Search This Blog

Friday, July 25, 2014

భావన..!


'కల 'వరింతలన్నీ కలలే కాబోలు అని 
కలత నిద్దురలో కన్ను మూయలేని మోమాటం.,
వలచి వచ్చే వరుని కోసం
వలపులన్నీ తలపులలో దాచిపెట్టి
తలుపులన్నీ తెరచి ఉంచిన ఆరాటం., 
వేళ కాని వేళలోన కోయిలమ్మ పాటకి 
చెప్పలేని భావమేదో చివురులు తొడిగిన వాసంతం.,
ముసిరే మబ్బులకు పిల్లగాలుల పలకరింపులు తోడై
మురిసే ఆశలన్నీ జల్లులుగా కురిసే వేళకి
మరులన్నీ మనోవిరులై విరబూసిన వింత పరిమళం..!

1 comment:

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !