Search This Blog

Saturday, November 5, 2011

మనసు నింగిలో..

ముసిరే మబ్బుల్లా
మనసు నింగిలో నీ తలపులు.,
కురిసే వెన్నెల్లా
కంటిపాపలో నీ రూపపు కాంతులు ! !

4 comments:

 1. అ మబ్బును తొలచే తొందరలో నీ గురించి నీవు మరచిపోకు ...
  కన్నులో ఎప్పుడు అ కాంతులనే దాచుకోకు నీకై ఎదురుచూసే వాటిపై అ చూపులను వాలనివ్వు...
  సుభ గారు ఈ బొమ్మను నేను ఏ విధంగాను వర్ణించలేకున్నా ఎందుకంటే వెలుగుతోనే కనులు వికసించేది మరి ఆ కనులే వెలుగును కనిపెట్టింది అనడం భావ్యమా చెప్పండి!
  మీ బొమ్మ వెలుగైతే మా వర్ణన కనుల లాంటివి ! కావున వర్ణన తగదు

  ReplyDelete
 2. మనసులో తలపులు, కళ్ళలో కాంతులు అన్నీ కంటి వెలుగులో కనిపిస్తున్నాయ్. కవితకు తగిన చిత్రం. అత్భుతంగా ఉంది శుభా..

  ReplyDelete
 3. బొమ్మకి తగ్గ వర్ణన లేదా వర్ణనకి తగ్గ బొమ్మ అనచ్చు. బాగుందండీ ఆ కనుపాపల వెన్నెలని అలానే అందించండి రెప్పల మబ్బులతో దోబూచులాడుతూ

  ReplyDelete
 4. @ కల్యాణ్: మీ బొమ్మ వెలుగైతే మా వర్ణన కనుల లాంటివి...చిత్రం ఎలా ఉందో చక్కని వర్ణనలో చెప్పారు మాష్టారూ.. ధన్యవాదాలు.

  @ జ్యోతి గారూ మీ కళ్ళతో చూసి నా కళ్ళలో వెలుగులు నింపారు. చాలా చాలా ధన్యవాదాలండీ.

  @ రసజ్ఞ : రెప్పల మబ్బులతో దోబూచులాడుతూ... చాలా బాగుంది మీ వర్ణన.ధన్యవాదాలండీ

  ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !