Search This Blog

Sunday, November 18, 2012

మనసే పాడినది...



                                                                                                                                                            

మనసే పాడినది
మరులై పూచినది
సుమ గంధాల అందాలు చిలికినది


నీలాకాశపు పందిరి కింద
చక్కని చుక్కల పానుపు పైన
ముసిరే తలపుల మిసమిసలేవో
గుసగుసలాడే కమ్మని వేళ


ప్రకృతి కాంతకు నెచ్చెలి నేనై
విచ్చిన పువ్వుల నవ్వులు నాకై
విరిసే వయసుల మధుమాసంలో
వలపుల జల్లులు కురిసే వేళ

మనసే పాడినది
మరులై పూచినది
సుమ గంధాల అందాలు చిలికినది

 


నా పాటల్ని ఇష్టపడుతున్న, ప్రోత్సహిస్తున్న బ్లాగ్ మిత్రులకు మరియు పెద్దలకు చిన్న విన్నపము. నాకస్సలు సంగీత జ్ఞానం లేదు. నా మనసులో ఏ రాగం మెదిలితే దానికి అలా పదాలను కూరుస్తూ ఉంటాను. ఇప్పటి వరకు పెట్టిన రాగాలన్నీ చాలా నెమ్మదిగా ఉన్నాయి.. ఇంకా కాస్త మెరుగైన, హుషారైన బాణీలను కూర్చటానికి ప్రయత్నిస్తున్నా. మామూలుగానే నాకు మెలోడీస్ అంటే ఇష్టం.. ఆ కారణంతోనో మరేమో నాకు అన్ని రాగాలు ఇలానే వస్తున్నాయ్. అన్నీ ఒక మూస లోనే ఉన్నాయి అని అనుకోకుండా నన్నింకా ప్రోత్సహిస్తూ ఉంటారని మనఃస్పూర్తిగా ఆశిస్తున్నాను.   


**పాటకి ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ పెట్టమని ప్రోత్సహించి, ఆ టైటిల్స్ కూడా తనే వ్రాసి ఇచ్చిన కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూన్నాను...

28 comments:

  1. మనవరాలు పాడుతుందని తెలుసుకాని ఇంత బాగా కవితలల్లి పాడగలదనుకోలేదు :)

    ReplyDelete
  2. సుభ గారూ, మీ పాట చాలా శ్రావ్యంగా ఉంది. రాగం నెమ్మదిగా ఉందన్న మాట నిజమే. ఏ కళలో అయినా ప్రతి ఒక్కరికీ ఒక స్టైల్ ఉంటుంది. మీ స్టైల్ మెలోడీ ఏ నేమో అనిపిస్తుంది. మొదలూ, చివరా మీరు తీసే రాగం మీ పాటకు సంగీతంలా ఉంది. సంగీత జ్ఞానం వినే మాకూ లేదు. కానీ విన్నాక కొన్ని నిమిషాలు ఆ రాగం మదిని వెంబడిస్తూనే ఉంది, మీ ప్రతి పాటలోని ప్రత్యేకతా ఇదే!

    ఈ పాటలో మాత్రం "విచ్చిన పువ్వుల నవ్వులు నాకై..." అన్న లైన్ మొదటి సారి ఆలపించినపుడు "నవ్వులు" అన్న పదంలో చిన్న నవ్వూ వినిపించింది. ఇలా పదాల్లో ఎక్స్ప్రెషన్స్ మిక్స్ చేసి పాడితే పాటకి మరింత నిండుదనం వస్తుంది.

    చక్కని పదాలను రాగం తో కట్టి, తియ్యని స్వరం తో అల్లిన శ్రావ్యమైన రాగమాలిక మీ పాట.
    మీకు మనసారా అభినందనలు!
    మనసే పాడినది...మధురముగా ఈవేళ...

    ReplyDelete
  3. మరొక్క మాట...కళ్యాణ్ గారి సబ్ టైటిల్స్, మీ ప్రెజెంటేషన్ రెండూ పాటకి చక్కగా అమరాయి.

    ReplyDelete
  4. అభిరుచి ముఖ్యం. సంగీతం రాకున్నా మనసు
    రాగం తీసి పాడితే చాలు. ఆనందభైరవి రాగాలు
    పరిగెత్తుకుంటూ వస్తాయి. మీరు కంటిన్యూ చేయండి
    మేం.. ఇంకా విని తరించాలనుకుంటున్నాం. బాగుంది
    శుభ గారు.

    ReplyDelete
  5. టప టప టప... టప టప టప
    చెమట బోట్లు తాలాలై పడుతుంటే
    కరిగి కండనరాలే స్వరాలు కడుతుంటే
    పాటా పనితో పాటే పుట్టింది.....పని పాటతోటే జత కట్టింది.......
    పద్మ గారు మీ పాట...మీ ప్రయత్నం బాగుంది....కొనసాగించండి....

    ReplyDelete
  6. మంచి పాట,పాడుతూ వుండండి,మేం వింటూ వుంటాం,..అభినందనలు.

    ReplyDelete
  7. "సుమ గంధాల అందాలు చిలికినది..."
    అర్ధవంతంగా పాడారు. తెలుగుపాట అర్ధం అయ్యే రోజలు ఎప్పుడో పోయాయి.

    మీ ఈ కడలి లో చిలికిన గాత్రం లో " ముసిరే తలపుల గుస గుసలు .." మరిన్ని వినిపించాలని మనసారా కోరుతూ...
    కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ...

    అభినందనలతో..........

    ReplyDelete
  8. రచన బాగుంది.(పాట వినే అవకాశం ఇప్పుడు లేదు. ) అభినందనలు సుభాషిణి గారు!!

    ReplyDelete
  9. శ్రావ్యంగా ఉందండి..:)

    ReplyDelete
  10. సుభ గారూ మంచి ప్రయత్నమండీ..
    ఇంకా కొత్త కొత్త ప్రయోగాలు చేయండి.. తప్పకుండా మాకు నచ్చుతాయి :)

    ReplyDelete
  11. Subha gaaru, kavitha bagundi.. andamaina padaala allika

    ReplyDelete
  12. నీలాకాశపు పందిరి కింద
    చక్కని చుక్కల పానుపు పైన
    ముసిరే తలపుల మిసమిసలేవో
    గుసగుసలాడే కమ్మని వేళ
    నాకూ మా బాగా నచ్చేసిందమ్మా సుభ...మీ గొంతు కూడా..

    ReplyDelete
  13. చాలాబాగుందండి...చక్కని గాత్రం

    ReplyDelete
  14. చిక్కని భావాన్ని చక్కగా పాడి మనసు దోచేస్తున్నారుగా:-)

    ReplyDelete
  15. బాగుందండీ,
    నాకు దీనికన్నా ముందు పాట చాలా బాగా నచ్చింది. :)

    ReplyDelete
  16. @ kastephale
    హ హ :) తాతగారూ ధన్యవాదాలు.


    @ చిన్ని ఆశ
    పండు గారూ మీ వివరణాత్మకమైన స్పందనకి చాలా చాలా ధన్యవాదాలు. ప్రతి చిన్న అంశాన్నీ సునిశితంగా పరిశీలించి చెప్తారు. మంచి చిత్రకారులు కదా మీరు ఐనా..అందుకే ఆ పరిశీలన. మొత్తానికి పాట విని మీ మనసు కూడా ఆనందంతో పాడడం నిజంగా సంతోషం. కానీ విభిన్నంగా కూడా ప్రయత్నించాలని అనుకుంటున్నాను. మీ ప్రోత్సాహానికీ, అలాగే పాట ప్రెజెంటేషన్ మెచ్చినందుకు కూడా మరొక్కసారి ధన్యవాదాలండీ.


    @ సతీష్ కొత్తూరి
    సతీష్ గారూ మంచి మాట చెప్పారు. ధన్యవాదాలండీ మీ ప్రోత్సాహానికి.

    ReplyDelete
  17. @ డేవిడ్
    డేవిడ్ గారూ బాగుంది మీ టప టప చినుకుల వ్యాఖ్య. ధన్యవాదాలండీ


    @ the tree
    భాస్కర్ గారూ ధన్యవాదాలు


    @ ఛాయ
    ఛాయ గారూ, పాట అర్ధవంతంగా ఉందన్నందుకు థాంక్స్ అండీ.. మీ అభినందనలకి ప్రత్యేక అభివాదములు.


    @ లక్ష్మీదేవి
    లక్ష్మి గారూ పాట కూడా విని ఎలా ఉందో చెప్పండి మరి :) ధన్యవాదాలండీ..

    ReplyDelete
  18. @ ధాత్రి
    ధాత్రి గారూ ధన్యవాదాలండీ.


    @ రాజ్యలక్ష్మి
    రాజీ గారూ మీ స్నేహపూర్వకమైన ప్రోత్సాహం ఎప్పుడూ మరిచిపోలేనిది. ధన్యవాదాలండీ..


    @ Meraj Fathima
    మెరాజ్ గారూ ధన్యవాదాలు


    @ ఓలమ్మోలమ్మో
    ఓలమ్మోలమ్మో గారూ ధన్యాదాలండీ.. మీ ప్రొఫైల్ పేరు భలే ఉందండోయ్ ;)

    ReplyDelete
  19. @ జీవన పయనం - అనికేత్
    అనికేత్ గారూ చాలా థాంకులండీ.


    @ Padmarpita
    పద్మ గారూ నేనా? మనసు దోచేసానా? నిజమే? ధన్యవాదాలండీ మీ స్పందనకి :)


    @ Raja
    రాజా గారూ ధన్యవాదాలండీ.. ఏ పాట నచ్చినా సంతోషమే నాకు :)


    @ చెప్పాలంటే......
    మంజు గారూ ధన్యవాదాలండీ..

    ReplyDelete
  20. కమ్మని తెనుగు మాటలు కట్టి , పాడి
    శ్రోతలకు హాయి గూర్చెడు ' సుభ ' ప్రతిభకు
    అచ్చెరువు గల్గె, మనసున హాయి గొల్పె
    కళల రెండింటి నెలవు మా ' కడలి ' యౌర !
    -----సుజన-సృజన

    ReplyDelete
  21. శతంజీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి,
    శతమేన మేన శతాత్మానం భవతి శతమనంతం భవతి,
    శతమైశ్వర్యం భవతి,శతమితి శతం దీర్ఘమాయుః,

    దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘసుమంగళీ భవ.

    ReplyDelete
    Replies
    1. తాతగారూ శతకోటి ప్రణామాలు మీ ఆశీర్వచనానికి..

      Delete
  22. శుభ గారు!
    మీకు కుడా పుట్టిన రోజు శుభాకాంక్షలు (కొంచెం ఆలస్యం గా) :)

    ReplyDelete
  23. హా హా.. హర్ష గారూ మెనీ మెనీ థాంక్స్..

    ReplyDelete
  24. Nice Words - Sweet Voice - Great Work....

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !