Search This Blog

Sunday, November 27, 2011

చివురించిన మది








చివురులు తొడుగుతున్న నా మదికి
అల్లిబిల్లిగా అల్లిన తీవెలు నీ ఊహలు
పరవళ్ళు తొక్కుతున్న నా వయసుకు
కడలి కబురులా నీ కలల అలలు







16 comments:

  1. మీ బ్లాగ్ ఇప్పుడే చూశా చాలాబాగుంది ముందు మాట చాల బాగుంది
    చివురులు తొడుగుతున్న నా మదికి
    అల్లిబిల్లిగా అల్లిన తీవెలు నీ ఊహలు
    పరవళ్ళు తొక్కుతున్న నా వయసుకు
    కడలి కబురులా నీ కలల అలలు

    కవిత బాగుంది

    ReplyDelete
  2. @సుభ గారు
    సోయగాలు అల్లి సొగసుల తేనె చల్లి అంతగా ఎదురుచూస్తుంటే ఏ మగడి మనసైనా అగునా ...... ఎంతో బాగుంది ఆ ముఖకవళిక ....

    ReplyDelete
  3. "తెలుగు పాటల" వారి comment సౌజన్యంతో మీ ముందు మాట చదవాలని తోచింది
    రోజు వచ్చి పోతుంటాను కానీ, ముందు మాట చూడాలనే ముందు చూపు లేని నేను
    అది చూసి ఆనందించాను !!

    " సుభ "
    అర్ధ పరంగా మంచితనము
    శబ్ద పరం గా మంగళ కరము
    బ్లాగు పరం గా రెండూను !!

    Nice
    ?!

    ReplyDelete
  4. ఊహల మది
    పరుగుల వయసు
    కడలి హొయలు
    ఓహ్! మోహన సమ్మోహనం !

    ReplyDelete
  5. మంచి భావుకత!చక్కని కవనం! నన్ను ఊహించుకుని వ్రాసారేమో అనుకున్నా;)బొమ్మ నాది కాదు కనుక నా గురించి కాదని నిర్ణయించుకున్నా!

    ReplyDelete
  6. @ తెలుగు పాటలు గారూ
    స్వాగతం అండీ. మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండీ.ధన్యవాదాలు.

    @ కల్యాణ్ గారూ
    నేను రాసిందేమో గానీ మీరు వేసిన చమక్కు మాత్రం అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  7. విరిసిన వెన్నెల సోనలు
    చివుంచిన మది ఊసులు!

    ReplyDelete
  8. @ శివ గారూ
    నా పేరుకి ఒక చక్కని వివరణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు.మీరు చూసి ఆనందించినందుకు సంతోషం. ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి.

    @ జిలేబీ గారూ
    ఈ జిలేబీ ఇంతకుముందెపుడూ లేనంత తీయగా ఉందేమిటి చెప్మా!

    ReplyDelete
  9. @ రసగుల్లా
    మిమ్మల్ని ఊహించుకునే రాయొచ్చు.కాని అది నేను చేస్తే బాగోదు మరి ;).ధన్యవాదాలు మీ గిలిగింతల వ్యాఖ్యకి.

    ReplyDelete
  10. @జ్యోతి గారూ
    విరిసిన వెన్నెల సోనలు..నేను రాసినదానికి మీ వ్యాఖ్య లోని వెలుగులు తోడైతే మది మురిసిపోకుండా ఉంటుందా? ధన్యవాదాలండీ.

    ReplyDelete
  11. "కడలి కబురులా నీ కలల అలలు"

    మీ చివురించిన మది,...చిత్రం రెండూ బాగున్నాయండీ..
    మీ ఆర్ట్ చూస్తుంటే నాకు మా చెల్లి Paintings and Drawings గుర్తుకు వస్తున్నాయి...

    ReplyDelete
  12. రాజీ గారూ ధన్యవాదాలండీ.. మరి మీ చెల్లి కళల్ని అలా దాచేస్తే ఎలా? మీ బ్లాగ్ లోనే కాస్త చోటివ్వండి వాటికి కూడా.లేదంటే ప్రత్యేకంగా ఒక బ్లాగ్ మొదలుపెట్టండి సరిపోతుంది..ఏమంటారూ?

    ReplyDelete
  13. మా చెల్లికి ఆర్ట్ బ్లాగ్ వుందండీ మీకు లింక్ ఇస్తాను చూడండి..
    http://ramsarts.blogspot.com/

    ReplyDelete
  14. నాకు అర్ధం కాలేదోచ్......( నేనింకా అర్ధం చేసుకేనే వయసుకు ఎదగాలేదేమో !! హ హ హ )

    ReplyDelete
  15. raafsun ji చిన్ని చిన్ని పిల్లలకి కూడా అర్ధమైపోతే ఇంకెందుకండీ.. :):)

    ReplyDelete
  16. బాగుందండీ కవిత...వయసుకి అనుంటే ప్రాస కుదిరేదేమో కదూ!
    మ్ మ్..బొమ్మలూ బాగా వేస్తున్నారు...

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !