Search This Blog

Wednesday, February 22, 2012

కురవని మేఘం..ఏ దారిలో మేఘం నీవో
నా దారికి వచ్చావు
నా మనసున స్నేహం నింపి
కనులకు చినుకులు చేర్చావు

చేతలకు అందలేదు
మాటలకూ అందలేదు
చూపులకు తోస్తున్నావు
చేరాలని రెక్కలు నే కట్టినా
అంత దూరం రాలేకున్నా

నే తప్పులు చేస్తే
మెరుపులతో బెదిరించు
ఉరుములతో దాడిచేయించు
నిశబ్ధం ఆవరించిన నల్లని మేఘంలా ఉండవద్దు
చినుకులైనా కురిపించు
మళ్ళీ నీ స్నేహం నాకు ఇప్పించు..!


ఈ కవితను నా నేస్తం వ్రాసాడు ఇంకో నేస్తం కోసం..నాకు చాలా నచ్చి ఇక్కడ ప్రచురించుకుంటున్నాను.

మౌనం ఒక్కోసారి ఎంత నరకమో కదా..అదీ ఆత్మీయులనుకున్నవారు పలకరించకపోతే ఇంక ఆ బాధ కన్నా విపరీతమైనది సృష్టిలో లేనే లేదు.నా వరకు నాకు ఇలానే అనిపిస్తూ ఉంటుంది.

నిశ్శబ్ధం ఆవరించిన నల్లని మేఘం.. నిజమే అది కురవాలి..కురవాలంటే చల్ల గాలి తోడవ్వాలి..ఆ గాలి తోడు లేకుంటే ఆ మేఘం ఎందుకు?

స్నేహమూ అంతే.. మనసుకు వేరొక మనసే సాంత్వన అందించాలి.లేకుంటే మనసు మనుగడేది? ఒంటరిగా కుమిలిపోవడం తప్ప.అప్పటివరకు కురవని మేఘంలా స్తబ్ధుగా ఉన్న మనసు ఒక చిన్న ఆత్మీయ స్పర్శతో పులకించి కురిసిపోతుంది. సంతోషంలోనే కాదు కష్టంలో కూడా మనసుకు మనసు చేదోడుగా ఉంటే ఆ స్నేహంలో తీయదనం చెప్పేదేముంది! ఇలాంటి ఒక స్నేహం ఉంటే జీవితమే మధురం కదూ..మనుషులు దూరంగా ఉన్నా మనసుల్లో ఎప్పటికీ పదిలమీ స్నేహం.అందుకే కొన్ని సార్లు రక్తబంధం కన్నా స్నేహబంధం గొప్పది అంటారు పెద్దలు.ఈ స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే కదండీ.ఐనా నేను చెప్పేదేముందీ ఇక్కడ ప్రతి ఒక్కరికీ తెలిసినదే ఈ స్నేహమాధుర్యం..

18 comments:

 1. నేస్తం వ్రాసుకున్న కవితని రీ షేర్ చేసుకోవడం తో పాటు.. మీ మనసైన స్నేహ భావనని పంచారు. అవును.నిజం చల్లగాలికే కదా .. మేఘం వర్షించేది. ఆత్మీయత తోడుంటేనే కదా..జీవనం అర్ధవంతంగా మారుతుంది. స్నేహం.. ఒక వరం. ఆ వరం పొందిన మీరు అదృష్టవంతులు.

  ReplyDelete
 2. స్నేహంలో మాధుర్యం అరటి పండు వలిచిపెట్టినట్లు చెప్పేరు. చాలా బాగుంది చిన్న మాట

  ReplyDelete
 3. స్నేహబంధమూ ఎంత మధురమూ
  చెరగిపోదు కరగిపోదు జీవితాంతమూ..
  స్నేహం గురించి ఒక కవి అన్న మాటలు ఇవి. కాని మౌనానికి స్నేహాన్ని కరగించే గుణం ఉంది. కవితను విశ్లేషించి నీవైన మాటలలో చక్కగా వివరించావు సుభా...

  ReplyDelete
 4. సుభ గారూ... నిజమేనండీ మౌనం ఒక్కోసారి ఎంత మంచిదో అంత చెడ్డది కూడా..
  ముఖ్యంగా ఆత్మీయుల మౌనం ఇంకా ఎక్కువగా బాధిస్తుంది..
  మనుషులు దూరంగా ఉన్నా మనసుల్లో ఎప్పటికీ పదిలంగా
  ఉండే స్నేహం నిజంగా గొప్పది.
  కవిత బాగుంది..మీ విశ్లేషణ కూడా బాగుంది..

  ReplyDelete
 5. సుభ/subha గారు కవిత బాగుంది అండి మీ నేస్తానికి ధన్యవాదములు..
  తడి కన్నులనే తుడిచిన నేస్తమా..
  ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా..
  అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లె అల్లుకుంది..
  జన్మకంతా తీరిపోనీ మమతలెన్నో పంచుతోంది..
  ఎంత బాగా వ్రాశారు కదా.. స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే అండి..

  ReplyDelete
 6. वह ! क्या बात है सुबा जी !!
  दिल पसंद होगया !!
  आपका मिथ्रोम्की मेरा धन्यवाद बोलो !!


  Very nice

  ?!

  ReplyDelete
 7. బాగా రాసావమ్మాయ్!!( సరదాకి) :):)

  ReplyDelete
 8. @సుభ గారు ఆ కవిత మీ మనసు గెలిచింది అన్నారు కాని మీ చక్కని స్నేహం మీరు ప్రస్తావించిన ఆ ఇరువురి స్నేహం కూడా గెలిచిందండి :) వారు మరల స్నేహితులుగా మారాలనే మీ తాపత్రయం మీ గొప్ప మనసుకు తార్కాణం. ఇతురుల మనోభావాలను అర్థం చేస్కోవడంలో చాలా చాలా గొప్పగా వ్యవహరిస్తున్నారు లేకుంటే అంత చక్కటి బొమ్మ రాదు. మీ ప్రయత్నానికైనా వారు కలవాలని కోరుకుంటున్నాను ....

  ReplyDelete
 9. @ నే తప్పులు చేస్తే, మెరుపులతో బెదిరించు, ఉరుములతో దాడిచేయించు, నిశబ్ధం ఆవరించిన నల్లని మేఘంలా ఉండవద్దు, చినుకులైనా కురిపించు, మళ్ళీ నీ స్నేహం నాకు ఇప్పించు.
  నిజమే. ఆత్మీయులు పలకరించకపోతే ఎంత నరకమో ఈ వాక్యాలు చాలా స్పస్టంగా చెప్తున్నాయి.

  ReplyDelete
 10. @వనజవనమాలి
  వనజ గారూ అలాంటి స్నేహం పొందిన ప్రతి ఒక్కరూ అదృష్టవంతులేనండీ..ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి.


  @kastephale
  తాతగారూ మీకంటే బాగా చెప్పానా నేను? ధన్యవాదాలు.

  ReplyDelete
 11. @జ్యోతిర్మయి
  ఒక మంచి కవి మాటల్ని గుర్తుచేసారు.. ధన్యవాదాలు జ్యోతి గారూ..


  @రాజి
  రాజీ గారూ నిజం మౌనం ఎంత మంచిదో అంత చెడ్డై కూడా.. నా విశ్లేషణ నచ్చినందుకు ధన్యవాదాలు.


  @తెలుగు పాటలు
  తెలుగు పాటలు గారూ ధన్యవాదాలండీ

  ReplyDelete
 12. @ఎందుకో ? ఏమో !
  శివ గారూ తప్పకుండా చెప్తాను మీ ధన్యవాదాలు తనకి.మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.


  @raf raafsun
  ధన్యవాదాలు అబ్బాయ్..(నేను కూడా సరదాకే) :)


  @kalyan
  కళ్యాణ్ గారూ ధన్యవాదాలండీ.. నాది కూడా అదే ఆశ.


  @Balu
  బాలు గారూ ధన్యవాదాలండీ..

  ReplyDelete
 13. మీ స్నేహం తన స్నేహం కోసం రాసుకున్న కవితకి మీరు బొమ్మవేసి మీ స్నేహాన్ని మాటల్లోనూ, బొమ్మలోనూ చాటుకున్నారు. బొమ్మ బాగుంది. పెన్సిల్ తో బానే వేస్తున్నారు, రంగులు వేసే ప్రయత్నం చెయ్యండి...ఇంకా బాగుంటాయి మీ బొమ్మలు.

  ReplyDelete
  Replies
  1. చిట్టి పండు గారూ ధన్యవాదాలు..మీరు నా బొమ్మ గురించి వ్యాఖ్యానించినప్పుడల్లా సంతోషమైపోతుంది నాకు.అందులోనూ మీ లాంటి చేయి తిరిగిన ఆర్టిస్ట్ ల ప్రోత్సాహం నాకు కొండంత బలం..ఇక రంగులతో అంటారా ప్రయత్నిస్తున్నాను కానీ టెక్నిక్స్ తెలియడం లేదు.అందుకే సాహసించట్లేదు రంగులతో వేయడానికి.

   Delete
 14. పెన్సిల్ తో బాగానే వేస్తున్నారు కదూ, దానికే కలర్ పెన్సిల్స్ తో రంగులు వేసే ప్రయత్నం చెయ్యండి...మెల్లిగా వాటర్ కలర్ వైపూ అడుగులు వెయ్యొచ్చు...

  ReplyDelete
  Replies
  1. చాలా థ్యాంక్స్ చిట్టి పండు గారూ..మీ అమూల్యమైన సలహాను తప్పకుండా ప్రయత్నిస్తాను.మళ్ళీ వచ్చి మరీ కామెంటినందుకు మరీ మరీ కృతజ్ఞతలు.

   Delete
 15. నాకు నోట మాట రావటం లేదు! ఎంతో చక్కని కవిత! నిజంగా ఆ బాధని అనుభవించి రాసినట్టు ఉంది! మీ నేస్తం తన నేస్తం కోసం రాసారన్నారు ఇంతకీ ఆ నేస్తం కనికరించి చిరుజల్లు కురిసిందా లేక జడివానే కురిసిందా? బొమ్మ చాలా బాగుంది భావానికి తగ్గట్టుగా! అమ్మాయి బాగుందండీ ;)

  ReplyDelete
  Replies
  1. నల్ల మబ్బు విడిపోయి చిరుజల్లు కాదు రసగుల్లా.. అమృతాల జల్లు కురిసింది.అంటే అర్ధం అయ్యిందిగా ఏం జరిగి ఉంటుందో ;).. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

   Delete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !