Search This Blog

Wednesday, December 28, 2011

ఊహల ఊయలలో...

నీ తలపులు
నాలో వలపులై పొంగెను., 
నీ పిలుపులు
నాలో స్వరములై పలికెను., 
నా యెదలో 
నీ రూపమే చిత్తరువై నిలిచెను., 
నా కనులలో 
నీ కలలే వెలుగులై విరబూసెను., 
నీ స్నేహాన్ని మరచి 
నా ఒంటరితనాన్ని గెలవలేను., 
నా ఏకాంతంలో 
నీవు లేని నన్ను ఊహించలేను., 
ఇలా అందీ అందని నిన్ను ఎప్పటికి కలిసేను 
నా మనసు సంగతి నీతో ఎలా చెప్పేను !!!

12 comments:

  1. మీ బొమ్మలో అమ్మాయి జడ వేసుకోలేదు .....హిహిహి

    మీ కసిత్వం తుచ్ తుచ్ కవిత్వం అరుపు...మెరుపు...తుచ్ తుచ్ బాగుంది చాలా భాగుంది...:)

    ReplyDelete
  2. సుభ గారు ఊహల ఊయలలో గుండెలు కోయిలలై అన్నట్లుగా
    మీ మనసు చెప్పిన వూసులు చాలా బాగున్నాయండీ...

    ReplyDelete
  3. కవిత చాలా బాగుంది. ముంగురులు సవరిస్తూ ఓరకా చూస్తున్న అమ్మాయి బొమ్మ బాగుంది, మీదైన శైలిలో చక్కగా గీశారు...

    ReplyDelete
  4. ఇలా అందీ అందని నిన్ను ...... ఆర్తి వినబడుతోంది.బాగుంది.

    ReplyDelete
  5. @సుభ గారు
    రాడా చెలికాడు రాలే నా చూపులకు,
    రాడా జతగాడు చెలరేగే నా కురుల సవరింపుకు,
    రాడా నావాడు మాటాగిన పెదవులకు పాఠాలు నేర్పుటకు ... అన్నట్టు ఉందండి అ అమ్మాయి దానికి తగట్టుగా ఆ పదేంధ్రజాలము .. బాగుంది :)

    ReplyDelete
  6. ఎవరా అమ్మాయి :) నా కోసమేనా ఇంత ఎదురుచూపు?

    ReplyDelete
  7. @ raf raafsun
    మెచ్చుకున్నారా లేక ఏమన్నారో అర్ధం కాలేదు రాఫ్సన్ భాయి...ఏమైనా మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    @ రాజి
    రాజీ గారూ ధన్యవాదాలండీ మీ చక్కని వ్యాఖ్యకు..

    ReplyDelete
  8. @ చిన్ని ఆశ
    చిట్టి పండు గారూ ధన్యవాదాలు...

    @ kastephale
    తాతగారూ వినపడుతోందా.. ధన్యాదాలండీ..

    ReplyDelete
  9. @ తెలుగు పాటలు
    ధన్యాదాలండీ..

    @ kalyan
    కళ్యాణ్ గారూ మీరు భలే వర్ణిస్తారండీ..ధన్యవాదాలు మీ చక్కిలిగిలి వ్యాఖ్యకి..

    @ రసజ్ఞ
    ఎలాగైతేనేం గుర్తించారు రసగుల్లా..ధన్యవాదాలు అంత కరెక్ట్ గా చెప్పినందుకు..

    ReplyDelete
  10. సుభ గారో.......నూతన సంవత్సర ఆగమన శుభాకాంక్షలు.....చాలా థాంక్స్

    ReplyDelete
  11. ముందుగా నూతన సం.ర శుభాకాంక్షలు..

    కవిత చాలా బాగుంది...

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !