Photo on Internet |
మనసును మరిపించే
మధుర క్షణం ఒక్కటి చాలు..
మాసిపోయిన మమతలన్నీ మరులై పూయడానికి.,
కళ్ళను కవ్వించే చిలిపి నవ్వు ఒక్కటి చాలు..
కలల అలలపై వలపు కలువలు విరబూయడానికి.,
కరిగిపోయే కాలంలో
మరపురాని జ్ణాపకం ఒక్కటి చాలు..
మోడై నిలిచిన చెలిమి మళ్ళీ చివురులు తొడగడానికి.,
కమ్మని పాటల
ఆ కోయిలమ్మ పిలుపు చాలు..
తరలిపోయిన వసంతాలు తిరిగి అరుదెంచడానికి.,
తెలియని దారుల్లో..
తరగని పయనంలో..
అలసిన వేళల్లో..
బాధల నిట్టూర్పుల్లో..
నీ స్నేహం ఒక్కటి చాలు..
నా చిరు చిరు ఆశల దీపాలు వెలిగించడానికి..!!!
A sneham me anuvulo aayuvulo kalisinattu vundhandi ...
ReplyDeleteనీ స్నేహం ఒక్కటి చాలు..
ReplyDeleteనా చిరు చిరు ఆశల దీపాలు వెలిగించడానికి..!!!
స్నేహం గురించి చక్కగా చెప్పారు.