Search This Blog

Wednesday, November 2, 2011

కౌముది లో నా కవిత " అందమైన ప్రశ్న... "


అధరాలలో మధువును నింపుకున్న
పూల కన్నెలని అడుగు
కొంటె తుమ్మెద ఏమని పలుకరిస్తోందో.,
కదిలే అలలను అడుగు
గాలికి ఏ వలపుల వలలను వేస్తున్నాయో.,
కొమ్మ కొమ్మను పెనవేసిన తీగెలను అడుగు
కౌగిలింతలోని గిలిగింత ఏమిటో.,
పిల్ల తెమ్మెరలను అడుగు
వేణువులోని తీయని రాగం ఎక్కడిదో.,
నా కనుల కొలనులో దాగిన
నీ జ్ఞాపకాలని అడుగు
నా మనసుకు ఈ పరవశం ఎందుకో ! ! !14 comments:

 1. మీ "అందమైన ప్రశ్న..." చాలా బాగుందండీ...

  ReplyDelete
 2. అభినందనలు. మీరు గీసిన బొమ్మ చాలా బావుంది. :)

  ReplyDelete
 3. @ వనజ గారూ స్వాగతం అండీ నా బ్లాగుకి.. ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి.

  @ రాజి గారు ధన్యవాదాలండీ..

  @ మధుర గారూ చాలా థ్యాంక్స్ అండీ..

  ReplyDelete
 4. @సుభ
  కాగితంలో ఏమ్మునదో అంతగా వాలిపోయి పరవసిస్తోంది
  మీ మనసునే కాగితం చేసుంటారేమో!
  మీ పాళి లో ఏమ్మున్నదో రంగుల లోకమైనా నలుపు తెలుపులు అందంగా కనిపిస్తోంది
  మీరు వాటిని అందంగా చూపగాలరేమో!
  మాట్లాడితేనే అర్థం కాని మగువ మనసును అలా మౌనంగా గీస్తే ఎలా ?
  కనులు చూపిస్తే అందరు మైమరచి చూస్తారేమో అని రెప్పలలో దాచిపెడితే ఎలా ?
  పరచిన అందాలను కాస్థైనా మాట్లాడనివ్వు
  నను చూడకపోయినా నన్ను కాస్త చూడనివ్వు...

  బొమ్మతో కనులు దోచుకున్నారు... మీ కవితతో ఆ మధుర భావాల రహస్యాలను వివరించారు... చాలా బాగుంది ..

  ReplyDelete
 5. మా హృదయాంతరాలలో దాగిన మధురానుభూతిని అడుగు
  మీ కవితల పులకరింత మాకెందుకో! అమోఘం! ఆ బొమ్మ చక్కగా గీశారు! మీ అక్షరంలోని ప్రతీదీ ఈ చిత్రంలో కనిపిస్తోంది!

  ReplyDelete
 6. వాటి దగ్గరనుండే వస్తున్నాను. అందుకే ఈ ఆలస్యం. నీ మనస్సులోని మధురానుభూతులు అలవోకగా జారి వాటిన్ని౦టినీ పరవశింపజేసాయట. కవితకన్నా బొమ్మ బావుందా, లేక బొమ్మకన్నా కవిత బావుందా? చెప్పడం కష్టమే. అభినందనలు శుభా..

  ReplyDelete
 7. @ కల్యాణ్ గారూ " మీ మనసునే కాగితం చేసుంటారేమో! " .. నిజమే నండీ మీరు చెప్తుంటే అనిపిస్తోంది. మీ చక్కని ప్రశంసతో మనసు గుబాళించింది. ధన్యవాదాలు మీకు.

  ReplyDelete
 8. @ రసజ్ఞా ఎంత బాగా చెప్పారు.. మీ అక్షరంలోని ప్రతీదీ ఈ చిత్రంలో కనిపిస్తోంది అని. అలా రావాలనే అక్షరాలనే కుంచెగా మలచాను. ప్రతిఫలమే మీ అందరి చక్కని ప్రశంసలు. ధన్యవాదాలండీ..

  ReplyDelete
 9. @ జ్యోతి గారూ ధన్యవాదాలు.. అవన్నీ చూడడం వలనే కదా ఆలస్యమైంది. అలా ఆలస్యమవ్వడమే నాక్కావలిసింది. చిత్రం బావుందా, కవిత బావుందా, చెప్పడం కష్టం అంటూనే చక్కగా చెప్పారు. ఇది చాలండీ చక్కని అనుభూతి పొందడానికి.

  ReplyDelete
 10. simply superb.great your's observation on the nature appears on the each and every letter of this.:-)

  ReplyDelete
 11. Thank U so much Kranthi gaaru.

  ReplyDelete
 12. "కనుల కొలనులో దాగిన నీ జ్ఞాపకాల"న్నచోట కవిత్వం దాగి ఉంది. మీ Picturesque చూడగానే అనుకున్నాను మీరు చిత్రకారిణి అయిఉంటారని. దీనికి వేసిన బొమ్మ కూడా బాగుంది.
  అభినందనలు.

  ReplyDelete
 13. teluguanuvaadaalu గారూ ముందుగా నా బ్లాగుకి స్వాగతమండీ. మీ వ్యాఖ్యకి బోలెడు ధన్యవాదాలండీ.

  ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !