Search This Blog

Thursday, September 20, 2012

నాలోన దాగుంది నువ్వేనని..

23 comments:

  1. మాటలు రాలిన బ్లాగ్ నేలపై తేనెల జల్లు కురిపించారు తొలిసారిగా మీ ప్రయత్నం ఇలానే కొనసాగించాలని నా అభిమతం ఇక పాట విషయానికొస్తే అవును మీరే పాడారా లేక గాయకురాలిచే పాడించారా ;) సందేహానికి మన్నించాలి . మొత్తానికి యువత హృదయాన్ని ప్రేమ మందిరంగా మార్చే ప్రయత్నం చాలా బాగుందండి సుభ గారు .

    ReplyDelete
  2. చక్కగా వుందండి, పాట..., మంచి ప్రయత్నం, దేనిలో రికార్డ్ చేశారండి, క్వాలిటి బావుంది.

    ReplyDelete
  3. మొదటి ప్రయత్నమే చాలా బాగుందమ్మాయ్.

    ReplyDelete
  4. భావాలను పాటలా వినిపించడం..అస్సలు ఊహించలేదు సుమా. నీ ప్రయత్నం చాలా బావుంది. ఇలాంటి మరెన్నో పాటలకోసం ఎదురుచూస్తూ ఉంటాము.

    ReplyDelete
  5. చాలా బాగుందండి :).........very sweet voice

    ReplyDelete
  6. @ kalyan
    కళ్యాణ్ గారూ మీరేనా? ఎన్నాళ్ళకి దర్శనాలు మళ్ళీ. ఏమటండీ అంత పెద్ద సందేహం వచ్చింది. ఆ పాటకి అన్నీ నేనే అండీ.. అంటే గానమే కాదు అని. ఏదేమైనా మీ అమూల్యమైన స్పందనకు బోలెడు ధన్యవాదాలు.

    @ the tree
    భాస్కర్ గారూ నా పాటని, ప్రయత్నాన్ని మెచ్చినందుకు ధన్యవాదాలండీ..

    @ kastephale
    తాతగారూ ధన్యవాదాలండీ..

    @ శశి కళ
    శశి గారూ బోలెడు ధన్యవాదాలు..

    ReplyDelete
  7. @ జ్యోతిర్మయి
    జ్యోతిర్మయి గారూ అప్పుడప్పుడూ నేను కూడా ఊహించనివి కొన్ని జరిగిపోతూ ఉంటాయి. అందులో ఇది ఒకటి. మీ ఎదురుచూపులు ఫలించాలని ఆశీర్వదించండి చాలు. ఇంకా ప్రయత్నిస్తాను. మీ ముచ్చటైన వ్యాఖ్యకి ధన్యవాదాలండీ..

    @ Padmarpita
    పద్మార్పిత గారూ నిజంగానా? బోలెడు థాంకులు మీకు.

    @ వనజవనమాలి
    వనజ గారూ ముత్యమే? అబ్బా! మీ కామెంటే ముత్యమండీ.. ధన్యవాదాలు మీకు.

    @ Kaavya anjali
    కావ్య గారూ ముందుగా నా బ్లాగుకి స్వాగతం అండీ.. మీ ప్రశంస కి చాలా థాంకులండీ.

    ReplyDelete
  8. సుభ గారూ!
    బాగుంది పాట...
    చక్కని భావాలు...
    అభినందనలు...
    @శ్రీ

    ReplyDelete
  9. aalasyanagaa choosaanu baagundi medam

    ReplyDelete
  10. మొదటి సారిగా నిన్న మీ బ్లాగు చూసి కామెంట్ వ్రాద్దా మనుకున్నంతలో చిన్న పనితో ఆటంకం.ఈ రోజు మీ స్వరం తో కూడిన పాట వినటం .భలే ప్రయోగ మండి.మీ స్వరం,భావం రెండు బావున్నాయి.మరిన్ని పాటలు మీ స్వరం లో వినాలని....

    ReplyDelete
  11. @ శ్రీ
    శ్రీ గారూ ధన్యవాదాలండీ..

    @ Meraj Fathima
    మెరాజ్ గారూ పర్వాలేదండీ ఆలస్యంగా చూసినా.. ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి.

    @ oddula ravisekhar
    రవి శేఖర్ గారూ మీ చక్కని స్పందనకి ధన్యవాదాలండీ..

    ReplyDelete
  12. సుభ గారూ,
    ఆశ్చర్యం, మీరింత శ్రావ్యంగా పాడతారా? కవితలు, భావాలు, బొమ్మలే కాదు, ఇప్పుడు పాటలూ...హ హా హా...మల్టి టాలెంటెడ్ అన్న మాట...చాలా చాలా చాలా బాగా పాడారు. మీ స్వరం బాగుంది, పాడిన పాటా ఎంతో బాగుంది. మ్యూజిక్ లేకనే ఎంతో గొప్పగా పాడారు. పూర్తిగా విన్నాము. మొదట్లో ఏదో సినిమా పాట లింక్ ఏమో అనుకున్నాం...మొదలవగానే అర్ధం అయిపోయింది, మీరే పాడుంటారని.
    అభినందనలు. మరిన్ని శ్రావ్యాలు వినాలని కోరుకుంటూ...
    మీ మొదటి పాటకి బొమ్మ కూడా వేసి పెట్టుంటే ఇంకా బాగుండేది...ఈ సారి వెయ్యండి.
    - మీ చిట్టి, పండు.

    ReplyDelete
  13. @ samson
    హాయ్ samson ధన్యవాదాలు..

    @ చిన్ని ఆశ
    అబ్బా చిట్టి, పండు ఇద్దరూ కలిసి వచ్చారే కామెంటడానికి.. ఇక నా సంతోషం మాటల్లో వర్ణించలేనిది. ఎన్ని ప్రశంసలో బాబోయ్..మీరు చెప్పినట్టు ఈ సారి బొమ్మ వేయడానికి తప్పని సరిగా ప్రయత్నిస్తా.. మరొక్కసారి మీ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యకి నా మనః పూర్వక ధన్యవాదాలు.

    ReplyDelete
  14. .సుభ గారు మీ పాట,మీ బ్లాగ్ బాగుందండి..చాలా చక్కగా పాడారు

    ReplyDelete
  15. రాధిక గారూ నా బ్లాగుకి స్వాగతం అండీ.. ధన్యవాదాలు మీ ఆత్మీయమైన స్పందనకి..

    ReplyDelete
  16. రెండో చరణంలో ఆ నవ్వు బాగా కుదిరింది, పాట చాలా బాగుందండీ! త్వరగా మీ మిగతా పాటలను కూడా పెట్టండి ...... వెయిటింగ్ ఇక్కడ...

    @చిన్ని ఆశ గారూ,
    బొమ్మ కూడా వేసి పెడితే మీరు బొమ్మనే చూస్తూ పాట వినరేమో అని పెట్టలేదేమో అండీ ;)

    ReplyDelete
  17. రసజ్ఞ గారూ చాలా రోజుల తర్వాత కనిపించారండీ... మీరు మెచ్చుకున్నారంటే నా పాట నిజంగా బాగున్నట్టే.. ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి. తప్పకుండా నా తర్వాత పాటలను కూడా పెడతాను.
    పాపం చిన్ని ఆశ గారికి పంచ్ లు ఎక్కువేసేస్తున్నారేంటండీ బాబూ ;). ఇక్కడ పండు గారి ఫేన్స్ అసోసియేషన్ ఉంది. ఆయన్నేమన్నా అనేముందు కాస్త ఆలోచించండోయ్ ;)

    ReplyDelete
  18. @ సుభ గారూ,
    ఇన్నాళ్ళకి కుదిరిందండీ తీరిగ్గా కూర్చుని మీ పాటలు వినడానికి.. మీ గొంతు చాలా బాగుంది. భలే చక్కగా పాడారు. ఇంతకీ పాట రాసింది కూడా మీరేనా?

    ReplyDelete
    Replies
    1. మధుర గారూ తీరిక చేసుకునీ మరీ పాట విన్నందుకు ముందుగా బోలెడు థాంకులు. ఇంకా నేనేమో ఫుల్లు హ్యాపీసూ:) ( అంత బిజీ బిజీ గా ఉండి కూడా ప్రత్యేకంగా కామెంటారంటే మరి ఆ మాత్రం ఉండదా అండీ నాకు ). పాట రాసేది కూడా నేనేనండీ.. రెండు పాటలూ విని మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేసినందుకూ,మీ స్పందనకీ చాలా చాలా ధన్యవాదాలండీ..

      Delete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !