Search This Blog

Thursday, November 17, 2022

తలపు-పిలుపు


 

గడిపే ప్రతిక్షణం ఒక యుగమై

కలిసే ప్రతి నిమిషం ఒక వరమై

విరిసే ప్రతి తలపు నీ వశమై

వలచే నా మనసుకు

పిలిచే నీ ప్రేమ తోడై

కంటిపాపలో కలలేవో కలవరిస్తున్న వేళ

నిన్ను చేరుకుంటున్న ఊహలకి

పరవశమేమిటో !?

Monday, November 14, 2022

ఇష్టం


 కష్టం అని కసురుకుంటూ ఉన్నా

ఇష్టం అంటే ఇవ్వడమే ఐతే

నన్ను ఇచ్చుకుంటూనే ఉంటాను

నిన్ను నాలో దాచుకుంటూనే ఉంటాను..!


చీకటి నవ్వు


 

Saturday, November 12, 2022

చీకటి నవ్వు

కాలం లోగిలిలో

తలపుల కౌగిలిలో

మాటని మౌనం పెనవేసి

కళ్ళని కన్నీరు కమ్ముకొని

తరలిపోయిన వసంతం కోసం

కరిగిపోని ఆశనై

చీకటి నవ్వునై వేచి ఉన్నాను..!🌑❤🌑


Wednesday, November 9, 2022

సహజం

 కడలికి కెరటం ఎంత సహజమో

నాలో నీ తలపు కూడా అంతే సహజం..!💓💓