Search This Blog

Friday, November 2, 2012

గుండె గూడు మూగబోయి...



  


గుండె గూడు మూగబోయి
గుబులుకొన్న చీకటిలోన
దారి చూపు దీపము నీవే
అడియాశల జీవితాన
అడుగడుగున నువ్వే నేస్తమా!
చిగురించిన ఆశవు స్నేహమా!

తూరుపు తెలవారుతున్నా
మనసుకేది వేకువ అంటూ
విడిచిన ఆ నిట్టూర్పులలో
జాలువారు కన్నీటిలో
కుసుమించిన కిరణమై నేస్తమా!
ఓదార్పువు నువ్వే స్నేహమా!

చినబోయిన పెదవులపైన
చిన్ని నవ్వు చూడాలని
ప్రతి పువ్వును కుశలమడుగుతూ
కమ్మని ఆ మధువులు తెచ్చి
తేనె చినుకు నువ్వై నేస్తమా!
పలకరించు నవ్వువు స్నేహమా!

గుండె గూడు మూగబోయి
గుబులుకొన్న చీకటిలోన
దారి చూపు దీపము నీవే
అడియాశల జీవితాన
అడుగడుగున నువ్వే నేస్తమా!
చిగురించిన ఆశవు స్నేహమా!

26 comments:

  1. ఈ పాట ఎక్కడిది అండి.. మీరే పాడరా? ఎప్పుడు వినలేదు చాలా బాగుంది.. మంచి పాటను వినిపించారు ధన్యవాదములు

    ReplyDelete
  2. "అడియాశల జీవితాన
    అడుగడుగున నువ్వే నేస్తమా!"
    నేస్తం గురించి మీ పాట,కవిత రెండూ బాగున్నాయండీ..

    ReplyDelete
  3. ఎంతో గొప్ప స్నేహం గురించి చాలా బాగా చెప్పారు సుభ గారు. మీ గొంతు చాలా బాగుంది.

    ReplyDelete
  4. చాలా బాగా పాడారండి, ఎలా రికార్డ్ చేస్తున్నారు,

    ReplyDelete
  5. శ్రావ్యమైన మీ గొంతులో పాట వింటూ చరణాలను చదువుతూంటే స్నేహం కన్నా మిన్నఐనది లోకాన లేదని మరో మారు తెలియ వచ్చింది.. సుభగారూ అభినందనలు....

    ReplyDelete
  6. @ ♛ ప్రిన్స్ ♛
    ప్రిన్స్ గారూ మీ స్పందనకి ధన్యవాదాలు. పాట ఎక్కడా వినే అవకాశం లేదండి :)

    @ రాజి
    రాజీ గారూ ధన్యవాదాలండీ.. పాట పాడి కింద లిరిక్స్ కూడా పెట్టా అంతే అండీ.. రెండూ ఒకటే.

    @జయ
    జయ గారూ మీ కాంప్లిమెంట్ కి బోలెడు ధన్యవాదాలు.

    ReplyDelete
  7. @ the tree
    భాస్కర్ గారూ ధన్యవాదాలండీ.. అది SOUND FORGE అని Software లో రికార్డ్ చేస్తానండీ.. మీకు తెలిసే ఉంటుంది బహుశా.

    @ కెక్యూబ్ వర్మ
    వర్మ గారూ ధన్యవాదాలండీ మీ అమూల్యమైన స్పందనకి మరియు ప్రశంసకి.

    ReplyDelete
  8. గుండెగూడు మూగపోయినా దాన్ని తెరిపించే స్వరము మీది మరి మీ స్నేహము ఎలా ఉంటుందో ఊహించగలనండి

    ReplyDelete
  9. chala baagundi pata...chakkani gontu meedi...

    windows movie maker loki velli meeku kaavaalsina chitaalato
    edit chesukondi...inkaa baaguntundi mee presentation...

    http://windows.microsoft.com/en-IN/windows7/products/features/movie-maker...
    abhinandanalu meeku...@sri

    ReplyDelete
  10. సుభగారు.. మంచి సాహిత్యం, అంతకుమించిన శ్రావ్యమైన మీ గొంతు.. నిజంగా రెండూ సూపర్బ్...

    మీకో విషయం చెప్పనా... మీరు పాడుతుంటే నా గొంతునే వింటున్న ఫీలింగ్ కలిగింది. అచ్చం మీ గొంతులాగే ఉంటుంది నేను పాడినా.. పాట వినగానే ఒక్కసారిగా షాక్.. నేను కాదు కదా పాడింది అని..

    అయినా నేను పాటలో ఏ రెండు మూడు లైన్స్ మాత్రమే పాడగలను.. మీలా మొత్తం పాటను పాడలేను... :)

    చాలా చాలా బాగా పాడారు.. క్లాప్స్ క్లాప్స్... :)

    ReplyDelete
  11. మీ స్వరం , పదం, స్నేహం అన్నీ బాగున్నాయండి.

    ReplyDelete
  12. మీరు పాడిన పాట అయితే simply superb!
    చాలా బాగుంది మీ గొంతు.
    పాట, లిరిక్స్ కూడా బాగున్నాయి

    ReplyDelete
  13. @ kalyan
    కళ్యాణ్ గారూ మీ ఆత్మీయ స్పందనకి ధన్యవాదాలండీ..

    @ శ్రీ
    శ్రీ గారూ చాలా థ్యాంక్స్ అండీ.. ఇది యూ ట్యూబ్ లో కూడా పెడుతున్నాను. అక్కడ మరి మన సొంత చిత్రాలైతేనే మంచిదని నెట్ లో ఉన్న చిత్రాలని వాడుకోకూడదని పెట్టలేదండి.. తరువాతి ప్రెసెంటేషన్ లో మీ సలహానీ తప్పకుండా పాటిస్తాను. మీ స్నేహ పూర్వకమైన సలహాకు హృదయపూర్వక కృతజ్ఞతలండీ.. మరొక్కసారి మీ ప్రశంసకు ధన్యవాదాలు.

    @ ♛ ప్రిన్స్ ♛
    ప్రిన్స్ గారూ మళ్ళీ వచ్చి కామెంటినందుకు మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు మీకు.
    సింగర్ ఆ? మరీ అంత పెద్ద మాటొద్దులెండి. ఏదో పాడతాను అంతే.

    ReplyDelete
  14. @ శోభ
    శోభ గారూ అవునా? ఐతే సేం పించ్ అండీ :)... మాక్కూడా వినిపించొచ్చు కదా మీ గొంతు ఒకసారి.. ప్లీజ్ ప్లీజ్ :) అబ్బా..ఐనా ఎంత గట్టిగా కొట్టారండీ చప్పట్లు.. చేతులు నొప్పి పుట్టాయ్ కదా బాగా :) మీరంతలా మెచ్చినందుకు బోలెడు ధన్యవాదాలు మీకు :)

    @ సృజన
    సృజన గారూ బ్లాగుకు స్వాగతం అండీ.. మెచ్చినందుకు థాంకులండీ..

    @ జలతారువెన్నెల
    జలతారు వెన్నెల గారూ థాంక్ యూ సో మచ్ అండీ..

    ReplyDelete
  15. బాగుందోయ్! బాగుంది. చప్పట్లోయ్ చప్పట్లు.

    ReplyDelete
  16. సుభా చాలా రోజుల తరువాత చక్కని పాటతో వచ్చావు. పాట, పాడిన స్వరం కూడా చాలా బావున్నాయి. పక్కన వాయిద్యాల హడావిడి లేకు౦డా స్వచ్ఛంగా హాయిగా వుందీ పాట.

    ReplyDelete
  17. @ kastephale
    తాత గారూ మీ చప్పట్లకి నా చప్పట్లు.. బోలెడు ధన్యవాదాలు మీ స్పందనకి.

    @ జ్యోతిర్మయి
    జ్యోతిర్మయి గారూ మీ ప్రోత్సాహానికి కోటి కోటి కృతజ్ఞతలు. మీ ప్రోత్సాహమే ఇంకా ఇంకా ప్రయత్నాలు చేసేలా చేస్తుంది. మరొక్కసారి ధన్యవాదాలు మీకు.

    ReplyDelete
  18. మీ గొంతా? అద్భుతంగా ఉన్నది. Keep singing and sharing.

    ReplyDelete
    Replies
    1. Narayanaswamy S.(కొత్తపాళి) సార్ నమస్తే ! మీ ప్రశంస ని అందుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉందండీ.. మీ ప్రోత్సాహానికి చాలా థ్యాంక్స్ సార్.

      Delete
  19. సుభ గారు మీరు చాలా బాగా రాసారు,పాడారు.. బాగుంది మీ వాయిస్

    ReplyDelete
    Replies
    1. డేవిడ్ గారూ బోలెడు ధన్యవాదాలండీ మీ వ్యాఖ్యకి.

      Delete
  20. అద్భుతం!
    సాహిత్యమే కాదు, మీ వాయిస్ కుడా చాలా బాగుంది.
    మరిన్ని పాటలు తీసుకరండి. :)

    ReplyDelete
  21. హర్ష గారూ చాలా చాలా ధన్యవాదాలు మీ ప్రశంసకి :)

    ReplyDelete
  22. మీ గాత్రం, గేయ రచన చాలా బాగుంది.

    ReplyDelete
  23. ఆ ముందు పాట కంటే ఈ పాట రికార్డింగ్ క్వాలిటీ ఇంకా స్పష్టంగా ఉందండీ. చక్కటి గాత్రం మీది. పాడుతూ ఉండండి. మాకు వినిపిస్తూ ఉండండి. అభినందనలు. :)

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !