Search This Blog

Sunday, October 16, 2011

వెన్నెల వాన...

                                                                              
 సాయంకాలం అయ్యింది
ఎందుకో తనతో మాట్లాడాలనిపించింది
అలా మేడ మీదికి వెళ్ళాను.,
నాకు తెలుసు తను అక్కడే ఉంటాడని
నేను వెళ్ళింది తన కోసమే.,
కాని తను ఉన్నది నా కోసమో కాదో తెలియదు..
కాసేపు తననే చూస్తూ ఉన్నాను
ఏం మాట్లాడాలో తెలియక.,
తను కూడా నన్నే చూస్తున్నాడు ఓరగా
నేనే మాట్లాడుతానులే అని.,
ఇక నేను ఆగలేకపోయాను
నీ కోసం వచ్చానని తెలిసినా
నాతో మాట్లాడాలని అనిపించడం లేదా.,
ఇంకా అలానే చూస్తున్నాడు..
ఏం ఉలకవు పలకవు
అవునులే అన్ని చక్కని చుక్కలు
చుట్టూ ఉంటే నన్నెలా చుస్తావు
నాతో ఎలా మాట్లాడుతావు అన్నాను ఉడుక్కుంటూ.,
నా మొహం చూసి అప్పుడు నవ్వాడు సన్నగా..
ఆ నవ్వు కోటి కాంతులు వెదజల్లి
చిక్కని వెన్నెలై నా మీద కురుస్తుంటే
ఆ క్షణంలో నాకనిపించింది
నా చందమామ మళ్ళీ మళ్ళీ నవ్వాలని
ఆ వెన్నెల్లేనే తడిసిపోతూ ఉండాలని ! !

6 comments:

  1. "ఆ నవ్వు కోటి కాంతులు వెదజల్లి
    చిక్కని వెన్నెలై నా మీద కురుస్తుంటే"

    చందమామ నవ్వితే వెన్నెలౌతుందననే ఊహ చాలా బావు౦ది శుభా..

    ReplyDelete
  2. అతగాడు నీకోసం జగమంతా వెన్నలతో నింపేస్తే అంత వెన్నల ఎందుకు తన తారల భామల కోసమా అని అలా తప్పుగా అనుకుంటే ఎలా..
    అంతటి గొప్పవాడు ఇంతటి గుణవంతురాలిని కలవాలంటే మరి అంత మాత్రం రాశులను కురిపించాలి లేకుంటే చందమామైన చులకనౌతాడు...
    ఏదైతేనేమి చివరికి అర్థం చేస్కున్నారు మీకోసమే అంత ప్రయాస అని! అదే చాలు...

    మీ పధతి ఎలా ఉంటుందంటే ప్రతి వాక్యం తరువాత ఏంటి ఏమౌతుందో అనే ఆతృతను రేకెత్తిస్తుంది... అలా అలా జారుతూ తూలుతూ చదువుతూ పోతే తీరా పరకాయ ప్రవేశం చేసి మనమే ఆ పాత్రధారి అయితే బాగున్నేమో అని ఆకరి వాక్యం ఆలోచింపజేస్తుంది... ఇంకా అ సంశయం అలానే ఉండిపోయి మీ కవిత్వం అలానే మా మదిలో నిలిచిపోతుంది...

    ReplyDelete
  3. మీరిలానే ప్రతీ రాత్రీ అటువంటి నవ్వుల వెన్నెల వెల్లువలలో తడిసి ముద్దవ్వాలని కోరుకుంటున్నా! మీరు వేసే చిత్రాలు కూడా మీ కవితలంత అందంగా ఉంటాయి!

    ReplyDelete
  4. mee varnana chala bagundi andi

    ReplyDelete
  5. @ జ్యోతి గారు మొదటి పలకరింపు మీదే. ధన్యవాదాలు

    @ కల్యాణ్ చాలా చాలా ధన్యవాదాలండీ

    @ రసజ్ఞ గారు మీ అభిమానానికి థ్యాంక్స్ అండీ

    @ సురేష్ థ్యాంక్స్ అండీ.

    ReplyDelete
  6. చిక్కని వెన్నెలై నా మీద కురుస్తుంటే
    ఆ క్షణంలో నాకనిపించింది
    నా చందమామ మళ్ళీ మళ్ళీ నవ్వాలని
    ఆ వెన్నెల్లేనే తడిసిపోతూ ఉండాలని ! !
    ... ఇంతవరకు కవిత నడచిన తీరులో కొంత కుతూహలమూ, పాఠకుడి మనః స్థితినిబట్టి ఊహించుకునే సందర్భమూ ఉంది. దాన్ని అలాగే ముగిస్తే బాగుంటుంది ఈ నాలుగుపాదాల్లో చేసినట్టు వాచ్యం చెయ్యకుండా. ఉదాహరణకి... చిక్కని వెన్నెలై నా మీద కురిసింది... అని అయినా ముగించవచ్చు ...

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !