Search This Blog

Friday, September 16, 2011

భావ వ్యక్తీకరణ

మనందరికీ చాలా రకాలైన హక్కులున్నాయి. అందులో భావాలను వ్యక్తీక్తీకరించడం ఒకటి. తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా, నిర్భయంగా వెల్లడించడం అంటే చాలా ధైర్యం కావాలి. అందుకు సరైన మాటలు కూడా కావాలి. ఇలాంటి భావ వ్యక్తీకరణలో 'విమర్శ ' చాలా ముఖ్యమైనది అని నేననుకుంటాను. విమర్శ చేయడం అన్నది కూడా ఒక కళ. ఎందుకంటే విమర్శలలో కొన్ని స్పూర్తి దాయకం గాను, కొన్ని బాధ పెట్టేవి గాను, కొన్ని సరదాగాను ఇలా పలు రకాలుగా ఉంటాయి.
అసలు ఈ అభిప్రాయాలను వెల్లడించడం అనే అంశాన్ని నేను ఎన్నుకోవడానికి ఒక కారణం ఉంది. కొన్ని బ్లాగులలో విమర్శలు లేదా అభిప్రాయాలు చూస్తుంటే.. ఆయా బ్లాగర్లకి అవి ఎలా అనిపిస్తున్నాయో తెలియదు కాని నాకెందుకో బాధగా అనిపించింది. ఎందుకంటే ఆ అభిప్రాయాలు చదవడానికి వీల్లేనంతగా ఉంటున్నాయి కాబట్టి.
మేమెవరో తెలియదులే అని అలా చేస్తున్నారో, ఎలా వ్రాసినా పర్వాలేదని అనుకోవడమో తెలియదు. 
మన అభిప్రాయాలను తెలియపరిచేటపుడు మనల్ని ఏంట్రా బాబూ తింటున్నావ్ అని కాస్త సరదాగా తిడుతూ వ్రాసినా పర్వాలేదు కాని, అంత అసభ్య పద జాలాన్ని ఉపయోగించవలసిన అవసరం లేదని నా అబిప్రాయం.  
ఇక్కడ ఎవరి అభిప్రాయం వాళ్ళది అని అనుకునే కన్నా సరైన పదజాలం ఉపయోగిస్తే మంచిదేమొ అని అనిపిస్తుంది. చదివేవాళ్ళ మనసుకు కూడ హాయిగా అనిపిస్తుంది.
నేనేమన్నా తప్పుగా వ్రాస్తే బ్లాగర్లు, బ్లాగు చదివేవాళ్ళు మన్నించవలిసిందిగా మనవి. కాని ఒకసారి ఆలోచిస్తే కూడా మంచిదేమో అని నా అభిప్రాయం.

3 comments:

  1. చాలా మందికి, ఇప్పటి రాజకీయనాయకులునుండి అబ్బిన జాడ్యం అనుకొండి, ఇతరుల అభిప్రాయాలను గౌరవించగల సహనం గాని సంస్కారం గానిలేవు. అందుచేత వాళ్ళు రాసిన చెత్తని యధాతధంగా బ్లాగులో ఉంచితే, మరొకచోట వాళ్ళు గొప్పసంస్కారవంతులుగా పోజుపెట్టి సలహాలిచ్చినపుడు ఇవి వారికి గుర్తుచెయ్యడానికి పనికి వస్తాయి. మనం రాసినదానిమీద మనకి విశ్వాసం ఉన్నంతకాలం, మనల్ని ఎవ్వడూ భయపెట్టలేడు. వాళ్ళకెంత హక్కుందో, మనకి కూడా మన అభిప్రాయాలని వెల్లడించే హక్కుంది. ఏం భయపడవద్దు. Let not somebody cow you down. In fact, only the timid shall try to frighten others and more so when they are short of reason in their arguments.

    ReplyDelete
  2. మీ " భావ వ్యక్తీకరణ " చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. రాజ్ గారూ నా బ్లాగుకి స్వాగతం అండీ.. మీ స్పందనకి ధన్యవాదాలు..ఎప్పుడో వ్రాసిన టపాకి ఇప్పుడు స్పందన బాగుంది.

      Delete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !