Search This Blog

Thursday, March 22, 2012

స్వాగత సుమాంజలులు


చిగురాకుల కొమ్మలపై
కోయిలమ్మ కుహు కుహులే 
విరిసినవి వసంత గీతాలై.,
మత్తిల్లిన మల్లియల 
పరిమళాల గాలులలో
మైమరిచిన నా మనోవనం
జాలువారినది మధుర మకరందమై.,
అరమోడ్పుల కన్నులతో
సుందర స్వప్న మనోజ్ఞ సీమలలో
తేలియాడుతున్న ఈ మనస్సును
తట్టి లేపినది మరియొక యుగాది...
హా! అని కనులు తెరచినంతనే
క్రొంగొత్త సొబగులతో, సుగంధ మాలినీ మాలలతో 
ప్రకృతి కాంత ఆ యుగాదిని అలంకరించుచుండ., 
తిలకించిన నా మది నందనమై
ఉత్సాహము చివురులు తొడిగినదై
తానే ఎదురేగి స్వాగత సుమాంజలులు 
సమర్పించె సంతసము తోడై !!!   


బ్లాగు లోకపు పెద్దలకు మరియు మిత్రులకు అందరికీ నందన నామ సంవత్సర ఉగాది 'సుభా' కాంక్షలు.. ఈ ఉగాది అందరికీ సర్వ శుభములనూ కలుగజేయాలని కోరుకుంటూ..

22 comments:

  1. "సుభా" గారూ ..
    వసంతానికి చక్కని చిత్రం తో,కవితతో స్వాగతం చెప్పేశారన్న మాట..
    మీకు కూడా నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. Peice of art you displayed and the poem -both are really nice. మీకు కూడా ఉగాది శుభాకంక్షలు.

    ReplyDelete
  3. ఈ బొమ్మ చాలా బాగుంది! దానికి తగ్గ కవిత! మీకు కూడా నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

    ReplyDelete
  4. ఉగాది పచ్చడితో ముద్దుగుమ్మ
    గానాలాపన చేస్తూ కోయిలమ్మ
    నందనంగా ఉంది మీ బొమ్మ...

    ఉగాది ని చక్కగా పెన్సిల్ తో కాగితంపైన నందనంగా చెక్కేశారు. ఈ సారి రంగుల జోలికి పోలేదే?
    మీకూ మా "చిన్ని ఆశ" నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

    ReplyDelete
  5. ఎన్నాళ్ళకెన్నాళ్లకు..
    ఆ అందమైన బొమ్మలో లీలగా ఎవరివో పోలికలు..
    కవిత చదువుతున్నంతసేపూ నందనవనంలో విహరిస్తున్నట్లుగా ఉంది. ఉగాది శుభాకా౦క్షలు సుభా..

    ReplyDelete
  6. ఉగాది శుభాకాంక్షలు సుభ గారూ..కవిత మల్లియల పరిమళంతో వసంత గీతంలా అలరించింది...

    ReplyDelete
  7. ఉగాది శుభాకాంక్షలు....kavitha chala bagumdi anDi....

    ReplyDelete
  8. @ రాజీ గారూ ధన్యవాదాలండీ.. మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు.

    @ జలతారువెన్నెల గారూ ధన్యవాదాలండీ.. మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు.

    @ రసజ్ఞ గారూ ధన్యవాదాలండీ.. మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు.

    ReplyDelete
  9. @ చిన్ని ఆశ గారూ ధన్యవాదాలండీ.. మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు.

    @ జ్యోతిర్మయి గారూ ధన్యవాదాలండీ.. మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు.ఎవరి పోలికలు కనిపిస్తున్నాయో చెప్పనేలేదండీ ఇంతకీ?

    @ కెక్యూబ్ వర్మ గారూ ధన్యవాదాలండీ.. మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు.

    @ హను గారూ ధన్యవాదాలండీ.. మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు.

    ReplyDelete
  10. సుభా గారూ ! ధన్య వాదములండీ మీకవిత మల్లెల సౌరభాలను విరజిమ్ముతోంది . మీకు కుడా " నందన నామ సంవత్సర సుభా కాంక్షలు ."

    ReplyDelete
  11. కవితాచిత్రాలు రెండూ అందంగా ఉన్నాయండీ. మీక్కుడా ఉగాది శుభాకాంక్షలు.

    ReplyDelete
  12. నందననామ ఉగాదిని
    మీ అందమైన కవితాచిత్రములతో
    అలంకరించిన తీరు అద్భుతం.
    ఈ నందనం మీకు ఆనందనందనం కావాలని
    మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
    ఉగాది శుభాకాంక్షలు...

    ReplyDelete
  13. @సుభ గారు కోయిల రాగాలు అవి పాడినప్పుడు మాత్రమె వినగలము ... కాని మీ అనురాగాలు మీ టపాల ద్వారా మీ అనుభవాల ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు మాకోసం..మీరు చెక్కిన బొమ్మ దాని తాత్పర్యము ఎంతో అందంగా ఉన్నాయి... చాలా సంతోషమండి... కాని నాకు ఈ ఉగాది నాడు చాలా బాధ వేస్తోంది...ఆమనిని ఆహ్వానించాల్సిన ఆ కోయిల మనోగతం ఇప్పుడెలా ఉందో నా మాటలలో..

    కవినైనా కాకపోతిని కవితలల్లుంటాను
    చిత్రలేఖనమైనా నేర్వకపోతిని చిత్రకారుడయుంటాను
    రాతి మనసునైనా తెలుసుకోపోతిని శిల్పినయ్యుంటాను
    కాని కోయిలనై కాలుష్యపంచున మొలచిన చిగురులు తింటూ
    గొంతు సవరించటానికి నీరు దొరక్క కన్నీటి కష్టాలతో
    రేడియో ధార్మిక కిరణాలకు నలుపు తలుకులను కోల్పోతూ
    ఉగాదిని ఏమని ఆహ్వానించను ఏ రాగముతో ఆలపించాను .....

    ఇలా చెప్పినందుకు నన్ను మన్నించాలి...

    మీకు నందన నామ సంవత్సర శుభాకాంక్షలు :)

    ReplyDelete
  14. ఉగాది శుభాకాంక్షలు

    ReplyDelete
  15. అయ్యో! చాలా ఆలస్యంగా చూసాను. సుభ గారు..చాలా బాగుంది. అందమైన చిత్రం,అమరిక గల కవిత్వం.. రెండు సరి జోడి.. ఈ సుభ..కి.. మరిన్ని శుభాకాంక్షలతో.. ఉగాది శుభాకాంక్షలు.

    ReplyDelete
  16. సుందర స్వప్న మనోజ్ఞ సీమలలో
    తేలియాడుతున్న ఈ మనస్సును
    తట్టి లేపినది మరియొక యుగాది...యెంత చక్కని ఆహా...చాలా బాగుంది

    ReplyDelete
  17. రాజేశ్వరి నేదునూరి గారు,తృష్ణ గారు,శ్రీలలిత గారు,kalyan గారు,హరే కృష్ణ గారు,వనజవనమాలి గారు,శశి కళ గారు అందరికీ ధన్యవాదాలండీ.. మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు.

    @ కళ్యాణ్ గారూ అనుకోవడానికేమీ లేదండీ.. నిజం చెప్పారు..

    @ వనజ గారూ నిన్న మీ బ్లాగ్ కి వచ్చి కామెంట్ పెడదామని చూస్తే కామెంట్ బాక్స్ ఎక్కడా కనిపించలేదు. అందుకే మీకు శుభాకాంక్షలు ఎలా చెప్పాలో తెలియలేదు.వెతుక్కుంటూ వచ్చి మరీ వ్యాఖ్య ఉంచినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు.

    ReplyDelete
  18. సుభగారూ... మీకు, మీ కుటుంబ సభ్యులకూ నందననామ సంవత్సర శుభాకాంక్షలండీ (కాస్త ఆలస్యంగా)

    ReplyDelete
    Replies
    1. పర్వాలేదు శోభ గారూ! ధన్యవాదాలు..

      Delete
  19. Subha garu...me kavitha chala bavundandi....meeru vesina bomma antha kanna bavundi :)

    ReplyDelete
  20. Replies
    1. ఫాతిమా గారూ బ్లాగుకు స్వాగతం అండీ.. కవిత మెచ్చినందుకు ధన్యవాదాలు.

      Delete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !