Search This Blog

Thursday, December 1, 2011

నీ చెలిమి నన్ను స్పృశించే వేళ...

 తొలి చినుకు తాకే వేళ
వింత పరిమళాలు చిందే పుడమి.,
భానుని లేలేత కిరణాలు సోకి
పరవశించి విరిసే పూల బాలలు.,
అమ్మ చేయి స్పర్శతో
బోసి నవ్వులు చిందించే బుజ్జాయి.,
గుండె చెరువైన వేళ
నేనున్నానని చేయి అందించే నేస్తం.,
కానరాని కన్నులకు సహితం
ఏదో స్పూర్తినిచ్చే స్పర్శ..
అదే ఆత్మీయతలోని ఆనందం
విడదీయలేని తీయని అనుబంధం !!!

36 comments:

  1. స్ఫూర్తినిచ్చే కవిత....
    చాలా బాగుంది.ఆత్మీయత మౌనంగా ఉండే ప్రకృతిలో ఎలా ఉంటుందో గుర్తుచేశారు.అభినందనలు.

    ReplyDelete
  2. చాలా బాగుంది, అనుబంధం ప్రకృతిలా సహజంగా ఎంత ఆత్మీయమైనదో చక్కగా పోల్చారు...

    ReplyDelete
  3. కలర్ ఫుల్ పిక్చర్ తో మీ కవిత చాలా బాగుంది.
    భానుని లేత కిరణాలకు పరవశించే పూబాలలను
    అమ్మ చేతిస్పర్శకు ఆనందించే పసిపాపలతో పోల్చటం గొప్ప భావన..

    ReplyDelete
  4. సుభా ఇవాళ బొమ్మలో రంగులూ..చాలా బావున్నాయి. ఆత్మీయత అనుబంధం గురించి వివరించిన విధానం చాలా బావుంది..

    ReplyDelete
  5. avnu avnu. e drawing lo colors chala bavunnai

    ReplyDelete
  6. మీరు అభివర్ణించిన అనుబంధాన్ని చూసి ప్రకృతి పరవశించింది..కవిత బాగుంది.

    ReplyDelete
  7. తొలి చినుకు తాకే వేళ
    వింత పరిమళాలు చిందే పుడమి., నాకెంత ఇష్టమో ఆ వాసన. అది కూడా బాగా ఎర్రటి ఎండ కాసి అప్పుడు వాన పడుతుంటే ఆహా మట్టి వాసన భలే ఉంటుంది!
    అనుబంధం, ఆత్మీయతల కలబోత మీ రంగుల కవిత (అంటే రంగు బొమ్మలతో కూడిన కవిత)

    ReplyDelete
  8. @ మందాకిని
    ధన్యవాదాలండీ మీ చక్కని స్పందనకి..

    @చిట్టిపండూ
    థాంకులు మీకు..కవిత నచ్చినందుకు

    @రాజీ
    మీకు బోలెడు థాంకులు..మీ వ్యాఖ్య చాలా బాగుంది.

    ReplyDelete
  9. @జ్యోతిర్మయి
    అవునాండీ....చాలా థ్యాంక్స్ అండీ మీ వ్యాఖ్యకి.
    @praady
    thx ra..nuvvu kuudaa chuustunnaav..great.

    @పద్మార్పిత
    ధన్యవాదాలండీ..

    ReplyDelete
  10. @ రసజ్ఞ
    కదా ఆ పరిమళం అంటే నాకూ చాలా ఇష్టం రసగుల్లా.. ఎండలో వాన వస్తే కూడా బావుంటుంది..అప్పుడు హరివిల్లు పూస్తుందిగా..ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి.

    ReplyDelete
  11. తొలి చినుకు తాకే వేళ
    వింత పరిమళాలు చిందే పుడమి.
    చాలా బావుంది.
    కవిత కి తగినట్టు ఉన్న మీ చిత్రం కూడా ...

    ReplyDelete
  12. శైలా గారూ ధన్యవాదాలండీ..

    ReplyDelete
  13. కవితా, బొమ్మా రెండూ చాలా బాగున్నాయండీ! :)

    ReplyDelete
  14. ధన్యవాదాలు మధుర గారూ...

    ReplyDelete
  15. నాకు ఒక డౌటు !!! పైన బాగుంది,,,సూపరు...కేక ...అన్నవాళ్ళకి అసలు కవిత అర్ధం ఐందా అని? ఆహా ఏమి లేదు ....ఒక్కళ్ళు కూడా విమర్శకులు లేకపోయేసరికి అందరు మిమ్మల్ని మోసేస్తున్నరేమో అని నా అనుమానం.....సరే ఆ బాధ్యత నేను తీసుకుంటాలెండి ... ఎంటేంటి..."గుండె చేరువైన వేళా?" అసలు గుండె చెరువు ఎలా అవుతుందండి? " కారాని కన్నులకు స్ఫూర్తి ఇచ్చే స్పర్శా??" అసలు కన్నులకు స్పర్స !!! హ్మ్...కంటి కి స్పర్స తగిలితే మంటపుడుతుంది...తరువాతా నీళ్ళు వస్తాయి ...ఆ తరువాతా ఎడుపువస్తుంది....నాకు తెలుసు మీరు నా విమర్సాని సేరియస్ గా తీసుకుంటారు ...( కవయిత్రి కి అసలు నేస్తాలు విమర్సకులే కదా!!) మీరు తీసుకోవాలి .....ఇంకా బాగా రాయాలి....

    కవిత బానే ఉంది ..కాని .....( ఎంతైనా విమర్సకుడిని కదా సమర్ధిస్తే బాగోదేమో అందుకే " కాని" ) :) : )

    శ్రేయోభిలాషి,
    RAAFSUN

    ReplyDelete
  16. అసలు నాకో సందేహం మీకు తెలుగు వచ్చా అని?లేక మొన్న మీరన్నట్టు మీ బుర్ర ఎదగకపోవడం కారణమా? ;) గుండె చెరువు అవ్వడం అంటే మీరనుకోనేది కాదు. బాధతో ఉన్నప్పుడు అని అర్ధం. కన్నులకి స్పర్శ అంటే వేలు పెట్టి కంట్లో పొడిచేయడం కాదు, కళ్ళు లేని వారిని కూడా భుజం తట్టి ప్రోత్సాహం ఇస్తుంటే ఆ స్పర్శానుభూతే ఒక చక్కని స్పూర్తిగా మారుతుంది అని. ఇక పైన కామెంటు పెట్టిన వాళ్ళంటారా? అది నేను సమాధానం చెప్పలేను మరి. మీ కామెంటు చూసి వాళ్ళలో ఎవరికైనా అలా అనిపిస్తే వారే సమాధానం చెపుతారు. మీ విమర్శ(వ్యాఖ్య)కి మాత్రం బోలెడు ధన్యవాదాలు.

    ReplyDelete
  17. @సుభ గారు
    రవి కిరణాలకు చాల బాగా అర్థం చేకూర్చారు ...
    కనులు కాచేలా ఎదురు చూసే మనసులో ప్రేమ ఓడిపోవచ్చేమో కాని .. ఆ కాచిన కనులకు నిజం చూపిస్తూ అర్థం చేకూర్చేది ఆ కిరణమే ...
    అన్నింటిని మించినది ఆ వెలుగు స్పర్శ...

    ReplyDelete
  18. ఇదిగోండి సుభ గారు , ఇలాంటి లేని పోనీ డౌట్లు పెట్టకండి...తెలుగు వచ్చేమో అనుకుని బ్లాగ్ కూడా రాస్తుంటేను !!! :)
    మొత్తానికి నా తెలివితక్కువ బుర్రకు కూడా అర్ధం అయ్యేట్టు సారాంశం రాశారుగా!! హ హా థాంక్స్...మొన్నటి కామెంటు కి దీనికి సంబంధం లేదంతే !! ఇప్పుడు కొంచెం పెద్దవాడిని అయ్యనండి బాబు...ఎంటేంటి ? పైన ఉన్నోల్లని నా మీద ఉసికోల్పుతారా!! వాళ్ళే సమాధానం చెబుతారు అని భయపెడ్తారా!! మీరు సూపరు అండి నా విమర్శ నుండి తప్పించుకోవటానికి వాళ్ళను లాగారు .....

    నా కామెంటు సరదాగే కాని...సీరియస్ గా కాదండోయ్....

    ప్చ్..ఏమిటో ఈ లోకం.....

    ReplyDelete
  19. @ కల్యాణ్
    ధన్యవాదాలండీ..

    @ raafsun
    నేను కూడా సరదాగనే అన్నానండీ బాబూ. ఇంత త్వరగా ఎదిగిపోయారేమిటో అసలు..కాంప్లాన్ గానీ తాగుతున్నారా? :):) విషయమేంటంటే, కామెంటు పెట్టిన వాళ్ళ జవాబు నేను చెప్పాననుకోండీ వేరేగా ఉంటుంది. అదే వాళ్ళే చెప్పారనుకోండి సరిగ్గా ఉంటుంది.

    ReplyDelete
  20. హ్యాపీ హ్యాపీ జన్మదినాలు మళ్ళి మళ్ళి చేసుకోవాలి అని మనసారా కోరుకుంట్టు సుభ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  21. సంకలిని తరుఫున సుభ గారికి జన్మదిన శుభాకాంక్షలు
    http://www.sankalini.org/

    ReplyDelete
  22. ivala dec 9th datta jayanthi

    inka

    mee birthday kudanu

    aggregators ninda ide news

    very nice

    celebratations chesukovatame kadu

    party ivvali suma

    " enjoy well"

    bye

    ?!

    ReplyDelete
  23. ఈ పాట చుసిన వేళ
    మనిషిలో దాగిన సుద్ధ సత్త్వం
    అక్షరంలోని ప్రతి భావ కిరణాలు సోకి
    మేల్కొల్పి చోపెను ఆత్మియతలో దాగిన దైవత్వం
    ఓ పడతి నీవు రాసిన ఈ ఆకర్షణ గొల్పు కవితం
    మనవ సుగుణాన్ని గుర్తుచేసే సుభాషితం....!!!

    ReplyDelete
  24. @ తెలుగు పాటలు గారూ చాలా థాంకులు అండీ.

    @ అప్పారావు గారూ సంకలిని తరపున శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండీ.

    @ శివ గారూ చాలా థ్యాంక్స్ అండీ.. తప్పకుండా ఇస్తాను పార్టీ.

    ReplyDelete
  25. SantoshReddy గారూ చాలా థాంకులు అండీ.

    ReplyDelete
  26. సుభా గారు మీ పుట్టినరోజని నిన్న 'శర్కరిజ్యోతిర్మయి' గారు చెప్తే తెలిసింది..
    మీరు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని..
    నేను ఇలాగే మీకు ఎన్నో పుట్టినరోజులకి శుభాకాంక్షలు చెప్పాలని కోరుకుంటూ
    మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

    ఆలస్యంగా చెప్తున్నందుకు ఏమీ అనుకోకండి..

    HappyBirthDay

    Many Happy Returns Of The Day..


    http://www.youtube.com/watch?v=-hyJsoPosCE&feature=related

    ReplyDelete
  27. "పరవశించి విరిసే పూల బాలలు.," వర్ణన బాగుందండి.

    ReplyDelete
  28. @ Raajii gaaruu thank uuuuuuu sooooooooooooo much.. suuuuuuuuuper song really..Thx once again for such a nice gift.

    ReplyDelete
  29. kavita chaalaa baagundi....bommalo inkaa daani ardam spurinchetatlu unte inkaa baaagundedi...
    meeru veyyagalarane anipistundi...chakkagaa...
    be lated happy birthday

    ReplyDelete
  30. శశి కళ గారు చాలా చాలా ధన్యవాదాలండీ.. మీ సూచనని తప్పకుండా ఫాలో అవుతానండీ.. Thx for the suggestion.

    ReplyDelete
  31. ఆలస్యంగా చెప్తున్నందుకు ఏమీ అనుకోకండి..
    be lated happy birthday
    Many Happy Returns Of The Day..

    ReplyDelete
  32. నమస్కారములు
    మీ కవితలు మనసును తాకి మమతలు పెంచేవి గా చాలా బాగున్నాయి .

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !