Search This Blog
Sunday, November 27, 2011
Wednesday, November 23, 2011
నేనో పాట రాసానోచ్..
ప: ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
ఇక్కడే కలిసాము
బ్లాగులమ్మ చెట్టు నీడలో
వీడుకోలని వీడలేమని వెళ్ళలేకున్నాము
చిలిపితనపు మాటల కొలువులో
We love all the fun
We love all the joy
We love blogs...
చ: బ్లాగు దారుల్లోన జ్యోతులై వెలిగిన సమాలోచనలు
నవ్వితే నవ్వండంటూ చల్లిన చిలిపి జల్లులు
కష్టేఫలే అంటూ చెప్పిన మాటల ముత్యాలు
ఎన్నెన్నొ ఆలోచించండంటూ బాతాఖానీలు
శంకరయ్య గారి ఆభరణాలు
తెనుగు సొగసుల జాణతనాలు
హాట్ హాట్ చిల్ జిల్ జిలేబీలు
కథామంజరి వేడుకలు
మరపురాని మరిచిపోని బ్లాగులండీ
ఎంతో ఎన్నో నేర్చుకునే నెలవులండీ
పెద్దలు చెప్పే చద్దన్నం మూటలండీ
చదివేకొద్దీ బుర్రలు పదునౌనులెండీ
We love all the fun
We love all the joy
We love blogs...
చ: పనిలేక చెప్పే డాక్టరుగారి ఊసులతీరాలు
శర్కరి అల్లిన చిక్కని చక్కని అక్షరమాలలు
నోరూరించే అభిరుచిలోని ఘుమఘుమ వాసనలు
కృష్ణవేణీ తీరంలోన హృదయపు సవ్వడులు
కృష్ణప్రియ డైరీలొ మధురవాణిలు
వనజా రాజీ సరిగమపదలు
ఎన్నెల్లోనా రామాయణాలు
నెమలికన్ను రివ్యూలు
తెలుగుభావాల వెన్నెల కిరణాల బ్లాగులివండీ
నాలోమాట నవరసజ్ఞభరితమండీ
పద్మార్పితమూ ఇంకా ఎన్నో హారాలండీ
అవి కూడా సరదాగానే ఉంటాయండీ
We love all the fun
We love all the joy
We love blogs...
చిన్న మనవి:
హి హి హి :) పేరడీ అండీ. పేరడీ యా అని మీరనుకోకుండా నేనే చెప్పేసాను చూసారా(ఇదొక ఘనకార్యం మళ్ళీ).మొత్తానికి ఎలా ఐతే పాటే కదండీ రాసింది.అందుకని టైటిల్ గురించి పట్టించుకోకండే.ఇంకా ఇలా ఎన్నో చక్కని బ్లాగులున్నాయి. ఇందులో నేనేమన్నా తప్పుగా వ్రాస్తే మన్నించేయండి దయచేసి.ఏదో సరదాగా చిన్ని ప్రయత్నం చేసాను.ఎవరినీ నొప్పించడానికి మాత్రం కాదండీ.
Monday, November 21, 2011
Monday, November 14, 2011
Saturday, November 12, 2011
వృక్ష ప్రేమికుడు
" చెట్టుకి ప్రాణం పోసి బతికించండి. చెట్టుని బతకనివ్వండి " అన్న నినాదంతో ఇరవై స్కూళ్ళని ప్లాస్టిక్ రహితంగా చేసి, లక్షా ఇరవై వేల మొక్కలు నాటడానికి కారణం అయ్యాడు ఒక వ్యక్తి. వాటిలో ఎనభై వేల మొక్కలు బతికి చక్కగా ఏపుగా పెరిగి పళ్ళూ, పువ్వులూ ఇచ్చి వాతావరణంలో సమతౌల్యాన్ని తీసుకొచ్చాయి.
ఈ వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు, బంగారు పళ్ళెంలో భోజనం చేసే కోట్లాధిపతి కాదు, స్వంత విమానాలు కల పారిశ్రామికవేత్త కాదు. ఒక మామూలు బస్ డ్రైవర్.
వృక్షో రక్షతి రక్షితః అన్న నినాదం కార్యాచరణలో పెట్టి, స్కూలు పిల్లల్లో పర్యావరణ రక్షణ పట్ల అవగాహన కలిగించడానికి ఆ బస్ డ్రైవర్ ఇరవై వేల,నాలుగు వందల మంది స్కూలు పిల్లలని చెట్లు పెంచి, కాపాడే కార్యక్రమంలో నిమగ్నమయ్యేటట్ట్లు చేసాడు.
అతనే యోగనాథన్ అతనికి బాల్యం నుంచీ మొక్కలు పెంపకం అంటే శ్రద్ధ,పిచ్చి. స్కూల్లో చదువుకుంటున్నప్పుడే స్కూలు ఆవరణలో ఎర్రతంగేడు మొక్క నాటి పోషించాడు. ఈనాడు అది ఎర్రని పూలతో " ఫ్లేం ఆఫ్ థి ఫారెస్ట్ " గా చూసేవారిని కట్టి పడేస్తోంది.
తన స్వంత డబ్బుతో చిన్న చిన్న మొక్కలు కొనుక్కుని, స్కూళ్ళకి వెళ్ళి, పిల్లలకి మొక్కల పెంపకం మీద మక్కువ కలగడానికి,స్లైడ్సు వేసి,ఫిల్ములు చూపించి, వాళ్ళని ఉత్సాహ పరిచి,దగ్గర ఉండి,స్వయంగా పిల్లల చేత మొక్కలు నాటించి,సెల్ ఫోన్ ద్వారా వాటికి ఎల ఎప్పుడు నీళ్ళు పొయ్యాలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు.మధ్య మధ్య ఎలా ఉన్నాయో పర్యవేక్షిస్తుంటాడు.
యోగనాథన్ తీసిన ఫిల్మ్ కి, పర్యావరణ పరిరక్షణవారు ప్రథమ బహుమతికి ఎంపిక చేసి ఢిల్లీలో అవార్డు ఇవ్వబోతున్నారు. నలభై రెండేళ్ళ యోగనాథన్ సేవని, పర్యావరణ పరిరక్షణ కోసం అతను పడిన తాపత్రయాన్ని, టి.వి.ఛానల్స్ లో ఐదు రోజుల పాటూ ప్రదర్శించారు.
ప్రథమ అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్ళే ముందు అతని స్నేహితులు రెండు కొత్త చొక్కాలు కుట్టించి ఇవ్వబోతే, కొత్త చొక్కాలు వద్దు వాటికి అయ్యే డబ్బుతో మొక్కలు కొని స్కూళ్ళలో నాటిద్దాము అన్న ఈ వృక్ష ప్రేమికుడి లాంటివారు ఊరూరా ఉంటే సుజలాం, సుఫలాం, సస్యశ్యామలాం అవుతుంది మన దేశం____మాలతీ చందూర్.
సౌజన్యం: స్వాతి పత్రిక.
ఈ సందర్భంలో అతనికి మనం కూడా శుభాకాంక్షలు తెలియచేద్దాం.రండి మనం కూడా అతని బాటలో పయనిద్దాం.
నరజాతి మనుగడకు ఆధారం చెట్లు..
నాటండీ వేలవేలుగా నేల ఈనినట్లు..అని అందరం మన వంతు కృషి చేద్దాం.
Wednesday, November 9, 2011
గెలుపొందిన సంఘర్షణ
హాయ్ ఇప్పుడేనా రావడం?
అవును
ఏంటి డల్ గా ఉన్నావు?
హ్మ్...(నిట్టూర్పు) ఏం లేదు
చెప్పేసావా?
ఏంటి?
ఏం చెప్పాలనుకున్నావో అది
ఎలా చెప్పమంటావు?
ఏం?
తన మనసులో నేనున్నానో లేదో తెలియకుండా ఎలా చెప్పాలి?
తన మనసులో నువ్వున్నావన్న సంగతి తెలిస్తే ఇంక చెప్పడం దేనికి?
పోనీ తన మనసులో వేరే వాళ్ళెవరన్నా ఉన్నారేమో?!
అది నువ్వు అడిగితే కదా తెలిసేది.
అదే ఎలా అడగను. నా వల్ల కావట్లేదు.
కానీ ఆలస్యమయ్యేకొద్దీ నీలో సంఘర్షణ తప్ప ఇంకేమీ ఉండదేమో?
అడుగుతాను. ఒకవేళ తన మనసులో ఎవరూ లేరంటే పర్వాలేదు. కానీ...
కానీ ? ?
నేను తనని ప్రేమిస్తున్నాను అని చెప్తాను, తరువాత కాదంటే ? ?
ఏమవుతుంది? !
ఏమౌతుందా? ఇది మనసు. పనికిరాని వస్తువేమీ కాదు..
నిజమా? కొత్త విషయం తెలుసుకుంటున్నాను.
వేళాకోళం వద్దు. అదీ ఈ సమయంలో..తను కాదంటే ఏమవుతుందో నాకు ఊహించుకోవడానికే భయమేస్తోంది.
ఐతే ఊహించుకోకు..
చెప్పానా వేళాకోళం వద్దు అని.
సరే ఐతే..మరి ఇప్పుడు ఏం చేస్తావూ?
నాకు చెప్పాలని లేదు. ఇలాగే ఉంటాను. చెప్పవలిసిన అవసరం మాత్రం ఏముంది?
అలాంటప్పుడు ఈ ప్రేమించడం మాత్రం ఎందుకు?
చెప్పలేకపోతే ప్రేమించకూడదా?!
మూగ ఆరాధనా?!... బాగానే ఉంటుంది.ఐనా ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. అసలెందుకు చెప్పవు? తను కాదంటే ఏమవుతుంది? పిచ్చిదానివైపోతావా?
అనే అనిపిస్తోంది..
ఇప్పుడు మాత్రం అలా లేవనా నీ ఉద్దేశ్యం?
అంటే ప్రేమించడం పిచ్చితనమా?!
కాదు ప్రేమించి చెప్పకపోవడం పిచ్చితనం. చెప్పిన తరువాత ఏమవౌతుందో అని భయపడడం పిచ్చితనం. అసలు ఇలా ఆలోచించడమే పిచ్చితనం.
నాది భయమా?
కాదా??
కాదు..
మరి ఏమిటి?!
ఏమో నాకు తెలియదు.
తెలియదూ?!
తెలియదు.నిజంగా తెలియదు..
తెలుసు. నీకు అంతా తెలుసు. నీకు ఒక్కటే భయం. తనతో చెప్తే, తను కాదంటే ప్రేమలో ఓడిపోతావని భయం. ఆ తిరస్కారం భరించలేకపోతావని భయం..అంతేనా?
.........
మాట్లాడు..ఒప్పుకోవడానికి ధైర్యం చాలటం లేదు కదూ?!
.......
అసలు ప్రేమంటే ఏమిటి? ప్రేమలో గెలవడం ఏమిటి,ఓడిపోవడం ఏమిటి? ఇదేమీ తెలియక కేవలం చెప్తే ఏమౌతుందోనన్న భయంతో గడిపేస్తున్నావు కదూ?
అసలు నువ్వన్నది ఏమిటో తనకి తెలియకుండా నువ్వే నీ చేతులారా చేస్కుంటున్నావు. ఒకవేళ తను కాదంటే నీ ప్రేమ ప్రేమ కాకుండా పోతుందా?!
పిచ్చిదానా! ప్రేమించావు చూడూ! ఆ ప్రేమించడమే గెలుపంటే. ఇక ఇందులో ఓడిపోవడానికి అవకాశమేది?
నీ ప్రేమ నిజమైనదే ఐతే తప్పక ఫలిస్తుంది అని నేను చెప్పను. కానీ ఆ ప్రేమలో జీవించడం నేర్చుకుంటావు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.
ప్రేమంటే ఇవ్వడమే కాదు,పుచ్చుకోవడం కూడా.. ఆ పుచ్చుకోవడం తిరిగి ప్రేమే కావచ్చు,తిరస్కారం కావచ్చు లేదా ద్వేషం కావచ్చు. ఏదైనా కానీ నువ్వు అంగీకరిస్తావు.అదే ప్రేమించడంలోని గొప్పతనం. అదే ప్రేమించడంలోని ఔన్నత్యం.
ప్రేమను ప్రేమగానే ప్రేమించు.ప్రతిఫలం దక్కితే సంతోషించు. దక్కకపోతే ఇంకా ప్రేమించడం నేర్చుకో.నువ్వు నేర్చుకోవలిసిన పని కూడా లేదు. ప్రేమించడంలోనే అదంతా అలవడిపోతుంది. ప్రేమకి ప్రేమించడం ఒక్కటే తెలుస్తుంది. దానికింకేమీ తెలియదు. తెలిసినా పట్టించుకోదు.
ప్రేమించడం కన్నా ప్రేమించబడడం గొప్పది అంటారు. నిజమే కానీ అసలు నువ్వు ప్రేమించడం అన్నది లేకుండా నిన్ను అవతలివాళ్ళు ప్రేమిస్తారని ఎలా అనుకోవడం?
ప్రేమని ప్రేమించు...తిరిగి ఆ ప్రేమ నిన్ను ప్రేమిస్తుంది...ఎప్పటికైనా...ఇది తెలుసుకుంటే ఈ ఓడిపోవడం,గెలవడం ఈ మాటలకి అర్ధాలూ ఉండవు,నానార్ధాలూ ఉండవు.
వలచుట తెలిసిన నా మనసునకు
మరచుట మాత్రం తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే
మన్నించుటయే ఋజువు కదా.. అన్న కవి మాటలు చిరస్మరణీయం..
.............
మళ్ళీ ఎక్కడికీ వెళ్తున్నావు?
ఒక్క క్షణం..ఇప్పుడే వస్తాను..
అదే ఎక్కడికీ అంటున్నాను.
ప్రేమలో మునిగి 'తేల 'డానికి...
********
Monday, November 7, 2011
Saturday, November 5, 2011
Wednesday, November 2, 2011
కౌముది లో నా కవిత " అందమైన ప్రశ్న... "
Subscribe to:
Posts (Atom)