Search This Blog

Friday, July 20, 2012

పిట్ట కొంచెం


అన్నీ ఆలోచింపచేసే టపాలే.అసలు తను స్పృశించని అంశం అంటూ ఉండదు నన్ను అడిగితే. ఎంతో చక్కని శైలితో వ్రాసే తన వ్యాసాలను కానీ మరే అంశాలని కానీ ఇంకొకరి వ్రాతలతో పోల్చి చూడలేం. అంత అందంగా అల్లుకుపోతూ ఉంటుంది ఆమె అక్షరాలతో.  "వన్నె చిన్నెల కాశ్మీరం" నుంచి మొన్నటి "గుర్తుకొస్తున్నాయి" టపా వరకూ అన్నీ అలాంటి టపాలే..
ఈ పాటికి మీకు అర్ధమయ్యే ఉంటుంది నేను ఎవరి గురించి  చెబుతున్నానో..ఆ అమ్మాయి గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోండి..
తనే నవరసజ్ఞభరితం బ్లాగరు రసజ్ఞ.తన పుట్టిన రోజు ఈ రోజు.
ఇప్పటికే తాత గారు (కష్టేఫలే శర్మ గారు)ఆయన బ్లాగులో వేద వచనాలతో తనకి బోలెడు ఆశీస్సులు అందించారనుకోండి.అది తెలుగు తిథుల ప్రకారం అని చెప్పారు. ఇంగ్లీషు కాలెండరు ప్రకారం ఐతే ఈ రోజు అంటే 20వ తారీకున.
ఇక టైటిల్ పిట్ట కొంచెం అని ఎందుకు పెట్టానా అనుకుంటున్నారు కదండీ..చిన్నదైనా అన్ని విషయాలను అలా అలవోకగా చర్చిస్తుంది మరి అందుకే నాకు అలా అనిపించింది.పిట్ట కొంచెమైనా కూత ఘనం అని.. ఘనం కాదేమో ఘనం స్క్వేర్ అనాలేమో మరి మీరు కూడా కొంచెం సాయం చేద్దురూ ఈ మాటకి.



హృదయపూర్వక జన్మదిన "సుభా"కాంక్షలు రసజ్ఞ.

20 comments:

  1. Happy birth day to RASAGNA

    ReplyDelete
  2. హ హా భలే హెడింగ్ పెట్టారండీ సరిగ్గా రసజ్ఞ గారికి కి సరిపోయే సామెత...
    మా "చిన్ని ఆశ" తరపున ఘనంగా "పుట్టిన రోజు శుభాకాంక్షలు"
    ముందే తెలిస్తే మంచి బొమ్మ వేసి ఇద్దుము ;)

    ReplyDelete
  3. .పిట్ట కొంచెమైనా కూత ఘనం
    happy birthday rasagna.

    ReplyDelete
  4. రసజ్ఞ .. పుట్టిన రోజు శుభాకాంక్షలు.
    మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆత్మీయ ఆనందకర మైన పుట్టినరోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలి.
    శ్రీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు! సుపుత్రా,సుపుత్రికా ప్రాప్తిరస్తు!!

    ReplyDelete
  5. సుభా గారు.. ఇన్నాళ్ళకి ఇన్నాళ్ళకి.. వచ్చారు! బాగున్నారా? మీ చిత్రాలు చూడక దిగులు అండీ!రోజూ వచ్చేయండి. !!

    ReplyDelete
  6. రసజ్ఞకు జన్మదిన సుభాకాంక్షలు...నిండు నూరేళ్ళు చల్లగా ఉండమ్మా..

    ReplyDelete
  7. సుభా.. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు కుశలమా..

    ReplyDelete
  8. కామెంటిడిన అందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు.

    ReplyDelete
  9. @ పండు గారూ ఇప్పుడు మాత్రం ఏమయ్యిందండీ.. వేసి ఇవ్వొచ్చు కదా!

    @ వనజ గారూ మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలండీ..

    @ జ్యోతి గారూ కుశలమే అండీ.. మీరు ఎలా ఉన్నారు?

    @ the tree గారూ నా బ్లాగుకు స్వాగతం అండీ..

    ReplyDelete
  10. హ హా...తప్పకుండా అండీ, తనకెలాంటి బొమ్మలు ఇష్టమో అడిగి కనుక్కునుని...
    మీరూ రాసీ గీసీ చాలా రోజులయినట్టుంది.

    ReplyDelete
  11. చాలా కాలానికి మళ్ళీ ఎంట్రీ అదీ పిట్ట అంటే ఏ పక్షుల బొమ్మలో వేసుంటారు అనుకున్నా.... :) హమ్మో హమ్మో నన్నే? థాంక్యూ సో మచ్. అంతంత పెద్ద మాటలు ఎందుకులే కానీ మీ అభిమానం చాలదా? చాలా చాలా ఆనందంగా ఉంది. మనలో మన మాట మీరు బొమ్మ వేయలేదేమిటండీ? చిన్ని ఆశ గారు వేస్తారని మీరు, మీరు చెప్పలేదని ఆయన ఇద్దరూ నాకు బొమ్మ బాకీ ఉంచేశారు. త్వరగా వేసి ఇచ్చేయండి :)

    @ తాతగారూ ధన్యవాదాలు.
    @ చిన్ని ఆశ గారూ ఏమిటండీ మీరు కూడా? సుభ గారికే సప్పోర్టా? ముందు తెలియకపోతే ఏమీ కానీ ఇంత మంచి ఛాన్స్ వదులుకుంటానా? ఆ బొమ్మేదో గీసి పెట్టుదురూ నా కోసం ఎలాగో వీకెండ్ కదా? ధన్యవాదాలండీ. మీకు బోలెడు థాంక్స్ నాకు బొమ్మ గీసిచ్చాక చెప్తా :)
    @ భాస్కర్ గారూ మీరు కూడానా? చాలా చాలా థాంక్స్ అండీ!
    @ వనజ గారూ అప్పుడేనా? చదువవ్వనీయండి కాస్త. తరువాత మీ ఇష్టం :) మీ ఆశీర్వాద బలం ఇలాగే ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాను. మిక్కిలి ధన్యవాదాలు
    @ జ్యోతిర్మయి గారూ చాలా చాలా థాంక్స్ అండీ!

    శుభాకాంక్షలు చెప్పిన అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు!

    ReplyDelete
  12. Many many happy returns of the day rasgna..

    Puttina roju jejelu chitti paapaayi..

    ReplyDelete
  13. Many many happy returns of the day..
    Puttina roju jejelu chitti paapayi.. Nuvvu ilaage enno puttina rojulu jarupukovaali..

    ReplyDelete
  14. @@ అవును రసజ్ఞ చాలా కాలానికి.. ఈ పిట్టని వల్లో వేస్కుందామని. మళ్ళీ ఇదేమిటండీ బొమ్మ అంటారూ? హమ్మో కష్టమే..మొత్తానికి మీరు ఖుషీ ఐనందుకు మేము ఖుషీ..

    @ పండు గారూ మీరు భలే వారండీ బాబూ..ఆ అమ్మాయి మిమ్మల్ని అడిగితే మీరు నన్ను ఇరికించేస్తున్నారు..మీరు వేసి ఇవ్వండి.. ఇప్పుడు నన్ను పట్టుకుని వదలదు.అప్పుడే చూసారా ఇద్దరికీ కలిపే చెప్పేసారు ఆవిడ, బొమ్మ బాకీ అని. మీకైతే వెన్నతో పెట్టిన విద్య అండీ అది. నాకు అలా కాదే.. వామ్మో నేను జంప్ ఇక్కడి నుంచి.

    @ NageswaraRao V Gokavarapu గారూ నా బ్లాగుకి స్వాగతం అండీ..

    ReplyDelete
    Replies
    1. హ హా... బొమ్మ వేస్తే పడిపోతారు, వెయ్యమంటే జంప్ అయిపోతారు, ఎలాగండీ? ;)
      వచ్చే పుట్టినరోజున బొమ్మ వేసి ఇంకా బాగా చేద్దాం...

      Delete
    2. ఏం చేస్తాం చెప్పండి? అది తప్ప నేనేం చెయ్యలేను పండు గారూ.. మీరెలా అంటే అలానే కానీ చిన్న సవరణ బొమ్మ మీరు వెయ్యండి,పుట్టినరోజు పండుగ నేను చేస్తా ;).. ఇది బాగుంది కదండీ..

      Delete
  15. subha garu ee roje mee blog chusanandi .mee postlanni chaalaa baagunnaayi

    ReplyDelete
  16. విరజాజులు గారు నా బ్లాగుకు స్వాగతం అండీ..ధన్యవాదాలు మీకు నచ్చినందుకు...

    ReplyDelete
  17. సుభ గారూ రసజ్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆలస్యంగా చెప్తున్నందుకు మన్నించండి..మీరు పోస్ట్ లమధ్య యింత ఖాళీ తీసుకుంటున్నారెందుకు? రెగ్యులర్ గా రాయండి..చాలా బాగున్నాయి మీ భావాలు..

    ReplyDelete
    Replies
    1. వర్మ గారూ మీ వ్యాఖ్యకి బోలెడు ధన్యవాదాలు..శుభాకాంక్షలు చెప్పడమే ఎంతో ఆనందం..ఎప్పుడు చెప్పాము అన్నది ప్రశ్నే కాదు..మనలో మనకి మన్నించడాలు ఎందుకండీ?

      Delete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !