణించినవారు స్వార్థపరులు
మనం వెక్కి వెక్కి ఏడుస్తున్నా
ఒక్కసారైనా ఊరడించరు
వాళ్ళంతే
నడవడానికి కూడా బద్దకమే
భుజాన మోయించుకుంటారు
పిల్లల్లా స్నానం చేయించుకుంటారు
ఎంత దర్పమో
మనకి తెలియని సత్యాలేవొ తెలిసినట్టు
మనం చూడని లోకాలేవో చూసినట్టూ
వెళ్ళేప్పుడు మాటవరసకైనా చెప్పరే
మహా మొండి ఘటాలు
హెచరిస్తున్నట్టో, మనల్ని నిందిస్తున్నట్టో
మొహం మాడ్చుకుని ఉంటారు
తమ మాటే నెగ్గాలన్నట్టు
బిర్ర బిగుసుకుపోతారు
తామే ప్రత్యేకమైనట్టు
కర్రల రథమెక్కి ఊరేగుతారు
మహా మతిమరుపు
ఏదీ గుర్తుంచుకోరు ఎవర్నీ గుర్తుంచుకోరు
మనం మాత్రం గుర్తుంచుకోవాలి ఏడాదికోసారైనా
 ఏంజెల్ గోంజాలేజ్ రచనకు స్వేఛ్ఛానుకరణ ఇది.. ఒకసారెప్పుడో చదివినప్పుడు నాకు బాగా నచ్చి పుస్తకంలో వ్రాసుకున్నాను. ఎందుకో ఈ రోజు ప్రొద్దున్న చూసాను అకస్మాత్తుగా. ఇలా బ్లాగింగ్ చేసాను. ఆయన 20 వ శతాబ్దపు సుప్రసిద్ధ స్పానిష్ కవి.


10 comments:

 1. సుభా మంచి కవితను పరిచయం చేశారు. థాంక్స్

  ReplyDelete
 2. చాలా మంచి సమాచారాన్ని పంచుకునారు... నిజమే...
  కాని బ్రతికినంత కాలం వారి మనుషుల స్వార్ధం కోసం బరువు మోస్తారు...
  కాని కొన్ని క్షణాలు మాత్రమే తమ స్వార్ధం కోసం వారి బిడ్డల భుజాన భరువౌతారు...
  అప్పటికి చూడండి బిడ్డలను ఎకువ సేపు కష్టపెట్ట కూడదని అనుకుంటారు...

  ReplyDelete
 3. @ జ్యోతిగారు మీ వ్యాఖ్య కి స్వాగతం

  @ రాజేష్ థ్యాంక్స్ అండీ. నా బ్లాగ్ నచ్చి నాకు అతిథిగా విచ్చేసినందుకు కూడా ధన్యవాదాలు మరియు స్వాగతాలు.

  @ కల్యాణ్ గారు చక్కగా చెప్పారు. నిజమే. ధన్యవాదాలండీ.

  ReplyDelete
 4. అబ్బూరి రామకృష్ణా రావు గారు
  "బ్రతికి యున్న వారికన్న చచ్చినవారే ఎక్కువ
  కద! ఈ అల్ప సంఖ్యపై ఏలా నీకీ మక్కువ?
  అనలేదా కాళి దాసు అజవిలాప గాథలోన..."
  అన్న కవిత గుర్తుకొచ్చింది. పొద్దున్నే ఈనాడు ఆదివారంలో చదివినప్పుడే, మీ బ్లాగులో మళ్లీ రాయడం వల్ల అది ఇట్లా చెప్పే అవకశం చిక్కింది. thank you సుభా గారు.

  ReplyDelete
 5. స్వాగతం కుమార్ గారు మీ వ్యాఖ్యకి. మంచి కవిత పరిచయం చేసారు నాకు. ధన్యావాదాలు మీకు.

  ReplyDelete
 6. usted escribe en muy maravillosa manera! Muchas felicidades ఏమీ లేదండీ మీరు స్పానిష్ కవి అన్నారు కదా అందుకని మీకు ప్రశంస కూడా స్పానిష్లోనే ఇచ్చా!

  ReplyDelete
 7. @ పద్మగారు థ్యాంక్స్ అండీ
  @ రసజ్ఞగారు చాలా థ్యాంక్స్ అండీ. మొదట్లో కొంచెం ఖంగారుపడ్డాను. తెలుగులో చెప్పారు కాబట్టి సరిపోయింది. లేకుంటేనా అమ్మో : )

  ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !