నీ చేయి తాకిన ఆ క్షణం
నా తనువులోని అణువణువు
అరవిరిసిన కుసుమం.,
తొలొ స్పర్శలోని ఆ తీయదనం
నా మనసుకే తొలి కల 'వరం'
తెలియని అలజడి ఏదో నాలో రేగి
ఝల్లున పొంగింది విరహాల గోదారి !!
కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !
చాలా బాగుందండీ!
ReplyDeleteథ్యాంక్స్ రసజ్ఞ గారు. మీ పేరు చాలా బాగుందండి.
ReplyDelete