Search This Blog

Showing posts with label భక్తి. Show all posts
Showing posts with label భక్తి. Show all posts

Monday, November 7, 2011

హే ప్రణయ విహారీ...


నీ వేణుగానం వినినంతనే
ఆలపించెను నా మనసు మోహన రాగం.,
నీ చిరుహాసం కనినంతనే
వివశనైతి నీ బాహువుల చేరుట కోసం.,
మనోహరమైన నీ రూపం దర్శించినంతనే 
ప్రేమావేశమై తపించేను నా హృదయం.,
హే వేణుధారీ! ప్రణయ విహారీ!
నీ వేణుగానామృతంలో ఓలలాడి 
పరవశించనీ నన్ను మరీ మరీ 
పలువరించనీ నీ నామ పంచాక్షరి !!!