ప: ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
ఇక్కడే కలిసాము
బ్లాగులమ్మ చెట్టు నీడలో
వీడుకోలని వీడలేమని వెళ్ళలేకున్నాము
చిలిపితనపు మాటల కొలువులో
We love all the fun
We love all the joy
We love blogs...
చ: బ్లాగు దారుల్లోన జ్యోతులై వెలిగిన సమాలోచనలు
నవ్వితే నవ్వండంటూ చల్లిన చిలిపి జల్లులు
కష్టేఫలే అంటూ చెప్పిన మాటల ముత్యాలు
ఎన్నెన్నొ ఆలోచించండంటూ బాతాఖానీలు
శంకరయ్య గారి ఆభరణాలు
తెనుగు సొగసుల జాణతనాలు
హాట్ హాట్ చిల్ జిల్ జిలేబీలు
కథామంజరి వేడుకలు
మరపురాని మరిచిపోని బ్లాగులండీ
ఎంతో ఎన్నో నేర్చుకునే నెలవులండీ
పెద్దలు చెప్పే చద్దన్నం మూటలండీ
చదివేకొద్దీ బుర్రలు పదునౌనులెండీ
We love all the fun
We love all the joy
We love blogs...
చ: పనిలేక చెప్పే డాక్టరుగారి ఊసులతీరాలు
శర్కరి అల్లిన చిక్కని చక్కని అక్షరమాలలు
నోరూరించే అభిరుచిలోని ఘుమఘుమ వాసనలు
కృష్ణవేణీ తీరంలోన హృదయపు సవ్వడులు
కృష్ణప్రియ డైరీలొ మధురవాణిలు
వనజా రాజీ సరిగమపదలు
ఎన్నెల్లోనా రామాయణాలు
నెమలికన్ను రివ్యూలు
తెలుగుభావాల వెన్నెల కిరణాల బ్లాగులివండీ
నాలోమాట నవరసజ్ఞభరితమండీ
పద్మార్పితమూ ఇంకా ఎన్నో హారాలండీ
అవి కూడా సరదాగానే ఉంటాయండీ
We love all the fun
We love all the joy
We love blogs...
చిన్న మనవి:
హి హి హి :) పేరడీ అండీ. పేరడీ యా అని మీరనుకోకుండా నేనే చెప్పేసాను చూసారా(ఇదొక ఘనకార్యం మళ్ళీ).మొత్తానికి ఎలా ఐతే పాటే కదండీ రాసింది.అందుకని టైటిల్ గురించి పట్టించుకోకండే.ఇంకా ఇలా ఎన్నో చక్కని బ్లాగులున్నాయి. ఇందులో నేనేమన్నా తప్పుగా వ్రాస్తే మన్నించేయండి దయచేసి.ఏదో సరదాగా చిన్ని ప్రయత్నం చేసాను.ఎవరినీ నొప్పించడానికి మాత్రం కాదండీ.
చాలా బాగుంది... మీ ప్రయత్నం అభినందనీయం ... :)
ReplyDeleteఅబ్బోయ్ పాటలో బోలెడు గొప్ప గొప్ప సంగతులున్నాయిగా. బొమ్మ చూసి వలపు పాటనుకున్నా. భలేగా ఉంది.
ReplyDelete"వనజా రాజీ సరిగమపదలు"
ReplyDeleteమీ పాటలో మీ మనసులో నాకు మీరు కల్పించిన స్థానానికి
చాలా సంతోషం మరియు ధన్యవాదములు సుభాగారు..
మీరు రాసిన పాట చాలా బాగుంది..
:) బాగుంది..
ReplyDeleteబాగుంది సుభా గారు.. కడలి తరంగం లా కృష్ణుని తారంగంలా బహు బాగున్నది.
ReplyDeleteసూపర్ లైక్! ఆనందమానందమాయే! తలపుల వాకిలి కలల అలలతో నిండిపోయింది!
ReplyDeletevery nice
ReplyDeleteblogs tho nijamga emotional attachment untundanna sangathi just 30days ke experience vacchindi
mee patatho roodhee ayyindi
?!
@సుభ గారు
ReplyDeleteఎంత సరదాగా ఆహ్లాదంగా చల్లగా రాసేసారండి . పేరడీ చాలా ఘనంగా ఉంది. అలా చేయాలన్న పాటల పాండిత్యం కవితల సానిహిత్యం కచ్చితంగా కావాలి అది మీకు టపా తో పెట్టిన విద్య అదీ కాక మీ స్నేహితులని కలిపి కొట్టారు చూడండి అభ అదిరింది అనుకోండి. ధన్యవాదాలు మాపై మీ జల్లులు కురిపించినందుకు.
చాలా బాగా రాశారండి.థాంక్యూ
ReplyDeleteకడలి శుభోదయం
ReplyDeleteకదిలించింది హృదయం
ప్రవహించింది గానం
రమ్యం కడలి చందం చాతుర్యం
చీర్స్
జిలేబి.
బ్లాగుకి అనుకోని అతిథులందరూ వేంచేస్తున్నారు.అందరికీ ఇవే నా వినమ్ర స్వాగతాంజలి.
ReplyDelete@ రాజేష్
ReplyDeleteధన్యవాదాలండీ..
@జ్యోతిర్మయి
అవునాండి? ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి.
@ రాజి
ReplyDeleteమీకు నచ్చినందుకు చాలా సంతోషం అండీ.
@ కృష్ణప్రియ
ధన్యవాదాలండీ:)
@ వనజ
ReplyDeleteమీ వ్యాఖ్య మురళీ గానమంత తీయగా ఉందండీ.
@ రసగుల్లా
నిజంగా ఆనందమాయే అండీ.. నా తలపుల వాకిలి మీ వ్యాఖ్యల అలలతో నిండిపోయింది. ధన్యవాదాలు మీకు.
@ శివ
ReplyDeleteధన్యవాదాలండీ
@ కల్యాణ్
ధన్యవాదాలండీ నాపై మీ ప్రశంసల జల్లు కురిపించేసారు.
@లత
ధన్యవాదాలండీ
@ జిలేబి
ReplyDeleteఅబ్బ ప్రొద్దున్నే నాకు ఒక చక్కని జిలేబి పెట్టారండీ.ధన్యవాదాలు.
:) పేరడీ అయినా ఇలా రాయగలగడం రావాలి కదా. బాగుంది.
ReplyDeleteచాలా బాగా రాశారు. వార్తా పత్రికలు, టీ.వీ. లు చూడలేక వదిలిచ్చుకున్న నాకు, ఈ బ్లాగు ప్రపంచం మంచి ఆట విడుపులా తయారయింది. అడపా దడపా కొన్ని విషాన్ని ఎగగ్రక్కే బ్లాగులు ఎదురవుతున్నప్పటికీ - ఏది చదవాలో ఏది వదలాలో నా చేతిలో ఉన్న ఉన్న విషయం. సామాన్యులని అనుకుంటాం కానీ - కొందరి కొందరి భావ వ్యక్తీకరణ, రచనా సౌందర్యం ఓహ్!
ReplyDelete@ శిశిర
ReplyDeleteధన్యవాదాలండీ..
@తెలుగుభావాలు
నిజమేనండీ.మనకి నచ్చిన బ్లాగుల్ని చదువుకోవడమన్నది మన చేతుల్లోనే ఉందండీ.ఇక సామాన్యులు అనుకోవడమనేది ఉంది చూసారా, నిజం చెప్పాలంటే ఇక్కడ ఎవరి బ్లాగ్ రాజ్యానికి వారే అధినేతలు. ఎటొచ్చీ ఆ కామెంట్స్ అన్నవి ఆ రాజ్యానికి అండదండలు.అని నేను అనుకుంటూ ఉంటాను.ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి.
Fantastic, wonderful, super, mindblowing.My favourite song.
ReplyDeleteహహ్హహ్హా... సుభా.. భలే రాసారండీ.. బాగుంది మీ పాట.. నేను ట్యూన్లో పాడేసుకున్నా! :))
ReplyDelete@ తొలకరి
ReplyDeleteమీ వ్యాఖ్యకి బోలెడు ధన్యవాదాలండీ :)
@ మధుర
సాహిత్యమూ,సంగీతమూ రెండూ సరిపోయాయాండీ మరి?థాంకులే థాంకులు మీ కామెంటుకి :):)
మీ పేరడీ పాట బాగుందండి .
ReplyDeleteమాలా గారూ ధన్యవాదాలండీ..
ReplyDeleteమీ పాట బావుంది.
ReplyDeleteకాని నేను లేను...
పోన్లెండి నా కోసం ఇంకో పాట రాసేయండి.
మధ్య మధ్య వెన్నెల, గోదావరి, చిలకలు, బాతులు , ఆవులు వేసుకోవాలెం...
శైలు గారూ ఈ సారికి మన్నించేయండి. తర్వాత ఒక పాట ప్రత్యేకంగా మీ గురించే రాస్తాగా :). ధన్యవాదాలండీ మీ వ్యాఖ్యకి.
ReplyDeleteబ్లాగులమ్మ చెట్టు నీడలో..బ్లాగుందండి..
ReplyDeleteThax Balu gaaru :)
ReplyDeleteచాలా బావుంది పాట.
ReplyDeleteజ్యోతి గారూ చాలా చాలా ధన్యవాదాలండీ!
ReplyDeleteసుభ గారు పాట చాల బాగా వ్రాశారు ధన్యవాదములు
ReplyDelete