అంత తేలిక కాదేమో
ఈ ప్రేమని మట్టిలో కలిపేయడం.,
ఈ గుండెకి ఒక తీయని గాయం చేసావు
జీవితంలో ఇక కోలుకోలేనంతగా.,
ఇదిగో ఇప్పుడు చూడు
ఒక్కసారి కళ్ళలోకి చూస్తావని
ప్రేమతో చిరునవ్వు చిందిస్తావని
ఆ ఒక్క చూపు కోసం తపించిపోతున్నాను...
ఎంత వింత!!
నువ్వలా చూస్తుంటే
నా మనసులో మాట నీ కళ్ళలో కనిపిస్తోంది.,
నీ జ్ఞాపకమే
నాకు రేయి పగలు తోడుగా ఉంటోంది.,
ఇపుడింక నిన్ను మర్చిపోవడం సాధ్యమేనా
నువ్వు తోడు లేకుండా నేనీ లోకాన మనగలనా!
ఎందుకీ దోబూచులాట
బాధ నువ్వే ఇచ్చావు
ఈ బాధకి మందు కూడా నువ్వే ఇవ్వు..!
కరిగే ప్రేమ ఏ మాత్రం చలించక హాయిగా కరిగిపోతోంది ఆ కడలి అంచులతో కలిసి తన మదిలోకి జారిపోతోంది అని చూసే కనులు అనుకోవచ్చు
ReplyDeleteకాని ఆ ప్రేమ తీరం దాటలేక తీరానికే అంకితమై తిరిగి కన్నీటి ఒడిలోకి జారుకుంటోంది అని ప్రేమించే మనసుకు మాత్రమే తెలుసు
ఇన్ని రోజులు కనిపించకుండా పోయి ప్రేమ, మట్టి, గాయం అని కబుర్లు చెప్తావా, హన్నా....
ReplyDeleteవెల్ కమ్ బ్యాక్ టూ బ్లాగ్ ప్రపంచము.. కవిత బాగుంది అండి
ReplyDeleteనా మన్సులో మాట నీ కళ్ళలో కనిపిస్తూంది......గొప్ప ఊహ మరిచిపోవడం అసాధ్యం.
ReplyDeleteచాలా చాలా బాగుంది. ప్రేమని మట్టిలో కలపడం సాధ్యమా!? ఒక్క వాక్యం చాలు. అభివందనం.
ReplyDeleteనిజమే ప్రేమ ఎన్నటికీ సజీవం...బాధనీ ఇస్థుంది, ఆ బాధలో ఉపశమనాన్నీ ఇస్తుంది...అదే ప్రేమ గొప్పతనం. కవిత చాలా బాగా రాశారు, కానీ మీ బొమ్మలేనందుకు కాస్త నిరాశ అనిపించింది సుభగారూ! మీ బొమ్మల్లో సహజంగా అనిపించే ఆ భావాలంటే మాకిష్టం....ఇంకెపుడూ బొమ్మ వెయ్యకుండా ఇంత మంచి కవితలు పెట్టకండి...కాస్త సమయం తీసుకునైనా వెయ్యండి...
ReplyDeleteసుభ గారు,
ReplyDeleteమీ మనసులోని వ్యధ కి సానుభూతి తెలపాలో, లేక మీ కవిత మార్ధవ్యానికి శభాష్ చెప్పాలో తెలీకుండా ఉంది. వెల్కం బేక్ అనాలో లేదో తెలీడం లేదు.
జిలేబి.
సుభ గారూ.. చాలా రోజుల తర్వాత
ReplyDeleteమీ కడలి అలల సవ్వడులు మళ్ళీ చూడటం సంతోషంగా వుంది.
"బాధ నువ్వే ఇచ్చావు
ఈ బాధకి మందు కూడా నువ్వే ఇవ్వు..!"
ప్రేమ అంతేనండీ బాధనీ అదే ఇస్తుంది.. దానికి మందునూ అదే ఇస్తుంది!
"ఎందుకీ దోబూచులాట
ReplyDeleteబాధ నువ్వే ఇచ్చావు
ఈ బాధకి మందు కూడా నువ్వే ఇవ్వు..!"
చాలా బాగుంది
చాలా బాగుంది! కానీ బొమ్మ లేనందుకు కోపంగా ఉంది ఇంకోసారి ఈ తప్పిదము చేయవలదు బాలికా!
ReplyDeleteఎందుకంత బాధ? మీ బాధకి మందుగా నన్ను పంపాడు ;) ఇప్పుడు నేనేం చేయాలి చెప్మా? ;););)
"ఒక్కసారి కళ్ళలోకి చూస్తావని
ReplyDeleteప్రేమతో చిరునవ్వు చిందిస్తావని
ఆ ఒక్క చూపు కోసం తపించిపోతున్నాను..."......... చాలా చాలా బాగుంది సుభగారూ..... అందరిలాగే కవితకు బొమ్మ లేనందుకు నాకూ కుంచెం కోపంగా ఉందంతే.... :(
@ kalyan
ReplyDeleteప్రేమించే మనసు గూర్చి చాలా బాగా చెప్పారు కళ్యాణ్ గారు.. ధన్యవాదాలు
@జ్యోతిర్మయి
హ హ హ ఎప్పుడూ ఇక్కడే ఉంటామా చెప్పండి.. అసలే పండగ.. మరి ఇంటికెళ్ళొద్దా చెప్పండి.
@తెలుగు పాటలు
ReplyDeleteతెలుగు పాటలు గారూ ధన్యవాదాలు
kastephale
తాతగారూ ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి
వనజ వనమాలి
మీ అభివందనానికి నా అభివందనం అండీ..
@చిన్ని ఆశ
ReplyDeleteచిట్టి పండు గారూ మీ వ్యాఖ్య చూడగానే గాల్లో తేలినట్టుందే అని పాట వేసుకున్నా. మీరు చెప్పినట్టు బొమ్మ వేయడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.
@Zilebi
చెప్పాలో, వద్దో అంటూ అన్నీ చెప్పేసారు జిలేబీ గారూ.. ధన్యవాదాలు
@ రాజి
ReplyDeleteమీకు సంతోషమైతే నాకూ సంతోషమే కదండీ.. నా గురించి చూసే వాళ్ళు కూడా ఉన్నారన్న సంబరం అంబరాన్ని దాటింది. ధన్యవాదాలు
@ Lasya Ramakrishna
లాస్య గారూ ధన్యవాదాలు
@ రసజ్ఞ
చిత్తం.. ఈ సారికి మన్నించేయండి రాకుమారీ.. తిరిగి ఇటువంటి తప్పిదము జరుగకుండా చూచుకొనెదము.
బాధకి మిమ్మల్ని పంపాడా? ఐతె మరి నేను చెప్పింది చేస్తారా? ;)
@ శోభ
ధన్యవాదాలండీ.. అలా కోపగించుకుంటే ఎలా చెప్పండి..నేనేమైపోవాలి? కాబట్టి ఈ సారికి క్షమించేయండి
చాలా హృద్యంగా వుందండీ...అభినందనలు..
ReplyDeleteధన్యవాదాలు వర్మ గారూ..
Delete