Search This Blog

Saturday, August 4, 2012

తేనెలూరే నవ్వునై..


రెమ్మ రెమ్మకు నేనే రాగాలు చిలికిస్తానని
మెల్ల మెల్లగా వీచే ఆ పిల్ల గాలులకు 
పరిమళ గంధాలు అద్దుతానని
ఝుమ్మను నాదాల కొంటె తుమ్మెదకు
కమ్మని తేనెల వలపునని
మదిలో ఏవేవో ఆలాపనలు సేయుచుండ.,
చటుక్కున కొమ్మల వెనుక దాగిన
నీ మోముని చూసి అచ్చెరువొంద.,
అరవిరిసిన అందాలతో ఆ రెమ్మ నుండి విడివడి 
గుబాళించిన పువ్వునే.,
ఆ ముద్దొచ్చే పెదవులపై 
నీ నవ్వునైపోయా..!!


ఈ నవ్వుల పువ్వులు మీ పెదవులపై ఎప్పుడూ విరబూయాలని కోరుకుంటూ బ్లాగు మిత్రులందరికీ హృదయపూర్వక ఫ్రెండ్ షిప్ డే "సుభా"కాంక్షలు..    

17 comments:

  1. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. "సుభ" గారికీ ఫ్రెండ్ షిప్ డే "శుభా" కాంక్షలు !
    చాలా కాలానికి మళ్ళీ మీ కవితా బొమ్మా రెండూ ముద్దుగుమ్మ పెదవులపై ముద్దుగ విరిసిన పువ్వుల నవ్వులా విరబూశాయి.
    బొమ్మలో పువ్వుల ని పెదవులపైన పూయించిన ముద్దుగుమ్మ అందంగా ఉంది.
    ఏదో రంగుల ప్రయత్నం చేసీ ఆపేసినట్టున్నారు.
    భావం బొమ్మా రెండూ చక్కగా ఉన్నాయి.

    ReplyDelete
  3. బొమ్మ బాగుంది. రంగులేస్తే ఇంకా అమాయకంగా కనపడేదేమో! కవిత బాగుంది.

    ReplyDelete
  4. navvesaam...:) aanamdam to..baagumdamdi..
    HAPPY FRIENDSHIP DAY

    ReplyDelete
  5. మీకు కూడా స్నేహపూర్వక శుభాకాంక్షలు.
    Keep on writing.

    ReplyDelete
  6. మీకు కూడా హృదయపూర్వక స్నేహితుల రోజు శుభాకాంక్షలు..

    ReplyDelete
  7. @ భాస్కర్ గారూ ధన్యవాదాలు.

    @ పండు గారూ మీ మనః పూర్వక అభినందనలకి అభివందనాలు.రంగుల ప్రయత్నం గురించి తర్వాత చెప్తానండీ.ఇలా చెప్పానంటే అందరూ నవ్వుతారు... కాబట్టి మీకు ప్రత్యేకంగా చెప్తాను(చెవిలో) ;)

    @ మంజు గారూ ధన్యవాదాలండీ.

    @ తాతగారూ ధన్యవాదాలండీ.. నేను రంగులు ముట్టుకుంటుంటే ఆ బొమ్మలో అమ్మాయిలు నన్ను కోపంగా చూస్తున్నాయండీ..అందుకే అమాయకత్వం సంగతి అటుంచి వేరే వెళ్ళిపోతోందని ప్రయత్నించట్లేదు.

    ReplyDelete
  8. @ ప్రిన్స్ గారూ ధన్యవాదాలు.. ఏంటండీ బాబూ మీ ప్రొఫైల్ ఏంటో తెలీక ఛస్తున్నా.ఎవరో కొత్తవాళ్ళు అనుకున్నా.. తీరా చూస్తే మా తెలుగు పాటల బ్లాగరే.

    @ సీత గారూ మీ పెదవులపై నవ్వులు పువ్వులు పూయించానన్నమాట.. అబ్బా! బోలెడు సంతోషమైపోయిందండీ..ధన్యవాదాలు.

    @ పద్మార్పిత గారూ ధన్యవాదాలు.. మీ మాట గుర్తుంచుకుంటాను.

    @ రాజీ గారూ ధన్యవాదాలండీ.. బాగున్నారా?

    ReplyDelete
  9. happy friendship day Subhaa gaaru.

    Kommalamaatuna daati bayataki vacchina manasu puvvu...panchina Sneha shubhaakaankshalani andukunnaam.

    Thank you very much!

    ReplyDelete
  10. కవిత చాలా బాగుంది సుభ గారు!

    ReplyDelete
  11. చాలా చాలా బాగుంది...మీ పెదాల పై విరిసిన నవులా ..)))

    ReplyDelete
  12. సుభా గారూ!
    మీకు కూడా స్నేహితుల రోజు శుభాభినందనలు...
    @శ్రీ

    ReplyDelete
  13. @ వనజ గారూ ఎంత అందంగా చెప్పారండీ..నాకు మీ వ్యాఖ్య భలే నచ్చేసింది.ధన్యవాదాలండీ.

    @ నాగేంద్ర గారూ మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ.

    @ శశి గారూ నిజ్జంగా? థాంక్ యూఊఊ ..

    @ శ్రీ గారూ ధన్యవాదాలండీ..

    ReplyDelete
  14. సుభ గారూ నమస్తే..ఇదే మీతో మొదటి ములాఖాత్.నా బ్లాగులో మీ స్పందనచూసి మీ కామెంట్ పట్టుకుని ఇటొచ్చానా నిజమె! మీరన్నట్టు ఓ సముద్రాన్ని చూశాను.ఈత రాకపోవటం కొంచెం కష్టమయింది అన్నీ చదవటానికి.వీలైనన్ని చదివాను. అప్పుడే అర్ధమయింది ఎన్ని మంచి కవితలు మిస్సయ్యానా ఇన్నాళ్ళూ అని.."ఆ ముద్దొచ్చే పెదవులపై
    నీ నవ్వునైపోయా..!!" నాకు నచ్చిన లైన్లూ ముగింపూ కూడా!అభినందనలు. కొంచెమ్ ఆలస్యమైనా అందుకోండీ స్నేహ "సుభా"భినందనలు.

    ReplyDelete
  15. "ఆ ముద్దొచ్చే పెదవులపై
    నీ నవ్వునైపోయా..!!" నాకు నచ్చిన లైన్స్. నాబ్లాగులో మీ స్పందనచూసి ఆ కామెంట్ పట్టుకుని అలానే ఇక్కడికొచ్చానా అప్పుడె అర్ధమయింది నేను పుస్తకాల్లో చదవని సముద్రమేదో ఉందని. అయితే ఈత రానికారణంగా అన్నీ ఈదలేపోయాను కానీ కొన్ని చదివానండీ.అప్పుడే అర్ధమైంది ఇన్నాళ్ళూ ఎంత మిస్సయ్యానని..చాలా భావుకత్వం ఉంది మీ రచనల్లో. ఇంకా చదవాలి వీలువెంబడి. అభినందనలు

    ReplyDelete
  16. శ్రీనివాస్ గారూ నమస్తే అండీ..మీక్కూడా నా బ్లాగుకు సుస్వాగతం..ఈత రాకపోయినా కాసేపు ఆ అలలతోనే ఆడుకున్నందుకు బోలెడు ధన్యవాదాలు మీకు.మీ అమూల్యమైన స్పందనకి మనసు ఎంతో మురిసింది.మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు మీకు.

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !