శుభాకాంక్షలు...
మనసు కన్నుల తోటలోన
విరిసె చక్కని పూవు ఒకటి
తావి తావిని కౌగిలించు
పరిమళమ్ములు చిలుకరించు
పరవశమ్ముల తేలిపోవుచు
తరలి వచ్చెను తనకు తానే
వెడలిపోయిన వసంతమ్ము
స్వాగతమ్ములు పలుకుచుండగ
కిలకిలా కులుకుచూ
నడచి వచ్చెను చిన్నారి పువ్వు
ఇప్పుడే జనియించిన అందాల నవ్వు..!
పుట్టిన రోజు 'సుభా'కాంక్షలు రసజ్ఞా :)
చక్కని కవితకు అందమైన బొమ్మ తోడై
ReplyDeleteమనసు లోతుల్లోంచి వినిపించే భావాలై
కడలి లోతుల్లోంచి ఎగసిపడే కెరటాలై
కడలే కదలి వచ్చిన "సుభ" వేళల
"రసజ్ఞ గారికి జన్మదిన శుభాకంక్షలు!"
జన్మదిన శుభాభినందనలు రసజ్ఞ గారు.
ReplyDelete