Search This Blog

Monday, November 21, 2011

ఏమౌతోంది??


కళ్ళేమో కలవరిస్తాయి
నిన్నెప్పుడు చూస్తానా అని.,
కలలేమో పలవరిస్తాయి
కంటిపాప ఎపుడు సోలిపోతుందా అని.,
కంటికి అలుపూ లేదు
కలలకు అదుపూ లేదు
అసలేమౌతోందని అడుగుతోంది మనసు!! 


10 comments:

  1. సుభాగారు మీ కవిత చదవగానే నాకు మహాత్మ సినిమాలో
    "ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది నామనసుకివాళ"
    అనే పాట గుర్తుకు వచ్చిందండీ..
    చాలా బాగుంది..

    ReplyDelete
  2. బొమ్మ, కవిత రెండూ సూపర్! :)

    ReplyDelete
  3. ఇంకా ఎమవుతోందని అడుగుతో౦దా..ఏమయ్యిందో మనసే చెప్పాలి. ఏమవ్వకపోతే కళ్ళలో ఆ మైమరుపెందుకు?

    ReplyDelete
  4. నేను లేనని బాధేమో? వచ్చేసాగా!

    ReplyDelete
  5. 'కళ్లు కలవరించడం'అనేది చాలా బాగుందండి.

    ReplyDelete
  6. @ కామెంటిన మిత్రులందరికీ కృతజ్ఞతలు.

    @ బాలూ గారూ నా బ్లాగుకి స్వాగతం.

    ReplyDelete
  7. సుభా, మీ ముందుమాట భలే నవ్వించిందండీ..అమ్మో ...ఏమీ లేదంటూనే ఎన్ని మాటలు చెప్పారు ముందుమాటలో..
    ఇక బ్లాగ్ లో మీ ఇంకొక బ్లాగ్ కి ఇచ్చిన యు ఆర్ ఎల్ తప్పుగా ఇచ్చినట్టున్నారు. సరిచేసుకోండి. (నేను ఆ బ్లాగ్ మీ ప్రొఫైల్ ద్వారా వెళ్ళి చూసొచ్చా..

    ReplyDelete
  8. బాగుంది...అడిగే మనసూ మాట వినదు కదూ !
    బొమ్మ mouse తో వేశారా, కుంచె తో కాదేమో కదూ!
    మీ బొమ్మలు ఇపుడే చూసున్నాము భావయుక్తంగా simple గా ఉన్నాయి.

    ReplyDelete
  9. ఎమౌతోందని అడిగిన ఆ మనసుకి చెప్పు
    మది సుధా భారమౌతోందని
    సుభానల్లా అవుతోందనీ
    ఇన్షా అల్లా ఐతే మమేకం అవుతుందని

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  10. @ మందాకిని గారూ అవునా? ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి.మీరు చెప్పినది సరి చేసానండీ.కృతజ్ఞతలు చెప్పినందుకు.

    @ చిట్టిపండు గారూ(మీ ఇద్దరి పేర్లూ కలిసి ఇలా ఇపోయాయండి.తప్పు నాది కాదు)..ఎంతైనా చిత్రకారులనిపించారు.అవునండీ అది మౌస్ తో గీసిందే. మొదటి ప్రయత్నం.అందుకే గీతల్లో అన్ని వంకరలు.ఐనా మీ చిత్రాలు చాలా బాగుంటాయ్.మీ కవితలకన్నా నాకు ఆ చిత్రాలే ఇష్టం.మీ వ్యాఖ్యకు బోలెడు థాంకులు.

    @జిలేబీ గారూ సుభానల్లా! మీ వ్యాఖ్యే సుధలు కురిపిస్తోందండీ..

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !