Search This Blog

Saturday, July 20, 2013

ఏమైందబ్బా మన బుర్రు పిట్ట??

 ఆ టైటిల్ ఏంటి అనుకుంటున్నారా? మరి అలా పెట్టకపోతే ఎలా పెడతారండీ? ఎప్పుడో ఐదు నెలల క్రితం చూసాం టపా.. మళ్ళీ ఇప్పటి వరకు లేదు అంటే అలా అనకపోతే ఎలా అనమంటారు.. మీరే చెప్పండి.. నాలాంటి వాళ్ళు ఎంతమంది చూస్తూ ఉంటారు ఆ టపాల కోసం! మేమేం చూడట్లేదంటారా? ఎందుకండీ నమ్మే మాట చెప్పండి.. ఏమో బాబూ నేను ఐతే మనసులో మాట అస్సలు దాచుకోలేను;) అందుకే చెప్పేసాను.
ఏమటండీ అలా చూస్తున్నారు వింతగా? దేని గురించి ఈ గోల అంతా అంటారా? అక్కడికే వస్తున్నాను. ఓ ఖంగారు పడిపోతే ఎలా చెప్పండి.. 
అదే నండి క్రితం సంవత్సరం నా బ్లాగులో పిట్ట కొంచెం అని టైటిల్తో ఒక టపా వ్రాసాను గుర్తుందా? దానికి ఇది కొనసాగింపన్నమాట.అప్పుడే గిర్రున ఇంకో సంవత్సరం తిరిగిపోయింది. ఇంకా గుర్తు రాకపోతే,ఏం చేస్తాం ఆ లింక్ నొక్కి చూడండి.విషయం అర్ధమైపోయిందా ఐతే? అమ్మయ్యా.. అదన్నమాట సంగతి. 
ఈ రోజు ఆ పిట్ట పుట్టినరోజండీ.ఆ పిట్టా?? క్షమించాలి క్షమించాలి పిట్ట అని వ్రాసి వ్రాసి అదే అలవాటైపోయింది;) అదేనండీ మన రసజ్ఞ(నవరసజ్ఞభరితం బ్లాగు) పుట్టినరోజు.ఇంకెందుకాలశ్యం రండి రండి శుభాకాంక్షలు చెప్పేద్దాం.
మనఃపూర్వక పుట్టినరోజు "సుభా" కాంక్షలు రసజ్ఞ.
బంపర్ ఆఫర్ : మా బుర్రు పిట్ట ఆచూకి చెప్పిన వారికి ఒక మంచి బహుమతి.చెప్పని వారికి కూడా ఉంటుందండోయ్.కానీ బహుమతి ఇప్పుడప్పుడే చెప్పబడదు:)   


కొసమెరుపు: ఎక్కడ ఉన్నా ఏమైనా, ఎవరికి వారే వేరైనా, నీ సుఖమే నే కోరుతున్నా;) 
రసజ్ఞా శుభాకాంక్షలని చెప్పి ఇలా పిచ్చి వ్రాతలు వ్రాస్తావా అని ఏ కత్తో పట్టుకుని రాకు బాబోయ్.. నేను జంప్ ఇక్కడ నుంచి.. ఐనా నేను అందుకే వచ్చాను రామా హరి;)  


7 comments:

  1. జన్మదిన శుభాకాంక్షలు రసజ్ఞ గారు :)

    ReplyDelete
  2. రసజ్ఞ గారికి హృదయపూర్వక జన్మదిన "శుభా"కాంక్షలు!
    హ హా...మీ "సుభా"కాంక్షలు చదువుతుంటే, బుర్రు పిట్టా బుర్రు పిట్టా తోటకొస్తావా...నా తోడు ఉంటావా...అన్న పాట గుర్తుకొచ్చింది.
    ఎన్నాళ్ళిలా అజ్ఞాతవాసం, నవరసజ్ఞులకిది తగదండీ రసజ్ఞ గారూ! నవరసభరితంగా మంచి పోస్ట్ తో, మళ్ళీ మీ కామెంట్స్ తో కనిపిస్తారని ఆశిస్తూ...
    p.s: మీ బంపర్ ఆఫర్ కోసం ఆచూకి ప్రయత్నాలు మొదలయిపోయుంటాయ్ అప్పుడే ;)

    ReplyDelete
  3. సుభగారూ..

    నాదీ ఇదే డౌట్... బ్లాగ్ అప్‌డేట్ కావడం లేదు ఏంటా అని... రసజ్ఞ గారు మీ పోస్ట్ చూసి అయినా, ఎక్కడ ఉన్నా పరుగున వచ్చి వారి బ్లాగులో వాలిపోవాలని కోరుకుంటూ...


    జన్మదిన శుభాకాంక్షలు రసజ్ఞగారు... మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా... :)

    ReplyDelete

  4. జన్మదిన శుభాకాంక్షలు రసజ్ఞ

    ReplyDelete
  5. రసజ్న గారికి జన్మదిన శుభాకాంక్షలు!సుమనోహర టపాలతో సుమధుర వ్యాఖ్యలతో మళ్ళీ మరొక్కసారి పురజనుల కోరిక పై అంతర్జాలంలో విజయవిహారం చేయాలని ఆకాంక్షిస్తున్నాను!

    ReplyDelete
  6. రసజ్ఞ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రీసెర్చ్ లో బిజీ గా ఉన్నారేమో సుభగారు.రసజ్ఞగారు ఒక్కో టపా ఎంతో వైవిధ్యం తో మనకిస్తారు. నేను కూడా మీ లాగే ఎదురు చూస్తున్నానండి.

    ReplyDelete
  7. belated happy birthday రసజ్ఞగారు.

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !