Search This Blog

Friday, October 14, 2011

నేటి మనిషి...

కోయిల తీయగా పాడుతుంది అని నేనంటే
పాట ఏమిటి నీ మొహం మామూలు పిట్ట కూతే అంటాడు వాడు.,
వెన్నెల మల్లెపువ్వులా ఉంది అని నేనంటే
మల్లెపువ్వు ఏంటి చంద్రుని కాంతి అంటాడు వాడు.,
మేఘాల పల్లకీలోంచి వానజాణ
ఎంత వయ్యారాలు పోతూ దిగుతోందో చూడమంటే
అసలు మబ్బు జాడే కనిపించట్లేదంటే
వానజాణ అంటావేంటని విసుక్కుంటాడు.,
గలగల పారే సెలయేరుల మువ్వల సవ్వడులు
ఆ పై వీచే పిల్లగాలి పరిమళాలను ఆస్వాదించమంటే
కర్మాగారాల సైరను మోతలు,
మురికి నీటి దుర్వాసనలూనా అని రంకెలు వేస్తాడు.,
ఆ పచ్చదనం.. ప్రకృతికే అత్యంత అద్భుతం
ధవళ కాంతులు వెదజల్లే హిమ శిఖరాల సౌందర్యం తిలకించమంటే
ఇంకెక్కడి మంచు కొండలు ఓజోన్ పొర చిరిగి
అవి కరిగిపోతోంటే అని చిందులు తొక్కుతాడు.,
ప్రకృతి వికృతిగా మారిపోతోంటే
సౌందర్యం సౌందర్యం అని ఉర్రూతలేంటి అని చురకలు వేస్తాడు.,
విజ్ఞాన శాస్త్రం క్రొత్త పుంతలు తొక్కి
అసలు సౌందర్యం అన్న మాటకే అర్థాలు మారిపోతున్న ఈ కాలంలో
ఇంకా ఎందుకు పాత అందాన్నే పొగుడుతావ్
అని సూటిగా ప్రశ్నిస్తాడు నేటి ' ఆధునిక ' మానవుడు ! !  

6 comments:

 1. తమదైన శైలిలో చక్కగా నేటి పరిస్థితులను వివరించారు... అవును నిజమే..
  ఒక్కోసారి కాలం యొక్క పోకడకు తట్టుకోలేక నేను అలానే వెళ్లిపోవచ్చు కదా ఎందుకు ఇంకా పట్టింపులు అవి అనిపిస్తుంది..
  కాని ఆలోచనలో ఇంత మార్పు ఒస్తోందా అని ఆశ్చర్యం కూడా వేస్తుంది... కాని ప్రకృతుని అనుసరించాలి అనే స్పృహ ఇంకా కోల్పోలేదు.. ఇలాంటి వ్యాక్యాలు చదివినపుడు ఇంకా అది బలపడుతోంది..
  మట్టి రుచి చూడలేని పాదము దేనికి..
  చినుకు హాయిని తెలుసుకోలేని దేహమెందుకు..
  ఎండ చురకలు తగలని ముసుగులెందుకు...
  ప్రకృతుని అనుసరించలేని ఆధునిక మానవుడు ఎందుకు...

  ReplyDelete
 2. prakruthi soundaryanni varnisthu naatiki netiki unna tedanu, vatavaranam loni marpulanu, manava talampulaloni teda nu chala chakkaga varnincharu intha chakkani tapanu andinchina meeku dhanyavaadalu

  ReplyDelete
 3. అనుబంధాలు అణుబంధాలుగా మారిన వేళ
  మనిషి ఆధినికత మోజులో పడి
  ప్రకృతికి, సహజత్వానికీ దూరమవుతున్నాడు
  మీదైన శైలిలో చక్కగా చెప్పారండీ!

  ReplyDelete
 4. కోయిల పాటలని వెన్నెల వెలుగుల్ని..అస్వాది౦చలేనంత తొందరలో వున్నాం మనమంతా కూడా. 'ఏమి సాధించాలనో' ఈ పరుగులు? ఇలాంటి కవితలు చదివినప్పుడు కొంచం స్పృహ వస్తు౦ది. మారిపోతున్న పరిస్థితులని, ఆలోచనా ధోరణినిన చక్కాగా వివరించారు.

  ReplyDelete
 5. @కల్యాణ్ గారు
  ప్రకృతుని అనుసరించలేని ఆధునిక మానవుడు ఎందుకు... నిజమే.. కాని ఉరుకుల పరుగుల జీవితంలో, గ్లోబలైజేషన్ వలలో తన ఉనికి తనకే ప్రశ్నార్ధకమైతే ఇక చివరికి మిగిలే పరిస్థితులు ఎలా ఉంటాయో కదా.. అలాంటివి ఊహించడానికే కష్టంగా ఉంటుంది. ఇదంతా మనం చేసుకున్నదే. టెక్నాలజీని బాగానే ఉపయోగించుకుంటున్నాం అదే సమయంలో దాన్ని దుర్వినియోగం కూడా చేస్కుని ప్రకృతి ఉనికినే లేకుండా చేస్కుంటున్నాం.. ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి.

  @సురేష్ గారు మీ వ్యాఖ్య కి స్వాగతం.

  @రసజ్ఞగారు
  అనుబంధాలు అణుబంధాలుగా మారిన వేళ... నిజమేనండీ. ధన్యవాదాలు

  @జ్యోతిగారు ధన్యవాదాలండీ..

  ReplyDelete
 6. కవితలో భావన చాలా బాగుంది.
  ఇద్దరు వ్యక్తుల దృక్కోణం (perspective) లోని తేడాని బాగా చూపించారు.
  శీర్షిక విషయం లో కొంచెం శ్రధ్ధతీసుకుంటే బాగుండేది. అది మరీ prosaic గా ఉండి కవితకి అన్యాయం చేస్తోంది అని నా అభిప్రాయం.

  ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !