Search This Blog

Thursday, March 1, 2012

ఈ వయసేమిటో..


వసంత గీతమై
విరబూసిన ఆమనిలో.,
వనమంతా పులకరించి
తీవెలుగా పలుకరించి
ప్రతి పువ్వునీ స్పృశించి
మధు మరందాలు గ్రోలి.,
మత్తెక్కిన తెమ్మెరలో
ప్రణయ ఝూంకారాలు చేసే తుమ్మెదలా.,
నా మనసేమిటో ఊహలనేలుతోంది..
నా వయసెందుకో ఊయలలూగుతోంది..
నీ కన్నా ముందు నీ వలపు చేరిందా
లేక నా మనసే నిన్ను చేరుకుందా.,
ఏమో నీకేమైనా తెలుసా ప్రియా?! 

39 comments:

  1. బొమ్మంత అందంగా కవిత ఉంది. రంగుల బొమ్మ ప్రయత్నం బాగుంది.

    ReplyDelete
  2. supergaaa.....అదండీ సంగతి

    ReplyDelete
  3. కడలి లోతున దాగిన రంగులతోటి మీలోదాగిన రంగుల లోకాన్ని చూపించారు మొదటగా మీ ప్రయత్నం చాలా బాగుంది :)
    ఆపై చెప్పదలచినదేమిటంటే వయ్యారి ఎదురుచూపులు ఎంతో బాగుందండి సహజంగ. అన్నికుదిరిన రాకుమారుడు నిన్నేల తపించాలి కాని నీవెందుకే దిగులుపడుతున్నావు అన్న ప్రశ్న అడగాలని అనిపిస్తోంది ఆ సొగసరిని ( గడుసరినో కాదో నాకు తెలియదు :D ).

    సంధి కుదిరినది నీ రూపానికి ఆ భావానికి
    ప్రేమ వలచినది నీ మనసును ఆ సొగసును
    కాని ఎందుకే ఆ ఎదురుచూపులు ఆ అలసిన కనులతోటి
    జార విడువకే నీ ఎద బారాన్ని నీ ప్రియతముడు వచ్చేవరకు.....

    ReplyDelete
    Replies
    1. ప్రయత్నం మెచ్చుకున్నందుకు బోలెడు థాంకులు కళ్యాణ్ గారూ..ఆ పిల్ల గడుసరి కాదులెండి..అందుకే పాపం అంతలా దిగులు.
      ఇక నా భావానికి మీ కవిత అద్భుతం..ధన్యవాదాలండీ మరోసారి.

      Delete
  4. "మత్తెక్కిన తెమ్మెరలో
    ప్రణయ ఝూంకారాలు చేసే తుమ్మెదలా.,
    నా మనసేమిటో ఊహలనేలుతోంది..
    నా వయసెందుకో ఊయలలూగుతోంది.."
    అద్భుతమైన భావ ప్రకటన...

    ReplyDelete
  5. సుభ గారూ.. అమ్మాయి జడ చాలా బాగుందండీ..
    నాకు కూడా అంత జడ అంటే చాలా ఇష్టం..
    ఇంక అమ్మాయి తలలో కనకాంబరాలు,వాటికి మాచ్ అయ్యే బొట్టు,ఆభరణాలు,
    మీ కవిత అన్నీ బాగున్నాయి..

    ReplyDelete
  6. హా ఆ తెలిసింది తెలిసింది! చాలా బాగా చెప్పారు కాని అమ్మాయి తలలో కనకాంబరాలు బాలేదు మల్లెలు పెట్టచ్చుగా! ఎన్నాళ్ళయిందో మీ కవిత, బొమ్మ చూసి!

    ReplyDelete
    Replies
    1. మల్లెపూలు పెడితే బొమ్మలో కనపడవేమో రసజ్ఞ గారు...బ్యాక్ గ్రౌండ్ తెలుపు ఉంది కదా....!!! మందార పువ్వు అయితే ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయం.

      Delete
  7. 'నా మనసేమిటో ఊహలనేలుతుంది'.. ఆహా అనిపించేలా ఉందండీ.
    "తీవెలుగా", "మరందాలు" - ఈ రెండూ పదప్రయోగాలా? లేక వాటిని ఇలా చదివినా అదే అర్ధం వస్తుందా? తెలుసుకోవాలనే ప్రయత్నం మాత్రమే శుభగారూ. వివరించగలరు.

    ReplyDelete
    Replies
    1. బాలూ గారు ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి..
      ఇక ఆ రెండిటినీ నేనేం ప్రయోగించలేదు. మామూలుగా వచ్చినవే.ఇక్కడ తీవెలు అని అనడంలో భావం., తీగ ఒక చోట ఉండదు. అలా అల్లుకుంటూ పోతుంది.ఆ అల్లుకుపోవడాన్ని నేను పలుకరించడం అన్నాను. ఇక మరందం అంటే మకరందం. అంటే మీకు తెలుసుగా..అర్ధమైనదనే అనుకుంటున్నాను..

      Delete
    2. వివరణ ఇచ్చినందుకు కృతజ్ఞతలండి.

      Delete
  8. @kastephale
    తాతగారూ ధన్యవాదాలు..బొమ్మ ప్రయత్నం మెచ్చుకున్నందుకు సంతోషం..

    @raf raafsun
    ధన్యవాదాలు భాయీ..

    ReplyDelete
  9. @జ్యోతిర్మయి
    జ్యోతి గారూ ధన్యవాదాలండీ..

    @రాజి
    రాజీ గారూ నాక్కూడా చాలా ఇష్టమండీ అంత జడ.కానీ ఏం చేస్తాం చెప్పండి.. ధన్యవాదాలండీ..

    ReplyDelete
  10. @ వనజవనమాలి
    Thank You soooooo much Madam ji.

    @ రసజ్ఞ
    రసగుల్లా కనకాంబరాలు ఎందుకు పెట్టానో ఇక్కడ చెప్పాననుకోండి అందరూ నవ్వుతారు.. కాబట్టి ఈ సారికి కాస్త సర్దుకుందురూ..ధన్యవాదాలండీ మీ వ్యాఖ్యకి.

    ReplyDelete
  11. ఈ వయసేంటో ?

    ఇది ఎఫ్ వయసండి ! ఫన్, ఫ్రాలిక్ అండ్ ఫ్రీకింగ్.

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. హహహహ:) అంతేనంటారా? మీరు ఎలా చెప్తే అలాగే జిలేబీ గారు.

      Delete
  12. కనకాంబరం అంటే గుర్తొచ్చింది. మనబ్లాగుల్లో ఒక బాబాయి గారున్నారు. మీకు తెలిసే వుంటుందిలెండి. ఐనా ప్రేమకొద్దీ లింకు ఇక్కడ.


    http://haaram.com/AuthorComments.aspx?AuthorID=%E0%B0%95%E0%B0%A8%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B0%82&ln=te

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్స్ రామి రెడ్డి గారు లింక్ ఇచ్చినందుకు. నేనెప్పుడూ చూడలేదు ఈ బ్లాగు.ఓపెన్ అవ్వటం లేదు ఎందుకో మరి మీరిచ్చిన లింక్..

      Delete
  13. బాగుందండీ మీ కవిత.

    ReplyDelete
    Replies
    1. సుబ్బారెడ్డిగారూ ధన్యవాదాలు..అలాగే నా బ్లాగుకి స్వాగతం అండీ..

      Delete
  14. హ హా సుభ గారూ...
    ఎట్టకేలకు ఒక మెట్టు పైకెక్కి పెన్సిల్ డ్రాయింగ్ నుంచి రంగుల స్కెచ్చిల్లో కొచ్చారు.
    Welcome!
    మొదటి ప్రయత్నం లోనే సఫలమయ్యారు. పూలు "కనకాంబరాలు" అని ఇప్పుడు చూడండి అందరూ ఠక్కున పట్టేయగలిగారు. అదన్నమాట రంగుల సత్తా...అదే మీరు పెన్సిల్ లో వేసుంటే ఆ కనకాంబరారాలు మమ్మల్నెవరూ గుర్తుపట్టలేదని చిన్నబోయి వుండేవి కాదా! ;)
    చాలా బావుంది మీ కవిత, కవితకి బొమ్మ లో చూపిన భావుకత.
    అలాని పూర్తి రంగుల్లోకి దిగిపోకండి...మాయబజార్ లో లాహిరి లాహిరి పాట లో "మిట్టమధ్యాహ్నం నిండు చందమామ వెన్నెల" నలుపు తెలుపుల్లోనే సహజంగా వచ్చింది...;)
    Nice work, keep it up!

    ReplyDelete
    Replies
    1. చిట్టి పండు గారూ బోలెడు థాంకులు..మీరిచ్చిన ప్రోత్సాహమే నన్ను అంత పని చేయించింది. నిజానికి ఎందుకో ఆ బొమ్మలో జీవం లేదు అనిపిస్తోంది నాకు. ఐనా సరే పెట్టేసాను బ్లాగులో.ఏదేమైనా మీ ప్రోత్సాహం మాత్రం మరిచిపోనిది.ఇక బాగా వచ్చేవరకు కలర్స్ తో బొమ్మ పెట్టను. మరొక్కసారి మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్కుంటున్నాను మీ అమూల్యమైన వ్యాఖ్యకి..

      Delete
  15. Really the flow in your lines are very very nice subhagArU. Keep continue u r flow of words :-)

    ReplyDelete
  16. Happy Women's Day..

    http://www.123greetings.com/events/womens_day/wishes/you_make_people_bloom.html

    ReplyDelete
  17. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సుభా..

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మయి గారూ మీక్కూడా శుభాకాంక్షలండీ.. థాంకులు కూడా :)

      Delete
  18. హప్పి వుమెన్స్ డె అండి

    ReplyDelete
  19. Chala bavundandi me kavitha....me chitram kuda...:)

    ReplyDelete
  20. బాగుందండి మీ కవిత.

    ReplyDelete
  21. భలే ఉంది సుభ గారు..
    very nice

    ReplyDelete
  22. సీత గారూ ధన్యవాదాలండీ..

    ReplyDelete
  23. నా బ్లాగులోకి అడుగిడిన ప్రతి ఒకరికి అరచేతిలో కవితా పుష్పాలు.వారి బ్లాగులోకి తొంగి చూడటం ఆలస్యం నాపై కవితా పూలవాన కురిపిస్తున్నారు.వెరసి తడిసి ముద్దవుతున్న నాకవితానురక్తి.
    చక్కటి భావాల కవితాసుమమాలలల్లిన మీ భావుకతకు కవితాక్షతలు.

    ReplyDelete
  24. ఉమా దేవి గారూ చాలా చాలా ధన్యవాదాలండీ మీ కవితాక్షతలకి...మీ వ్యాఖ్యతో మనసు పులకరించింది.

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !