వాడిపోయిన మొక్క సహితం
నీరు పోస్తే చిగురిస్తుంది.,
రెక్క తెగిన పక్షి సైతం
గూటిని చేరడానికి శ్రమిస్తుంది.,
తగిలిన ప్రతి గాయం
ఒక క్రొత్త పాఠం నేర్చుకోవడానికి అవకాశమిస్తుంది
ప్రతి లక్ష్యానికి ఒక గమ్యం ఏర్పరుస్తుంది
ఒక కొత్త ఆశని రేకెత్తిస్తుంది.,
విజయం నిన్ను వరించట్లేదనకు
ప్రతి క్షణం పోరాడు
అనుక్షణం శ్రమించు
నీ దరికి రానంటుంది ఏ అపజయం
నిన్ను వదిలి పోనంటుంది ఏ నిమిషం ! !
నీరు పోస్తే చిగురిస్తుంది.,
రెక్క తెగిన పక్షి సైతం
గూటిని చేరడానికి శ్రమిస్తుంది.,
తగిలిన ప్రతి గాయం
ఒక క్రొత్త పాఠం నేర్చుకోవడానికి అవకాశమిస్తుంది
ప్రతి లక్ష్యానికి ఒక గమ్యం ఏర్పరుస్తుంది
ఒక కొత్త ఆశని రేకెత్తిస్తుంది.,
విజయం నిన్ను వరించట్లేదనకు
ప్రతి క్షణం పోరాడు
అనుక్షణం శ్రమించు
నీ దరికి రానంటుంది ఏ అపజయం
నిన్ను వదిలి పోనంటుంది ఏ నిమిషం ! !
'తగిలిన ప్రతి గాయం
ReplyDeleteఒక క్రొత్త పాఠం నేర్చుకోవడానికి అవకాశమిస్తుంది'
సుధగారూ...ఉత్త నీరు..ఉప్పు నీరు అని చెప్పి..ముత్యం లాంటి కవిత చెప్పారే..చాలా బావుంది.
చక్కని విషయాన్ని ఎంతో ముచ్చటైన పదాలతో అల్లిన కవిత.చాలా బావుంది.అన్నట్టు మీ స్వాగత వచనాలు మహా ప్రియంగా ఉన్నాయి. తప్పకుండా ఓపిక చేసుకుంటాం లెండి.
ReplyDeleteసుధ గారికి, జ్యోతి గారికి కృతజ్ణతలు. మీరు ఖాళీ చేస్కుని మరీ చూస్తాను అన్న మాటే చాలు. కొండంత బలం నాకు.
ReplyDeleteఅరే సుభా గారు, మనిద్దరికీ ఒక్క అక్షరమే తేడా చూసారా..అందుకే జ్యోతిగారు సుధా అన్నారు చూడండి. యుగళగీతం చూసినట్టున్నారు కదూ, ఇల్లాలిముచ్చట్లు కూడా వినేసి నచ్చితే చెప్పండి ప్లీజhttp://illalimuchatlu.blogspot.com/2011/09/blog-post_24.html.
ReplyDeleteసుధ గారూ! మీరు సూపర్.....
ReplyDelete