మనసే పాడినది
మరులై పూచినది
సుమ గంధాల అందాలు చిలికినది
నీలాకాశపు పందిరి కింద
చక్కని చుక్కల పానుపు పైన
ముసిరే తలపుల మిసమిసలేవో
గుసగుసలాడే కమ్మని వేళ
ప్రకృతి కాంతకు నెచ్చెలి నేనై
విచ్చిన పువ్వుల నవ్వులు నాకై
విరిసే వయసుల మధుమాసంలో
వలపుల జల్లులు కురిసే వేళ
మనసే పాడినది
మరులై పూచినది
సుమ గంధాల అందాలు చిలికినది
నా పాటల్ని ఇష్టపడుతున్న, ప్రోత్సహిస్తున్న బ్లాగ్ మిత్రులకు మరియు పెద్దలకు చిన్న విన్నపము. నాకస్సలు సంగీత జ్ఞానం లేదు. నా మనసులో ఏ రాగం మెదిలితే దానికి అలా పదాలను కూరుస్తూ ఉంటాను. ఇప్పటి వరకు పెట్టిన రాగాలన్నీ చాలా నెమ్మదిగా ఉన్నాయి.. ఇంకా కాస్త మెరుగైన, హుషారైన బాణీలను కూర్చటానికి ప్రయత్నిస్తున్నా. మామూలుగానే నాకు మెలోడీస్ అంటే ఇష్టం.. ఆ కారణంతోనో మరేమో నాకు అన్ని రాగాలు ఇలానే వస్తున్నాయ్. అన్నీ ఒక మూస లోనే ఉన్నాయి అని అనుకోకుండా నన్నింకా ప్రోత్సహిస్తూ ఉంటారని మనఃస్పూర్తిగా ఆశిస్తున్నాను.
**పాటకి ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ పెట్టమని ప్రోత్సహించి, ఆ టైటిల్స్ కూడా తనే వ్రాసి ఇచ్చిన కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూన్నాను...
మనవరాలు పాడుతుందని తెలుసుకాని ఇంత బాగా కవితలల్లి పాడగలదనుకోలేదు :)
ReplyDeleteసుభ గారూ, మీ పాట చాలా శ్రావ్యంగా ఉంది. రాగం నెమ్మదిగా ఉందన్న మాట నిజమే. ఏ కళలో అయినా ప్రతి ఒక్కరికీ ఒక స్టైల్ ఉంటుంది. మీ స్టైల్ మెలోడీ ఏ నేమో అనిపిస్తుంది. మొదలూ, చివరా మీరు తీసే రాగం మీ పాటకు సంగీతంలా ఉంది. సంగీత జ్ఞానం వినే మాకూ లేదు. కానీ విన్నాక కొన్ని నిమిషాలు ఆ రాగం మదిని వెంబడిస్తూనే ఉంది, మీ ప్రతి పాటలోని ప్రత్యేకతా ఇదే!
ReplyDeleteఈ పాటలో మాత్రం "విచ్చిన పువ్వుల నవ్వులు నాకై..." అన్న లైన్ మొదటి సారి ఆలపించినపుడు "నవ్వులు" అన్న పదంలో చిన్న నవ్వూ వినిపించింది. ఇలా పదాల్లో ఎక్స్ప్రెషన్స్ మిక్స్ చేసి పాడితే పాటకి మరింత నిండుదనం వస్తుంది.
చక్కని పదాలను రాగం తో కట్టి, తియ్యని స్వరం తో అల్లిన శ్రావ్యమైన రాగమాలిక మీ పాట.
మీకు మనసారా అభినందనలు!
మనసే పాడినది...మధురముగా ఈవేళ...
మరొక్క మాట...కళ్యాణ్ గారి సబ్ టైటిల్స్, మీ ప్రెజెంటేషన్ రెండూ పాటకి చక్కగా అమరాయి.
ReplyDeleteఅభిరుచి ముఖ్యం. సంగీతం రాకున్నా మనసు
ReplyDeleteరాగం తీసి పాడితే చాలు. ఆనందభైరవి రాగాలు
పరిగెత్తుకుంటూ వస్తాయి. మీరు కంటిన్యూ చేయండి
మేం.. ఇంకా విని తరించాలనుకుంటున్నాం. బాగుంది
శుభ గారు.
టప టప టప... టప టప టప
ReplyDeleteచెమట బోట్లు తాలాలై పడుతుంటే
కరిగి కండనరాలే స్వరాలు కడుతుంటే
పాటా పనితో పాటే పుట్టింది.....పని పాటతోటే జత కట్టింది.......
పద్మ గారు మీ పాట...మీ ప్రయత్నం బాగుంది....కొనసాగించండి....
మంచి పాట,పాడుతూ వుండండి,మేం వింటూ వుంటాం,..అభినందనలు.
ReplyDelete"సుమ గంధాల అందాలు చిలికినది..."
ReplyDeleteఅర్ధవంతంగా పాడారు. తెలుగుపాట అర్ధం అయ్యే రోజలు ఎప్పుడో పోయాయి.
మీ ఈ కడలి లో చిలికిన గాత్రం లో " ముసిరే తలపుల గుస గుసలు .." మరిన్ని వినిపించాలని మనసారా కోరుతూ...
కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ...
అభినందనలతో..........
రచన బాగుంది.(పాట వినే అవకాశం ఇప్పుడు లేదు. ) అభినందనలు సుభాషిణి గారు!!
ReplyDeleteశ్రావ్యంగా ఉందండి..:)
ReplyDeleteసుభ గారూ మంచి ప్రయత్నమండీ..
ReplyDeleteఇంకా కొత్త కొత్త ప్రయోగాలు చేయండి.. తప్పకుండా మాకు నచ్చుతాయి :)
Subha gaaru, kavitha bagundi.. andamaina padaala allika
ReplyDeleteనీలాకాశపు పందిరి కింద
ReplyDeleteచక్కని చుక్కల పానుపు పైన
ముసిరే తలపుల మిసమిసలేవో
గుసగుసలాడే కమ్మని వేళ
నాకూ మా బాగా నచ్చేసిందమ్మా సుభ...మీ గొంతు కూడా..
చాలాబాగుందండి...చక్కని గాత్రం
ReplyDeleteచిక్కని భావాన్ని చక్కగా పాడి మనసు దోచేస్తున్నారుగా:-)
ReplyDeleteబాగుందండీ,
ReplyDeleteనాకు దీనికన్నా ముందు పాట చాలా బాగా నచ్చింది. :)
nice song andi
ReplyDelete@ kastephale
ReplyDeleteహ హ :) తాతగారూ ధన్యవాదాలు.
@ చిన్ని ఆశ
పండు గారూ మీ వివరణాత్మకమైన స్పందనకి చాలా చాలా ధన్యవాదాలు. ప్రతి చిన్న అంశాన్నీ సునిశితంగా పరిశీలించి చెప్తారు. మంచి చిత్రకారులు కదా మీరు ఐనా..అందుకే ఆ పరిశీలన. మొత్తానికి పాట విని మీ మనసు కూడా ఆనందంతో పాడడం నిజంగా సంతోషం. కానీ విభిన్నంగా కూడా ప్రయత్నించాలని అనుకుంటున్నాను. మీ ప్రోత్సాహానికీ, అలాగే పాట ప్రెజెంటేషన్ మెచ్చినందుకు కూడా మరొక్కసారి ధన్యవాదాలండీ.
@ సతీష్ కొత్తూరి
సతీష్ గారూ మంచి మాట చెప్పారు. ధన్యవాదాలండీ మీ ప్రోత్సాహానికి.
@ డేవిడ్
ReplyDeleteడేవిడ్ గారూ బాగుంది మీ టప టప చినుకుల వ్యాఖ్య. ధన్యవాదాలండీ
@ the tree
భాస్కర్ గారూ ధన్యవాదాలు
@ ఛాయ
ఛాయ గారూ, పాట అర్ధవంతంగా ఉందన్నందుకు థాంక్స్ అండీ.. మీ అభినందనలకి ప్రత్యేక అభివాదములు.
@ లక్ష్మీదేవి
లక్ష్మి గారూ పాట కూడా విని ఎలా ఉందో చెప్పండి మరి :) ధన్యవాదాలండీ..
@ ధాత్రి
ReplyDeleteధాత్రి గారూ ధన్యవాదాలండీ.
@ రాజ్యలక్ష్మి
రాజీ గారూ మీ స్నేహపూర్వకమైన ప్రోత్సాహం ఎప్పుడూ మరిచిపోలేనిది. ధన్యవాదాలండీ..
@ Meraj Fathima
మెరాజ్ గారూ ధన్యవాదాలు
@ ఓలమ్మోలమ్మో
ఓలమ్మోలమ్మో గారూ ధన్యాదాలండీ.. మీ ప్రొఫైల్ పేరు భలే ఉందండోయ్ ;)
@ జీవన పయనం - అనికేత్
ReplyDeleteఅనికేత్ గారూ చాలా థాంకులండీ.
@ Padmarpita
పద్మ గారూ నేనా? మనసు దోచేసానా? నిజమే? ధన్యవాదాలండీ మీ స్పందనకి :)
@ Raja
రాజా గారూ ధన్యవాదాలండీ.. ఏ పాట నచ్చినా సంతోషమే నాకు :)
@ చెప్పాలంటే......
మంజు గారూ ధన్యవాదాలండీ..
కమ్మని తెనుగు మాటలు కట్టి , పాడి
ReplyDeleteశ్రోతలకు హాయి గూర్చెడు ' సుభ ' ప్రతిభకు
అచ్చెరువు గల్గె, మనసున హాయి గొల్పె
కళల రెండింటి నెలవు మా ' కడలి ' యౌర !
-----సుజన-సృజన
nice song.. vinasompugaa paadinaaru..
ReplyDeleteశతంజీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి,
ReplyDeleteశతమేన మేన శతాత్మానం భవతి శతమనంతం భవతి,
శతమైశ్వర్యం భవతి,శతమితి శతం దీర్ఘమాయుః,
దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘసుమంగళీ భవ.
తాతగారూ శతకోటి ప్రణామాలు మీ ఆశీర్వచనానికి..
Deleteశుభ గారు!
ReplyDeleteమీకు కుడా పుట్టిన రోజు శుభాకాంక్షలు (కొంచెం ఆలస్యం గా) :)
హా హా.. హర్ష గారూ మెనీ మెనీ థాంక్స్..
ReplyDeleteNice Words - Sweet Voice - Great Work....
ReplyDeleteThank You Mahesh gaaru.
ReplyDelete