Search This Blog

Sunday, April 7, 2013

స్వరాల వీణ మీటి..



పల్లవి:
స్వరాల వీణ మీటి
పదాలు పాడనా
సుమాల తోట లోన
సరాగ మాడనా
ఆ నింగి దారిలోన
ఆ చందమామ చెంత
అల్లారు ముద్దు ముద్దు వెన్నెలంత చల్లుకోనా
 

చరణం :
ఏ చిలిపి ఊహో ఉప్పొంగి నాలో
వసంతమాడే వనాలలోన
వయారి ప్రాయం వరించినాక
మరులెన్నొ పూచే మనస్సులోన
ఈ సందె వేళ లోన
ఈ చిలిపి చిందులోన
చిన్నారి కోయిలమ్మ కుహుకుహూల పాట కానా

 

చరణం :
హరివిల్లి వంగీ నా సిగ్గు తుంచీ
నా లేత పెదవే ముద్దాడుతుంటే
నా చెంపపైనే చిటికేసిపోయే
వరాల పిలుపై చిగురంత చినుకే
ఆ ముద్దుగుమ్మ నేనై
ఆ సొగసు రెమ్మ నేనై
వర్ణాల వానలోన తడిసి తడిసి మురిసిపోనా

స్వరాల వీణ మీటి
పదాలు పాడనా
సుమాల తోట లోన
సరాగ మాడనా
ఆ నింగి దారిలోన
ఆ చందమామ చెంత
అల్లారు ముద్దు ముద్దు వెన్నెలంత చల్లుకోనా

21 comments:

  1. బాగుందండీ!
    పాడి వినిపించచ్చు కదా :))

    ReplyDelete
  2. స్వాతి చినుకు కోసం చకోరాలు ఎదురు చూస్తుంటాయి.మెరుపులా ఒక సారి మెరిసి అంతర్ధానమైపోతూ ఉంటే....ఎలా?
    అద్భుతః

    ReplyDelete
  3. @ఫోటాన్
    హర్ష గారూ ధన్యవాదాలు :) పాట కి లింక్ ఇచ్చాను కదండీ.. యూ ట్యూబ్ లో వినొచ్చు. ఇక్కడ కూడా రావాలి కానీ ఎందుకు రావటం లేదో తెలియడం లేదు :(

    @kastephale
    హా హా.. తాతగారూ భలే చమత్కారం చేస్తుంటారండీ మీరు.

    ReplyDelete
  4. @ఫోటాన్ గారు ఓ చిన్న పొరపాటు వల్ల వీడియో రాలేదండి - ఇప్పుడు వస్తోంది మరొక్కసారి చూడాలని మనవి :)

    ReplyDelete
    Replies
    1. చూసా సుభ గారు!
      థాంక్స్

      Delete
  5. వావ్....బాగుందండి.

    ReplyDelete
  6. Subha garu,charanam lo Vayyari na vayari???

    ReplyDelete
  7. @ Padmarpita
    పద్మార్పిత గారూ ధన్యవాదాలండీ :)

    @ శశి కళ
    శశి గారూ థాంక్యూ సో ఓఓఓఓఓఓఓ మచ్ :):):)

    @naveen
    నవీన్ గారూ ధన్యవాదాలు. వయారి అనే వస్తుందండి.. ఇక్కడ ప్రాయాన్ని వయారి అని చెప్పా.

    ReplyDelete
  8. సుభ గారూ,
    చాలా రోజులకి మళ్ళీ స్వరాల వీణని నిజంగానే మీటారు. శ్రావ్యమైన స్వరమూ, చిన్న చిన్న పదాలతో నేర్పుగా కూర్పుగా అల్లిన సరాగాల స్వర పద మాలిక చాలా బాగుంది. ఈసారి ఇదివరకటి పాటలకన్నా కొంచెం ఫాస్ట్ గా రాగం కదిలింది అనిపించింది. చివరిలో లలాల్ల లాలలల్ల ఉహూహు హూహుహు అంటూ ముగింపు చాలా బాగుంది. రెండవసారి మధ్యలో నవ్వు తరువాత లలాల్లలాల్లలల్ల...నవ్వు...తరువాత హుహూహు కత్తిరించి ఊహుహూ అని ముగించుంటే రాగంలో నవ్వు కలిసేది అనిపించింది.
    Keep the passion alive. Very nice attempt.

    ReplyDelete
    Replies
    1. పండు గారూ మీ ప్రోత్సాహానికి నాకెలా స్పందించాలో కూడా అర్ధం కావటం లేదు, బోలెడు థాంకులు అని చెప్పడం కన్నా.. Thank you soooooooooo much.

      Delete
  9. పాట వినడానికి నిన్నటినుంచి ప్రయత్నం,కొంచెం ప్రయత్నం చేస్తే సినిమాలే తరవాత అడుగనుకుంటా...మమ్మల్ని మరిచిపోవద్దేం... :)

    ReplyDelete
    Replies
    1. Thaathagaaru nalomaata meru palikesaru - subha gaariki idhi chepthe pattinchukoru meeru malle cheppi namakaanni balaparichaaru :)

      Delete
    2. @ kastephale

      తాతగారూ ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించాలి. చాలా పెద్దగా ఆశీర్వదించేసారు. ఆశీర్వాదంతో పాటూ ఒక చమత్కారం కూడా చేసారు. ఏదేమైనా మీ దీవెనలకి సదా కృతజ్ఞురాలిని.

      @ kalyan
      కల్యాణ్ గారూ మీరు వెనకాలే వచ్చేసారేంటండీ తందాన తానా అనుకుంటూ.. ఏదేమైనా మీ నమ్మకానికి బోలెడు ధన్యవాదాలు.

      Delete
  10. సుభ గారు చాల బావుంది మీ సాంగ్..నిజంగా మదిలో స్వరాలూ పలికించారు...

    ReplyDelete
    Replies
    1. కార్తీక్ గారూ చాలా చాలా కృతజ్ఞతలండీ మీ అమూల్యమైన స్పందనకి. మీ బ్లాగు బాగుంది. మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకోవాలి మీ బ్లాగును:) ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించాలి.

      Delete
  11. సుభగారూ, గమనించారో లేదో, ఇది మీ నూరవ టపా ;)

    ReplyDelete
    Replies
    1. పండు గారూ నిజమే సుమా గమనించనే లేదు. 100 టపాలు పూర్తిచేసినందుకు నాకేమి బహుమతి ఇస్తున్నారో చెప్పనే లేదు ;) . త్వరగా చెప్పేయండి మరి. నిరీక్షణ ఇక్కడ. ( పండు గారూ ఇప్పుడు మీరేమనుకుంటున్నారో నాకు తెలుసులెండి., నేరకపోయి చెప్పాను. ఇరుక్కుపోయానూ అనేకదా? మీరేమనుకున్నా సరే నాకు బహుమతి ఇవ్వాల్సిందేనండోయ్. ;);) ) కనిపెట్టినందుకు నాకేంటి అంటారా? థ్యాంక్స్ చెప్పేస్తున్నాగా :):):)

      Delete
    2. బావుంది, బావుంది.
      అసలు సెలెబ్రేషనే లేదు, ఓ చిన్న ఇన్విటేషనూ లేదు...కనీసం కేకు ముక్కైనా లేదు. బహుమతి పట్టుకుని పరిగెట్టుకొచ్చెయ్ మంటున్నారు.
      తదుపరి పోస్ట్ లో మాంచి పాట పాడి, ఆ పాటకి చక్కని రంగుల బొమ్మా వేసి వంద టపాల పండగ గ్రాండ్ గా చెయ్యండి. మీరు మెచ్చే బహుమతి మీకందుతుంది ;)

      Delete
    3. అమ్మో అమ్మో!! ఎంత తెలివో పండు గారూ మీకు. నేను మిమ్మల్ని ఇరికించాననుకుంటే, మీరు ఏకంగా గొయ్యి తవ్వి మరీ అందులో తోసేసారు నన్ను;)
      నేను బ్లాగు పెట్టడమే గొప్ప.. అందులో వ్రాయడం ఇంకా గొప్ప (అందులో విషయం ఉంటుందో,లేదో నాకే తెలియదు).. ఏదో మీ లాంటి వాళ్ళ ప్రోత్సాహంతో ఎలాగో నెగ్గుకొచ్చేసాను. అలాంటిది నాకెందుకండీ ఈ సెలబ్రేషన్సూ గట్రాలూ? కానీ అలా చేస్తే కానీ మీరు బహుమతి ఇవ్వనంటున్నారే? హతవిధీ! ;) ఏం చేస్తాం ఇంక.. గిఫ్టూ పాయెనే, మంచి గిఫ్టూ పాయెనే అని పాడుకోవడం తప్ప ;) :):)

      Delete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !