Search This Blog

Tuesday, December 20, 2011

శుభాకాంక్షలు

 అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ కాదేదీ కవితకనర్హం అన్నది ఒక మహా కవి మాట.. ఆ మాటలనే నాలో మాట గా చేసి, నిత్య జీవితంలో తారసపడే ఎన్నో ఘటనలే తన స్పందనలకు మూలం అని చెప్పే "నాలో మాట" బ్లాగరు కళ్యాణ్ గారి పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పేద్దామా... రండి మరి ఆలశ్యమెందుకు?



కళ్యాణ్ గారూ మీ కోసం ఈ చిన్ని గ్రీటింగ్ కార్డ్. 
    


16 comments:

  1. నిత్య జీవితంలో తారసపడే ఎన్నో ఘటనలే తన స్పందనలకు మూలం నిజమే సరిగ్గా చెప్పారు సుభా! మీ painting బాగుంది! కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే! ఆశు కవిత్వం తన్నుకుంటూ వచ్చేస్తుంది ఆయనకి. మొన్న ఇలానే వడలు వేస్తున్నాను అన్నా అంతే వెంటనే ఒక వడల టపా వచ్చేసింది! కళ్యాణ్ గారూ మా మాటలని కవితలుగా తీర్చిదిద్దే మీకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు!

    ReplyDelete
  2. సుభా గ్రీటింగ్ చాలా అంద౦గా ఉంది..కళ్యాణ్ గారూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు..

    ReplyDelete
  3. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కళ్యాణ్ గారూ...

    ReplyDelete
  4. కళ్యాణ్ గారు.. మీకు నా హృదయ పూర్వక జన్మ దిన శుభా కాంక్షలు. నాలో మాటని స్వచ్చంగా వెల్లడిస్తూ.. ఆనందంగా..సంతోషంగా..వెలుగుపూలు పూయిస్తూ..నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని ..కోరుకుంటూ..

    సుభా గారు..మీ గ్రీటింగ్ కార్డ్ చాలా బాగుంది.

    ReplyDelete
  5. కళ్యాణ్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు...

    హాయ్ సుభగారు.. మీరు డిజైన్ చేసిన గ్రీటింగ్ చాలా బాగుంది... నిన్న నా బ్లాగులో మీ కామెంట్ చూసాకే మీ బ్లాగు గురించి తెలిసింది. ఇకపై తప్పక ఫాలో అవుతాను.

    ReplyDelete
  6. కళ్యాణ్ గారికి హ్యాపీ బర్తడే..

    సుభ గారు.. కార్డు కళ్యాణ్ గారికి ఇచ్చేసి ఆ కేక్ మాకు పంపేసేయండి. మీ ఇద్దరి పేరు చెప్పుకుని పంచుకుని తినేస్తాం...

    ReplyDelete
  7. కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు..
    పసుపు పచ్చని పూలతో మీ గ్రీటింగ్ చాలాబాగుంది
    సుభా గారు...

    ReplyDelete
  8. " భూమివాణి బందరు కేంద్రం....ఈ రోజు ముఖ్యంసాలలో..."నాలోమాట" బ్లాగరు, కవి, కధకులు, రచయితా, మాటకారి,పరోపకారి,పేదల పెన్నిధి, నిస్వార్ధ సేవాపరుడు, అజాత శత్రువు, దార్శినీకులు, తెలుగు బ్లాగు లోకపు చిరంజీవి, అయినటువంటి మిస్టర్ మిస్టర్ మిస్టర్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు, జన్మదినం, బర్త్ డే.....ఆయన గారు ఇలానే హాయిగా ప్రసాంతంగా...నవ్వుతు...నవ్విస్తూ....త్రుళ్ళుతూ...గెంతుతూ...ఒక నూటఒకటి ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మా భూమివాణి బందరు కేంద్రం కోరుకుంటుంది..... అయన మీద అభిమానం తో సుభ గారు తెచ్చిన కేకు కాఫీ కలర్ లో ఉంది...
    బ్లాగ్ లో నుండి బయటకు వస్తే అందరికి సంతోషం అని ******** గారు చెప్పారు....అంతరాయానికి చింతిస్తున్నాం....
    ఆవిడా వేసిన పెయింటింగ్ ..అద్భుతం అని...********** గారు అన్నారు, మళ్ళి అంతరాయానికి చింతిస్తున్నాం, అలాంటిది మాకు కుడా ఒకటి కావాలి అని ************************** గారు డిమాండ్ చేసి లోకసభ లో పెద్ద దుమారం చేసారు..మళ్ళి మళ్ళి అంతరాయానికి చింతిస్తున్నాం,పెడనలో రోడ్డు పనులు జరగుతున్నందువలన మా "భూమివాణి" కేంద్రం కొంచెం కంపించుచున్నది.నా కుర్చీ కుడా కొంచెం ఉగుచున్నది...ఏదేదో భూకంప ప్రమాదం లా ఉంది....అర్జెంట్ గా పిండి మరకి వెళ్లి పిండి తెచ్చి ఇవ్వాలి లేక పొతే మామ్మ చంపేస్తుంది...పిండి మర కూలిపోతే మళ్ళి పిండి దొరకదు...బ్రతికి బాగుంటే ఈ భూకంప తీవ్రత ఎంతో రేపు వార్తల్లో చెప్పుకుందాం......వార్తలు సమాప్తం...

    ఆ ఆ ...ఒక్క నిమిషం....RAAFSUN గారు ఈ రోజు విలేకరుల సమావేశం లో సుభ గారి తప బాగుంది అని చెప్పారు....ఇప్పుడు సమాప్తం...చానెల్ మార్చుకోండి...

    ReplyDelete
  9. మరొకరికి సాయపడె మనస్తత్వం చచ్చిపోతోంది. దానికి కొద్దిగా ఊపిరిపోసారు. సంతసం.

    ReplyDelete
  10. మరొకరి పుట్టిన రోజు మీబ్లాగులో శుభాకాంక్షలకి టపా పెట్టిన మీ పెద్ద మనసుకు వందనం. వారికి పుట్టిన రోజు శుభకాంక్షలు.

    ReplyDelete
  11. కళ్యాణ్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. :)
    సుభా గారూ.. కేక్, గ్రీటింగ్ కార్డ్.. రెండూ సూపర్ గా ఉన్నాయి.. :)

    ReplyDelete
  12. కళ్యాణ్ గారికి సంకలిని తరఫున జన్మదిన శుభాకాంక్షలు
    http://www.sankalini.org/

    ReplyDelete
  13. వ్యాఖ్యను ఉంచిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

    @కష్టేఫలే: తాత గారూ నా బ్లాగు కి స్వాగతం. ఇంతకు ముందు నా పుట్టిన రోజుకి కూడా జ్యోతిర్మయి గారూ, కళ్యాణ్ గారూ ఇద్దరూ వాళ్ళ బ్లాగుల్లో టపాలు పెట్టరు. వాళ్ళ కంటే గొప్ప దాన్నా తాత గారూ? ధన్యవాదాలండీ..

    @శోభ గారూ బ్లాగుకి స్వాగతం అండీ.. ధన్యవాదాలు.

    ReplyDelete
  14. సంతోషం అన్నది చిన్నది మైత్రి ముందు
    మైత్రి అన్నది చిన్నది ప్రాణం ముందు
    ఆ ప్రాణం అన్నది చిన్నది మీ ఆశీస్సుల ముందు

    ఇంతింతై వెలుగంతై
    కోటి సూర్య కాంతులై
    నా స్నేహమై
    నా మంచి కోరుతూ
    అందించిన "శుభా"కాంక్షలు అందరికి నా ధన్యవాదాలు :)

    ReplyDelete
  15. mee blog bagundi..mee kavitalu bagunnayi
    mee chitraalu inkaa inkaa bagunnayi..

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !