Search This Blog

Friday, September 7, 2012

ఆ పువ్వుల వరమిస్తావా!!


ఎందుకూ తనని ముని పంటితో 
అదిమి పట్టి ఉంచుతావు
తనని చూడాలని ఈ మనసుకు
ఎంత తపనో తెలుసా.,
తనని వదిలితే ఎందరి మనసుల్ని
మురిపించేస్తుందో అని నీ భయం కాబోలు.,
అందర్ని మురిపించడం సరే..,
తనతో పాటుగా ఎప్పుడైనా 
నిన్ను నువ్వు చూసుకున్నావా
అలా చూసి ఉంటే., 
యధేఛ్ఛగా తనని వదిలేసేవాడివేమో
కానీ నువ్వా అవకాశమే ఇవ్వవు.,
నీ పెదాలపై విరబూయాలని తను
ఆ పువ్వులన్నీ ఏరుకుని హారాలల్లుదామని నేను
మా ఈ ఎదురు చుపులకు 
అలుపు లేకుండా పోతోంది తెలుసా!
ఇలా తనను, నన్ను 
వేధించడం నీకేమన్నా భావ్యమా చెప్పు.,
నీ నుంచి నేనేమీ కోరుకోను
నువ్విచ్చే ఆ చిరు చిరు పువ్వుల్ని తప్ప.,
ఏం నేస్తం! ఇస్తావు కదూ ఈ చిన్ని కానుకను
నింపుతావు కదూ ఆ పువ్వులతో నా గుండె దోసిళ్ళను..! 

23 comments:

  1. :-):-):-)ఈ నవ్వులకోసమే అని అనకండేం ....
    కవిత బాగుందండి.

    ReplyDelete
  2. చిరునవ్వు, పెదవి దాటి రానివ్వు :)

    ReplyDelete
  3. చిరునవ్వుల పువ్వుల వరమన్నమాట...
    బాగుందండీ కవిత

    ReplyDelete
  4. మేడం గారూ,ఓ చిరునవ్వుకోసం ఎదురుచూపు బాగుంది.

    ReplyDelete
  5. మనసు కోరే ఆ చిన్ని కానుక చాలు నిజంగానే గుండె దోసిళ్ళు నిండటానికి...
    చక్కగా రాశారు. బొమ్మ లోనూ నవ్వులూ, మేఘ మాలికలూ విరిశాయి.

    ReplyDelete
  6. @ Padmarpita
    పద్మ గారూ మరేమనమంటారో మీరే చెప్పేద్దురూ కాస్త. ధన్యవాదాలండీ మీ చిరు చిరు నవ్వులకి.

    @ kastephale
    తాత గారూ నాకు తోడుగా మీరు కూడా బ్రతిమలాడుతున్నందుకు ధన్యవాదాలండీ..

    @ రాజి
    రాజీ గారూ అంతే కదండీ.. ధన్యవాదాలు

    ReplyDelete
  7. @ నాని
    నానీ గారూ బోలెడు ధన్యవాదాలండీ.

    @ meraj fathima
    మెరాజ్ గారూ మేడం ఎందుకులెండి.. మామూలుగా పిలవండి చాలు. ధన్యవాదాలండీ మీ స్పందనకి.

    @ చిన్ని ఆశ
    మా చిట్టిపండు గారి ఒక చిన్ని కామెంట్ చాలండీ నా బ్లాగు కళకళలాడ్డానికి. అదే మా చిన్ని ఆశ కూడాను. ధన్యవాదాలండీ.

    ReplyDelete
  8. తీసుకోండి, మీ కోసం ఆ వరం నేనిచ్చేస్తున్నాను :)

    ReplyDelete
  9. madam garu chirrunavvu koasam yeduruchupu bagundi..

    ReplyDelete
  10. bagundadi chirunavvu tho yeduruchupulu...

    ReplyDelete
  11. @ రసజ్ఞ
    హమ్మయ్యా! రసజ్ఞా ఇంకెందుకూ ఎదురుచూడ్డం ఐతే.. ఆ చూపులకి చుక్క పెట్టేస్తున్నాలెండి.. ధన్యవాదాలు.

    @ surya24d
    సుర్యా ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి..

    ReplyDelete
  12. మీ లాంటి చిన్న కోరికలు కోరే మిత్రులు ఎంతమంది వున్నా ఇబ్బంది లేదండి, ఇవిగో తీసుకోండి
    బోలెడు పూలు.... చక్కగా రాశారండి.

    ReplyDelete
    Replies
    1. హాహా :):).. భాస్కర్ గారూ భలే చెప్పారండీ.. బోలెడు ధన్యవాదాలు మీ స్పందనకి.

      Delete
  13. "నిన్ను నువ్వు చూసుకున్నావా" మీ అందమైన కవితకి ఇదే ప్రాణమనుకుంటా..ఈ వాక్యం. ఎప్పటిలా మీ భాకత్వపు అలజడి ఉన్నా సాఫ్ట్ మ్యూజిక్ లా అలరించింది.

    ReplyDelete
    Replies
    1. శ్రీనివాస్ గారూ వావ్ మీ కామెంట్ నాకు భలేగా నచ్చేసిందండీ.. ధన్యవాదాలు మీ స్పందనకి..

      Delete
  14. వినాయకచవితి శుభాకాంక్షలండి,

    ReplyDelete
  15. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

    లాస్య రామకృష్ణ

    బ్లాగ్ లోకం

    ReplyDelete
  16. భాస్కర్ గారూ, లాస్య గారూ ధన్యవాదాలండీ.. మీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.

    ReplyDelete
  17. నీ నుంచి నేనేమీ కోరుకోను
    నువ్విచ్చే ఆ చిరు చిరు పువ్వుల్ని తప్ప.,
    ఏం నేస్తం! ఇస్తావు కదూ ఈ చిన్ని కానుకను
    నింపుతావు కదూ ఆ పువ్వులతో నా గుండె దోసిళ్ళను..!
    మంచి కవితా ప్రయోగం.
    మీ ముందు మాట చాలా బాగుందండి.ఇంత సరదాగా ఇంతవరకు ఎవ్వరు వ్రాయలేదండి.

    ReplyDelete
  18. రవి శేఖర్ గారూ నా బ్లాగుకి స్వాగతమండీ.. ప్రయోగం నచ్చినందుకు మరియు కవిత మెచ్చినందుకు బోలెడు ధన్యవాదాలండీ..

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !