Search This Blog

Saturday, November 10, 2012

నువ్వు మిగిల్చిన జ్ఞాపకం ( నేను ) ...

సేకరణ : http://www.exoticindiaart.co.in

నా కోసమే పుట్టావనుకున్నాను
నీ కోసమే బ్రతకాలనుకున్నాను.,
కలలే తెలియని కనులకు
ఒక మధురమైన స్వప్నమయ్యావనుకున్నాను
నా కోసమే పుట్టావనుకున్నాను.,
కళనే ఎరుగని ఈ మనసుకు
సృష్టినే సుందర కళాఖండంగా చూపించావనుకున్నాను
నీ కోసమే బ్రతకాలనుకున్నాను.,
మామూలుగా ఉన్న ఈ లోకం
ఉన్నట్టుండి క్రొత్తగా తోచిన వేళ
ఇదేమిటని అడిగితే
ఇది మన ఇరువురి కనులకు మాత్రమే
కనిపించే ప్రపంచము అంటే
నీతోనే నా లోకము అనుకున్నాను.,
కానీ ఇంతలోనే...
నాకందనంత దూరానికి నువ్వెళ్ళిపోయావు
నన్ను ఒంటరిగా వదిలి
నీ దారి నువ్వు చూసుకున్నావు.,
కళ్ళు తెరిచి చూసా ఐనా చీకటి
తెలుస్తున్నది ఒక్కటే.. సన్నటి కన్నీటి పొర
కళ్ళలో ఇమడలేక
చెక్కిలిపై ఏకధాటిగా ప్రవహిస్తోంది.,
తరువాత తెలిసింది...
నన్ను నడిపించిన ఆ అమృత హస్తం
నా మధుర స్వప్నం
ఇక ఎన్నటికీ తిరిగిరాదని
అందరూ అనుకుంటుంటే.,
కానీ వాళ్ళకు తెలియదు
" నేనే నువ్వు " అని... ఎప్పటికీ..!

33 comments:

 1. నిరాశా? దగ్గరకే రానివద్దు.

  ReplyDelete
 2. నేనే నువ్వు..నువ్వే నేను .. అయినప్పుడు వేరొకటి బాధ కల్గించునా !
  దూరంగా ఉంటేనేం.. మీలో ఉన్నట్టేగా.. !
  బావుంది.

  ReplyDelete
 3. "సన్నటి కన్నీటి పొర
  కళ్ళలో ఇమడలేక
  చెక్కిలిపై ఏకధాటిగా ప్రవహిస్తోంది"
  సున్నితంగా చెప్పారండి.

  ReplyDelete
 4. చదువుతుంటే చాలా బాధగా ఉంది.బాగా వ్రాశావు శుభా

  ReplyDelete
 5. వియోగ బాధనుకున్నాను విషాదంగా ముగిసింది.
  ఎప్పటికైనా ఇరువురం ఒకటేనన్న భావం...బావు౦ది సుభా.

  ReplyDelete
 6. నా మధుర స్వప్నం
  ఇక ఎన్నటికీ తిరిగిరాదని
  అందరూ అనుకుంటుంటే.,
  కానీ వాళ్ళకు తెలియదు
  " నేనే నువ్వు " అని... ఎప్పటికీ..!...chaalaa baagundi...subha gaaroo!...@sri

  ReplyDelete
 7. చాలా కాలాని మళ్ళీ మంచి కవితతో వచ్చేశారు.
  బొమ్మ సేకరించేశారా ఈసారి వెయ్యకుండా ;)
  మీ పాటలు వినటం వల్లేమో ఇదీ పాటలానే అనిపించింది. రాగం కట్టేఉంటారీ పాటికి, అవునా?

  మామూలుగా ఉన్న ఈ లోకం
  ఉన్నట్టుండి క్రొత్తగా తోచిన వేళ...
  సన్నటి కన్నీటి పొర కళ్ళలో ఇమడలేక
  చెక్కిలిపై ఏకధాటిగా ప్రవహిస్తోంది...
  ఒక్కసారి నేస్తం జ్ఞాపకమైపోతే ఎంత తేడానో .....
  బాగుంది "నేనే నువ్వు ఎప్పటికీ" అన్న ఆ భావం.

  ReplyDelete
 8. " నేనే నువ్వు " అని... ఎప్పటికీ..!
  ఈ ఆలోచన చాలు కదా మనసుకి ఏ బాధా లేకుండా..
  చాలా బాగుంది..

  ReplyDelete

 9. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభకామనలు.

  ReplyDelete
 10. మనము పిలవకున్నా మరునిమిషం అన్నది ఉంటుంది.. అలాంటిది కన్న స్వప్నాలు భావాలు మనవి అనుకున్న మధుర క్షణాలు నిజము కాకుండా పోదండి.. పైగా వాటికి మీరు దృశ్యరూపం, కావ్య రూపం, మనో రూపం ఇత్యాదులు కల్పిస్తుంటే ఇక అది తప్పించుకోగలదా.... ఉదాహరణకు మేమే తప్పించుకోలేకున్నాము అది మీకు తెలుసు కదండి... :)

  ReplyDelete
 11. హలో అండీ !!

  ''తెలుగు వారి బ్లాగులు'' తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!

  వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
  ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ ...
  ఒక చిన్న విన్నపము ....!!

  రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది

  మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
  మీ అంగీకారము తెలుపగలరు

  http://teluguvariblogs.blogspot.in/

  ReplyDelete
 12. ఒక మనసు రెండు శరీరలలో ఉండలేక..
  ఒకే శరీరాన్ని విడిచింది..
  "నేనే నువ్వు.."
  చాలా సున్నితంగా చెప్పారండి..

  ReplyDelete
 13. నువ్వు దూరంలో వున్నా
  నా చేరువలోనే వున్నావన్న భావనా...
  ఎందుకో తెలుసా నేస్తం?
  నువ్వున్నది నా ఉహల్లో కాదు
  నా ప్రాణంలో...
  తూర్పున కిరణంలా....
  సాగరాన కెరటంలా....
  ................సుభ గారు మీ కవితలోని భావం బాగుంది...

  ReplyDelete
 14. @ kastephale
  తాత గారూ తప్పకుండా మీ మాట ని గుర్తుంచుకుంతాను. కానీ అప్పుడప్పుడూ ఆ నిరాశలో కూడా ఆశని వెతుక్కుంటూ ఉంటానంతేనండీ.. ధన్యవాదాలు.

  @ వనజవనమాలి
  వనజ గారూ చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.


  @ చెప్పాలంటే......
  మంజు గారూ ధన్యవాదాలండీ..


  ReplyDelete
 15. @ Padmarpita
  పద్మార్పిత గారూ.. మీకంటే బాగా చెప్పానంటారా? :) ధన్యవాదాలండీ..


  @ శశి కళ
  శశి గారూ.. ఒక్కోసారి అంతేనండీ.. వ్రాసి చూసాక అనిపించింది నాక్కూడా అలాగే. ధన్యవాదాలండీ.


  @ జ్యోతిర్మయి
  జ్యోతిర్మయి గారూ వియోగమైనా, విషాదమైనా జ్ఞాపకం జ్ఞాపకమే కదండీ.. అదేంటో సజీవంగా ఉన్నపుడు తెలియని విలువ జీవం లేనపుడో లేక మనకి దూరమైపోయినపుడో మాత్రమే గ్రహించగలం..ధన్యవాదాలండీ మీ వ్యాఖ్యకి.

  ReplyDelete
 16. @ శ్రీ
  శ్రీ గారూ ధన్యవాదాలండీ..


  @ చిన్ని ఆశ
  పండు గారూ కవితతోనే వచ్చాను కానీ నాకేమిటండీ మీరు సేకరించారా అంటే కొట్టుకోచ్చారా అని అన్నట్టు అనిపిస్తోంది ;) అలా కానీ అనలేదు కదా.. కాస్త సందేహ నివృత్తి చేద్దురూ దయచేసి.
  భలే వారండీ మీరు.. మీ అభిమానానికి థాంక్స్. ఇది అచ్చంగా తవికే.. పాట కాదు. రాగం కట్టలేదులెండి. ఒకవేళ రాగం కడితే ఇక్కడ పెట్టకుండా ఉంటానా? ఒక్కసారి నేస్తం జ్ఞాపకమైపోతే ఎంత తేడానో ..... కదండీ.. ధన్యవాదాలు మీ స్పందనకి.

  ReplyDelete
  Replies
  1. అయ్యాయ్యో సుభ గారూ, అలా వినబడిందా? సేకరించారా అంటే, పట్టుకొచ్చారా అని, కొ... అని ససేమిరా కాదు ;)

   Delete
  2. సందేహం క్లియర్ అయ్యీ అవ్వనట్టుందేంటో పండు గారూ :):)

   Delete
 17. @ రాజి
  రాజీ గారూ మనసులో భావం ఇట్టే గ్రహించేస్తారండీ మీరు :) . ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి.


  @ kastephale
  తాతగారూ థాంక్స్ అండీ.. మీక్కూడా దీపావళి శుభాకాక్షలు.( ఆలశ్యంగా జావాబిస్తున్నందుకు మన్నించండి )


  @ kalyan
  కళ్యాణ్ గారూ భలే చమత్కారంగా కామెంటుతారండీ మీరు. నిజమేనండీ మనం పిలవకున్నా మరు నిమిషం ఉంటుంది. తన పని అది చేసుకుపోతూ ఉంటుంది కూడా.. ఈ మధ్య మరీ నల్ల పూసైపోతున్నారేంటండీ? ధన్యవాదాలు మీ స్పందనకి..

  ReplyDelete
 18. @ తెలుగు వారి బ్లాగులు
  తెలుగు వారి బ్లాగులు.. మీరు అడగాలాండీ? నా బ్లాగు మీ బ్లాగుల సముదాయంలో జతచేయడం నాకెంతో ఆనందకరం. మీక్కూడా దీపావళి శుభాకాంక్షలు :)


  @ ధాత్రి
  ధాత్రి గారూ మీరు నా బ్లాగును సందర్శించడం చాలా ఆనందంగా ఉందండీ.. మీ స్పందనకి వేవేల వందనాలు ;)


  @ కెక్యూబ్ వర్మ
  వర్మ గారూ ధన్యవాదాలండీ..


  @ డేవిడ్
  డేవిడ్ గారూ నా కవిత లోని భావం సంగతి ఎలా ఉన్నా మీ భావన అద్భుతం అండీ.. నువ్వున్నది నా ఊహల్లో కాదు నా ప్రాణంలో.. చాలా బాగుంది. ధన్యవాదాలండీ మీ చక్కని వ్యాఖ్యకి.

  ReplyDelete
 19. బాగా రాశారండి,..మంచి ఫీల్ తో....

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు భాస్కర్ గారూ..

   Delete
 20. Replies
  1. మధుర గారూ అంత పెద్ద నిట్టూర్పు విడిచారేంటండీ :(

   Delete
  2. భావం అంత భారంగా ఉంది కదండీ మరి.. మీరంత బాగా రాసారన్నమాట.. :)

   Delete
 21. కనులకు మాత్రమే
  కనిపించే ప్రపంచము అంటే
  నీతోనే నా లోకము అనుకున్నాను.,
  కానీ ఇంతలోనే...
  నాకందనంత దూరానికి నువ్వెళ్ళిపోయావు
  నన్ను ఒంటరిగా వదిలి
  నీ దారి నువ్వు చూసుకున్నావు.,  గుండెను పిండేశారండి?????
  హార్ట్ టచింగ్ లైన్స్ రీయల్లి సూపర్బ్ ...

  ReplyDelete
  Replies
  1. గిరి గారూ థాంక్యూ సో మచ్ మీ స్పందనకి :)

   Delete
 22. late ga chusanu andaru cheppesaru ainaa kkudaa cheppaali enta baagaa raasaro chalaaaaaaa baavundi

  ReplyDelete
  Replies
  1. పర్వాలేదు మంజు గారూ ఎప్పుడు చూసినా. ధన్యవాదాలు మీకు నచ్చినందుకు.

   Delete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !