Search This Blog

Friday, October 5, 2012

నీ కౌగిలిలో...!

నేను గుర్తున్నానా నేస్తం?
అడిగాను అలవోకగా.,
ఒక నవ్వు విరబూసింది
తన పెదవులపై జవాబుగా.,
కోపం వచ్చింది నాకు భలేగా
ఐనా నన్నెందుకు గుర్తుపెట్టుకుంటావులే
అనేసాను నిష్ఠూరంగా.,
బదులుగా నా వైపు ఒక చూపు జాలిగా.,
కరిగానా? ఊహూ!
నా భావాలేం కనిపించకుండా మోము దాచేసానుగా.,
ఇదంతా నన్ను ఆట పట్టించడానికే అని 
మరి నాకు ముందే తెలుసుగా.,
అందుకే ఏమౌతుందా అని చూస్తున్నా ఆశక్తిగా.,
దాచిన ఆ మోమును చేతిలోకి తీసుకొని
నా కళ్ళలోకి చూస్తుంటే.,
తన కళ్ళేదో చెప్తున్నట్టే అనిపిస్తోంది మూగగా.,
చినుకు లేకుంటే 
మేఘం తనని మరిచిందని కాదుగా

పలికాయి తన పెదవులు ఆర్తిగా.,
వింటున్న మనసుకు ఏదో ఇదిగా
తన కౌగిలిలో ఒదిగిపోయాను హాయిగా..!  

18 comments:

  1. చినుకు లేకుంటే మేఘం మరిచిందని కాదు ...
    ఆప్తుల హృదయాల్లో మనం ఎప్పుడూ ఉంటాము...
    కలల పందిరి పై విరిసే జాజి పూవుల్లా ...
    చక్కగా వ్రాశావు శుభా

    ReplyDelete
  2. తీయ తీయగా హాయి హాయిగా
    బావుంది సరదా సరదాగా...

    ReplyDelete
  3. సుభ గారూ,
    మళ్ళీ మళ్ళీ చదివామీ కవిత. ఎంతో సరళంగా చివరి లైన్ కి చేరిన ప్రతి సారీ మదికేదో తెలియని హాయి అనిపించింది. మరలా మొదటి లైన్ కి వెళ్ళటం, చదవటం...మళ్ళీ అదే భావన చివరికి.
    చాలా బాగుంది.
    బొమ్మలో సన్నని గీతలతో ఆ ఇద్దరి కళ్ళల్లోనూ అదే భావాన్ని చక్కగా చిత్రించారు.

    ReplyDelete
  4. చక్కటి చిత్రం అంతే చక్కటి కవిత చాల బాగుందండి

    ReplyDelete
  5. మీ కవిత, అందలి భావం చాలా బాగున్నాయండీ! సరళ పదజాలంతో చెప్పాలనుకున్నది సూటిగా చేరింది.
    ఇంతకీ కోపంలో ఆ అబ్బాయి ముక్కుని ఏ అప్పడాల కర్రతోనన్నా కొట్టేసిందా ఏంటి ఆ అమ్మాయి ;)

    ReplyDelete
  6. సుభ గారూ..
    చాలా బాగుంది..మీ కవిత.

    ReplyDelete
  7. @ శశి కళ
    శశి గారూ ధన్యవాదాలు. మీ భావన చాలా బాగుంది కలల పందిరిపై విరిసే జాజిపువ్వుల్లా.. చాలా బాగుంది.

    @జ్యోతిర్మయి
    జ్యోతి గారూ ధన్యవాదాలండీ :)

    @ VENKATA RAMANA
    రమణ గారూ బ్లాగుకి స్వాగతం అండీ.ధన్యవాదాలండీ స్పందనకి.

    @ samson
    Sam Thank You Sooo Much.

    ReplyDelete
  8. @ చిన్ని ఆశ
    పండు గారూ.. అన్ని సార్లు చదివించిందంటే నా కవిత కొంచెం ఆలోచించాల్సిందేనండీ ;) మీ చిట్టి గుర్తొచ్చే ఉంటుంది.. కదండీ.. ఐనా మర్చిపోతే కదా అంటారేమో మళ్ళీ?:) మీ స్పందనకి బోలెడు ధన్యవాదాలండీ.. ఏంటో మీరు కామెంట్ పెడితే నాకు బోలెడు ఉత్సాహం :)


    @ skvramesh

    రమేష్ గారూ బ్లాగుకి స్వాగతం అండీ.. ధన్యవాదాలు మీ ప్రశంస కి.


    @రసజ్ఞ
    హహహ రసజ్ఞ గారూ ఎక్కడున్నారండీ? అర్జెంటుగా మీకో సాష్టాంగ నమస్కారం చేస్కోవాలి ;)... ఇక నుంచైనా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని గీస్తాలెండి నా గీతలు. మరీ అంత నిశితంగా చూస్తే నా లాంటి అల్ప ప్రాణులు ఏమైపోవాలండీ అసలు. భయపెట్టేస్తున్నారు మరీను:) ఏదేమైనా మీరిలానే నన్ను భయపెడుతూ ఉండాలని కోరుకుంటున్నా :) ధన్యవాదాలండీ ఒక చక్కని వ్యాఖ్యకి, ఒక చక్కని ఛలోక్తికి :)


    @ రాజి
    రాజీ గారూ బాగున్నారా? నేనే సరిగ్గా చూడట్లేదేమో బ్లాగులు అనుకున్నాను. మీరు కూడా అసలు రావట్లేదేంటండీ? బాగా బిజీ ఐపోయారు :) ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి.

    ReplyDelete
  9. chaalaa baagundi subha gaaroo!...
    @sri

    ReplyDelete
  10. కవిత చాలా బాదుంది సుభ గారు!

    ReplyDelete
  11. కూర్పులు చేర్పులు అక్షరాలకు చేయచ్చు అని విన్నాను...కూడికలు తీసివేతలు లెఖల్లో విన్నాను.. చక్కలను రాళ్ళను అయితే చెక్కుతారు అని విన్నాను...మేరెంటండి అన్నిటిని కలిపి భావంపైన ప్రయోగించారు...అది భావమా లేక ఇకేమైనా సరికొత్త ప్రకృతి పదార్థమా.. కాస్త దయుంచి ఆ పదార్థం పేరు చెప్పండి సుభ గారు మేము ఎలా చేయాలో నేర్చుకుంటాం ...

    ReplyDelete
  12. చాలాచక్కగా సూటిగా రాసారు.

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !