నీ వేణుగానం వినినంతనే ఆలపించెను నా మనసు మోహన రాగం., నీ చిరుహాసం కనినంతనే వివశనైతి నీ బాహువుల చేరుట కోసం., మనోహరమైన నీ రూపం దర్శించినంతనే ప్రేమావేశమై తపించేను నా హృదయం., హే వేణుధారీ! ప్రణయ విహారీ! నీ వేణుగానామృతంలో ఓలలాడి పరవశించనీ నన్ను మరీ మరీ పలువరించనీ నీ నామ పంచాక్షరి !!!
సుభ రాధాగా మారిన వేళ కవిత కడు హృద్యంగా ఉంది. ఇలా బొమ్మవేసి కవిత వ్రాయడం... రెండు కళలను ఒకేసారి పోషిస్తున్నావు శుభా...కృష్ణుడు కూడా కవిత వింటూ తన్మయత్వంలో వున్నట్టుగా వున్నాడు.
హే సుభా (రాధా) నీ మదిలోని మోహన రాగం, నీ మోములోని ఆనందభైరవి రాగం కలగలిసిన నీ ముగ్ధ మనోహర రూపాన్ని చూసి నా వేణువు ఉత్సాహంతో సకలరాగాలనీ ఆలపిస్తోంది! ప్రొద్దున్న పూజ చేసేటప్పుడు చూస్తే కృష్ణుడు కనిపించలేదు ఎక్కడికి వెళ్లినట్టు అని తెగ ఆలోచిస్తున్నా ఇక్కడ తన్మయత్వంలో ఉన్నాడనమాట!
అమ్మో ఎంత మోసం ఎంత మోసం ఇదివరకు ఆ రాదనే నీ రాధగా అనుకున్నావే ఈ రాధ విన్నపాలకు మైమరచి పోకు బొమ్మలో నిన్నువలచివేసింది మాటతో నిన్ను మురిపిస్తోంది నీకున్న రెండు కష్టాలు చూసుకో చాలు ఈ తంట నీకేల ఓ చిన్ని కృష్ణుడా చివరిమాటగా నా మనవి మోసపోకు మోసపోకు ఈ రాధ మాటలకూ మోసపోకు...
కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !
సుభ రాధాగా మారిన వేళ కవిత కడు హృద్యంగా ఉంది. ఇలా బొమ్మవేసి కవిత వ్రాయడం... రెండు కళలను ఒకేసారి పోషిస్తున్నావు శుభా...కృష్ణుడు కూడా కవిత వింటూ తన్మయత్వంలో వున్నట్టుగా వున్నాడు.
ReplyDeleteహే సుభా (రాధా)
ReplyDeleteనీ మదిలోని మోహన రాగం, నీ మోములోని ఆనందభైరవి రాగం కలగలిసిన నీ ముగ్ధ మనోహర రూపాన్ని చూసి నా వేణువు ఉత్సాహంతో సకలరాగాలనీ ఆలపిస్తోంది! ప్రొద్దున్న పూజ చేసేటప్పుడు చూస్తే కృష్ణుడు కనిపించలేదు ఎక్కడికి వెళ్లినట్టు అని తెగ ఆలోచిస్తున్నా ఇక్కడ తన్మయత్వంలో ఉన్నాడనమాట!
అమ్మో ఎంత మోసం ఎంత మోసం
ReplyDeleteఇదివరకు ఆ రాదనే నీ రాధగా అనుకున్నావే
ఈ రాధ విన్నపాలకు మైమరచి పోకు
బొమ్మలో నిన్నువలచివేసింది
మాటతో నిన్ను మురిపిస్తోంది
నీకున్న రెండు కష్టాలు చూసుకో చాలు
ఈ తంట నీకేల ఓ చిన్ని కృష్ణుడా
చివరిమాటగా నా మనవి
మోసపోకు మోసపోకు ఈ రాధ మాటలకూ మోసపోకు...
జ్యోతి గారు, రసజ్ఞ గారు, కల్యాణ్ గారు చాలా చాలా ధన్యవాదాలు మీ చక్కని వ్యాఖ్యలకి..
ReplyDeleteకృష్ణుడికి పంచాక్షరి లేదే.....అది శివ పంచాక్షరి......సరేనా?!!!!
ReplyDelete"నీ వేణుగానామృతంలో ఓలలాడి
ReplyDeleteపరవశించనీ నన్ను మరీ మరీ"
ఏమిటో మరి?!
అందరికి రాధ తలమ్పుకోస్తుంటే,
నాకు మటుకు మీరా భాయే మెదులుతున్నది
any way its really Awesome సుభ గారు
కృష్ణుడితో జాగ్రత్త !!
ఏమాత్రం ఏమరపాటు గా ఉన్నా చెక్కేస్తాడు!!
"నిమేషార్థం న తిష్టంతి దృష్టిం కృష్ణ మయిం వినా "
http://endukoemo.blogspot.com/
?!